Ramabanam OTT Release: రామబాణం మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా? సోనీ లివ్ ఎందుకిలా చేస్తోంది!
Ramabanam OTT Release: రామబాణం సినిమా ఇంకా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రాలేదు. ఈ సినిమా డిజిటల్ హక్కులను చేజిక్కించుకున్న సోనీ లివ్ ఇంకా ఆలస్యంఅ చేస్తోంది.
Ramabanam OTT Release: మ్యాచో హీరో గోపీచంద్ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది శ్రీవాస్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా ‘రామబాణం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మేలో విడుదలైన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. గోపీచంద్ ఖాతాలో మరో ప్లాఫ్‍గా మిగిలింది. అయితే, రామబాణం మూవీ ఓటీటీలో చూసేందుకు కొందరు వేచిచూస్తున్నారు. అయితే, ఇన్ని రోజులవుతున్నా రామబాణం ఓటీటీ విడుదల గురించి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.
రామబాణం సినిమా ఈ ఏడాది మే 3న థియేటర్లలో విడుదలై డివైడ్ టాక్‍తో పరాజయం చెందింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సోనీ లివ్ దక్కించుకుంది. జూన్ తొలి వారంలో రామబాణం ఓటీటీలోకి వస్తుందనే అంచనాలు వచ్చాయి. అయితే, అది జరగలేదు. సోనీ లివ్ ఇంకా ఆలస్యం చేస్తూనే ఉంది. హక్కులు చేతిలో ఉన్నా రామబాణం చిత్రాన్ని సోనీ లివ్ ఎందుకు స్ట్రీమింగ్ తీసుకురావడం లేదన్నది ప్రశ్నగా మారింది. అయితే, ఆగస్టులో సోనీ లివ్‍లో రామబాణం సినిమా స్ట్రీమింగ్‍కు వస్తుందని తాజాగా తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై సోనీ లివ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు, అక్కినేని అఖిల్ సినిమా ‘ఏజెంట్’ విషయంలోనూ సోనీ లివ్ ప్లాట్‍ఫామ్ ఆలస్యం చేస్తూనే ఉంది. మే19న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి తీసుకురానున్నట్టు గతంలో ప్రకటించింది. అయితే, ఆ తేదీన తీసుకురాలేదు. ఇంతవరకు కనీసం అప్‍డేట్ కూడా ఇవ్వలేదు. ఓటీటీ కోసం ఏజెంట్ మూవీని ఎడిటింగ్ చేస్తున్నారని వాదనలు వచ్చినా.. ఆ సినిమా నిర్మాత అనిల్ సుంకర ఆ వాదనలను ఖండించారు. ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడంపై ఆ ప్లాట్‍ఫామ్‍దే తుది నిర్ణయమని తేల్చేశారు.
ఈ సినిమాలను స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు సోనీ లివ్ ఎందుకు ఆలస్యం చేస్తుందన్నది ప్రశ్నగా మారింది. సోనీ లివ్ ఎందుకు ఇలా చేస్తోందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. డిజిటల్ హక్కులు చేతిలో ఉన్నా తాత్సారమెందుకని ప్రశ్నిస్తున్నారు.
రామబాణం విషయానికి వస్తే.. ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించాడు. డింపుల్ హయాతీ హీరోయిన్‍గే చేయగా.. జగపతి బాబు కీలక పాత్ర పోషించాడు. ఖుష్బు, నాజర్, తరుణ్ అరోరా, వెన్నెల కిషోర్, సచిన్ ఖేడేకర్, సత్య, అలీ ముఖ్య పాత్రల్లో కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.