Komalee Prasad: తెలుగు హీరోయిన్ అనగానే బాలీవుడ్‌లో ర్యాగింగ్ చేశారు - కోమలి ప్రసాద్ కామెంట్స్ వైరల్
Komalee Prasad: సౌత్ నుంచి వచ్చానని తెలియగానే బాలీవుడ్‌లో తనను ర్యాగింగ్ చేశారని కోమలి ప్రసాద్ అన్నది. టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లపై కొనసాగుతోన్న వివక్షపై కోమలి ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Komalee Prasad: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావన్నది అపోహ మాత్రమేనని కోమలి ప్రసాద్ చెప్పింది. కోమలి ప్రసాద్ హీరోయిన్‌గా నటించిన శశివదనే మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఏప్రిల్ 19న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ లో టాలీవుడ్ హీరోయిన్లపై కొనసాగుతోన్న వివక్షపై కోమలి ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ముంబై నుంచి వచ్చానని చెప్పమన్నారు...
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న సమయంలో మీరు ముంబై నుంచి వచ్చారని, కర్ణాటకలో పుట్టి పెరిగానని చెప్పుకోమని అందరూ సలహా ఇచ్చారు. తెలుగు అమ్మాయి అని ఎవరికి చెప్పొదని అన్నారు. అలా ఎందుకు చెప్పారో నాకు మొదట్లో అర్థం కాలేదు. టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావనే భయం ఎక్కువగా ఉంది. అది ఎక్కడ నుంచి వచ్చిందో తెలియడం లేదని కోమలి ప్రసాద్ అన్నది.
ఏ డైరెక్టర్ చెప్పడం లేదు...
. తెలుగు అమ్మాయి కావడం వల్లే నాకు హిట్, మోడ్రన్ లవ్, లూజర్‌తో పాటు చాలా సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో అవకాశాలు వచ్చాయని చెప్పింది. సక్సెస్ కోసం అమ్మ పెట్టిన పేరును మార్చుకోవడం కరెక్ట్ కాదని కోమలి ప్రసాద్ అన్నది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వమని ఏ డైరెక్టర్ చెప్పడం లేదు. ఇండస్ట్రీలో అలా లేదు. అయినా ఈ అపోహ ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదని కోమలి ప్రసాద్ చెప్పింది. ఈ అపోహ పోవాలని తెలిపింది.
బాలీవుడ్‌లో ర్యాగింగ్...
తమిళంలో పాటు మిగిలిన భాషల్లో తెలుగు నటులు, హీరోయిన్ల డెడికేషన్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. తెలుగులో మాత్రం అలాంటి గుర్తింపు తక్కువేనని తెలిపింది. సౌత్ నుంచి వచ్చానని తెలియగానే బాలీవుడ్‌లో చాలా ర్యాగింగ్ చేశారని కోమలి ప్రసాద్ అన్నది.
తమిళం డెబ్యూ...
ఈ ఏడాది తాను తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కోమలి ప్రసాద్ చెప్పింది. ఓ పెద్ద డైరెక్టర్‌తో ఈ సినిమా చేస్తున్నట్లు తెలిపింది. ఆ దర్శకుడి పేరును ఇప్పుడు రివీల్ చేయలేనని అన్నది. ఇరవై రోజుల పాటు ఈ సినిమా వర్క్‌షాప్‌కు చేశానని, దాదాపు ఇరవై రోజుల పాటు పదిహేను, పదహారు గంటల పాటు కష్టపడ్డానని తెలిపింది. ఇరవై రోజుల్లోనే తమిళం మొత్తం నేర్చుకున్నాడు. నా డెడికేషన్ చూసి డైరెక్టర్ మెచ్చుకున్నారని కోమలి ప్రసాద్ చెప్పింది.
డాక్టర్...యాక్టర్...
స్వతహాగా డాక్టర్ అయిన కోమలి ప్రసాద్ యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో సినిమాల్లోకి వచ్చింది. 2016 వచ్చిన నేను సీతాదేవి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నెపోలియన్, అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒకటి సినిమాలు చేసింది. రౌడీ బాయ్స్, హిట్ ది సెకండ్ కేస్ సినిమాలు నటిగా కోమలీ ప్రసాద్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. శశివదనే తో పాటు తెలుగులో మరో రెండు సినిమాలు చేస్తోంది. శశివదనే సినిమాలో పలాస 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తోన్నాడు.విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది.