Sundeep Kishan Web Series: టిల్లు స్క్వేర్ ద‌ర్శ‌కుడితో సందీప్ కిష‌న్ తెలుగు వెబ్‌సిరీస్ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?-sundeep kishan to do a telugu web series with tillu square director mallik ram streaming on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sundeep Kishan To Do A Telugu Web Series With Tillu Square Director Mallik Ram Streaming On Netflix

Sundeep Kishan Web Series: టిల్లు స్క్వేర్ ద‌ర్శ‌కుడితో సందీప్ కిష‌న్ తెలుగు వెబ్‌సిరీస్ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

Nelki Naresh Kumar HT Telugu
Mar 30, 2024 04:23 PM IST

Sundeep Kishan Telugu Web Series: సందీప్‌కిష‌న్ తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌కు టిల్లు స్క్వేర్ ఫేమ్ మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

సందీప్‌కిష‌న్
సందీప్‌కిష‌న్

Sundeep Kishan Telugu Web Series: బాలీవుడ్‌లో అగ్ర హీరోలు సైతం సినిమాల‌పై ఫోక‌స్ పెడుతూనే అడ‌పాద‌డ‌పా వెబ్‌సిరీస్‌లు చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్ప‌డు టాలీవుడ్‌లో ఊపందుకుంటోంది. ఇప్ప‌టికే వెంక‌టేష్, రానా, నాగ‌చైత‌న్య వంటి హీరోలు తెలుగులో వెబ్‌సిరీస్‌లు చేసి త‌మ టాలెంట్‌ను నిరూపించుకున్నారు. వెబ్‌సిరీస్‌ల‌లోకి ఎంట్రీ ఇస్తోన్న తెలుగు హీరోల జాబితాలో సందీప్ కిష‌న్ కూడా చేర‌బోతున్నాడు.

టిల్లు స్క్వేర్ డైరెక్ట‌ర్‌తో...

తెలుగులో సందీప్‌కిష‌న్ ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సిరీస్‌కు టిల్లు స్క్వేర్ ఫేమ్ మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు తెలిసింది. క్రైమ్‌, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అంశాల‌తో ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్క‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అల్ల‌రి న‌రేష్‌తో ఆ ఒక్క‌టి అడ‌క్కు సినిమాను నిర్మిస్తోన్న రాజీవ్ చిలుక...సందీప్‌కిష‌న్‌, మ‌ల్లిక్ రామ్ వెబ్‌సిరీస్‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

ఫ్యామిలీ మ్యాన్ ఫ‌స్ట్ సీజ‌న్‌లో...

వెబ్‌సిరీస్ చేయ‌డం సందీప్‌కిష‌న్‌కు ఇదే మొద‌టిసారి కాదు. రాజ్ డీకే ద‌ర్శ‌క‌త్వం రూపొందిన‌ ది ఫ్యామిలీ మ్యాన్ ఫ‌స్ట్ సీజ‌న్‌లో సందీప్ కిష‌న్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ఇండియాలోనే మోస్ట్ పాపుల‌ర్‌గా నిలిచిన ఈ వెబ్‌సిరీస్‌లో ఆర్మీ మేజ‌ర్ విక్ర‌మ్ అనే పాత్ర‌లో క‌నిపించాడు. ది ఫ్యామిలీ మ్యాన్ త‌ర్వాత సినిమాల‌పై దృష్టిపెట్టిన సందీప్ కిష‌న్ సిరీస్‌లో క‌నిపించ‌లేదు.

ఊరు పేరు భైర‌వ కోన‌...

స‌క్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తెలుగు, త‌మిళ భాష‌ల్లో డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు సందీప్‌కిష‌న్‌. ఇటీవ‌లే ఊరు పేరు భైర‌వ‌కోన సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. నిర్మాత‌ల‌కు మోస్తారు లాభాల‌ను తెచ్చిపెట్టింది.

కాలేజీ ల‌వ్ స్టోరీ...

తాజాగా శ‌నివారం రోజు వైబ్ పేరుతో కొత్త సినిమాను సందీప్‌కిష‌న్ అనౌన్స్ చేశాడు. కాలేజీ స్టూడెంట్స్ జీవితాల నేప‌థ్యంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న వైబ్ మూవీకి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ ఆర్ఎస్ జే స్వ‌రూప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. 2025 వేస‌విలో వైబ్ మూవీ రిలీజ్ కానుంది.

త‌మిళంలో మ‌యావ‌న్ 2తో పాటు ధ‌నుష్‌తో రాయ‌న్ సినిమా చేస్తోన్నాడు సందీప్ కిష‌న్‌. ధ‌నుష్ హీరోగా న‌టించిన కెప్టెన్ మిల్ల‌ర్‌లోనూ సందీప్‌కిష‌న్ గెస్ట్ రోల్ చేశాడు.

టిల్లు స్క్వేర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌...

మ‌రోవైపు టిల్లు స్క్వేర్‌తో కెరీర్‌లో ఫ‌స్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్‌. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించిన ఈ మూవీ శుక్ర‌వారం రోజు 23 7 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. టిల్లు స్క్వేర్ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించింది. టిల్లు స్క్వేర్ కంటే ముందు న‌రుడా డోన‌రుడా, అద్భుతం సినిమాలు చేశాడు మ‌ల్లిక్ రామ్‌.

WhatsApp channel

టాపిక్