Telangana Web series: తెలంగాణ ఫస్ట్ డిటెక్టివ్ వెబ్‌సిరీస్‌కు డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
Telangana Web series: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఫస్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ జీ5 ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వికటకవి పేరుతో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య, మేఘ ఆకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Telangana Web series: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన బలగం, దసరా, ఫిదాతో పాటు పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. ట్రెండ్ సెట్టర్ మూవీస్‌గా నిలిచాయి. తెలంగాణ నేపథ్యంలో ఫస్ట్ టైమ్ ఓ తెలుగు వెబ్‌సిరీస్ రూపొందుతోంది. వికటకవి పేరుతో తెరకెక్కనున్న ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తోన్న ఈ సిరీస్‌ను ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
జీ5 ఓటీటీలో...
జీ5 ఓటీటీ ద్వారా వికటకవి వెబ్‌సిరీస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు యూనిట్ చెబుతోంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్‌చేయబోతున్నట్లు ప్రకటించారు.
అమరగిరి శాపం..
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం. హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని ‘అమరగిరి’ అనే గ్రామాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. అలాంటి అమరగిరి గ్రామానికి డిటెక్టివ్ రామకృష్ణ వెళతాడు.
ఆ గ్రామానికి సంబంధించిన పురాతన కథలను, నేడు జరుగుతోన్న కుట్రల వెనుకున్న రహస్యాలను అతను వెలికితీస్తాడు. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంలో నీటిమట్టం పెరిగి కొన్ని సత్యాలు కనుమరుగైపోతాయి. దానికి సంబంధించిన వివరాలు ఎవరికీ తెలియని రహస్యాలుగా మిగిలిపోతాయి. వాటికి చేధించటానికి డిటెక్టివ్ రామకృష్ణ కాలానికి వ్యతిరేకంగా పోరాడాల్సివస్తుంది. ఈ ప్రయాణంలో రామకృష్ణకు ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? అనే పాయింట్‌తో వికటకవి వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది.
ఊహలకు అందని ట్విస్ట్‌లు...
కంప్లీట్ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వికటకవి వెబ్‌సిరీస్‌ను తెరకెక్కిస్తోన్నారు. డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నరేష్ అగస్త్య కనిపించబోతున్నాడు. మేఘా ఆకాష్ క్యారెక్టర్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఎపిసోడ్ ఊహలకు అందని మలుపులతో సాగుతుందని మేకర్స్ చెబుతోన్నారు.
ఈ వెబ్‌సిరీస్‌కు అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తుండగా షోయబ్ సిద్ధికీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వికటకవి వెబ్‌సిరీస్‌లో సిజ్జు , తారక్ పొన్నప్ప, రమ్యా రామకృష్ణన్, రఘు కుంచె, అమిత్ తివారి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
మత్తు వదలరా లో నెగెటివ్ రోల్...
మత్తువదలరా సినిమాలో పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌తో నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు నరేష్ అగస్త్య. ఆ తర్వాత మెన్ టూ, హ్యాపీ బర్త్‌డే, సేనాపతితో పాటు పలు సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేశాడు. ఇటీవల రిలీజైన కిస్మత్‌లో హీరోగా నటించాడు నరేష్ అగస్త్య.
తెలుగులో ఇరవై సినిమాలు...
మరోవైపు తెలుగులో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా అవకాశాల రేసులో మాత్రం ముందుంటుంది మేఘ ఆకాష్. నితిన్ లై మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాష్ ఆ తర్వాత అతడితోనే ఛల్ మోహనరంగ సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.
ఆ తర్వాత డియర్ మేఘ, రాజరాజ చోర, మను చరిత్రతో పాటు తెలుగులో ఇరవైకిపైగా సినిమాలు చేసింది. అవేవీ ఆమెకు విజయాల్ని తెచ్చిపెట్టలేకపోయాయి. తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో సహకుటుంబనాఃతో పాటు మరికొన్ని సినిమాలు చేస్తోంది మేఘా ఆకాష్.