Family Star Runtime: ఎక్కువ రన్‍టైమ్‍తో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా!: వివరాలివే-family star movie updates vijay deverakonda mrunal thakur movie reportedly coming with lengthy runtime ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Family Star Runtime: ఎక్కువ రన్‍టైమ్‍తో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా!: వివరాలివే

Family Star Runtime: ఎక్కువ రన్‍టైమ్‍తో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా!: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 30, 2024 03:33 PM IST

Family Star Movie Runtime: ఫ్యామిలీ స్టార్ సినిమా రన్‍టైమ్ లాక్ అయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఎక్కువ నిడివితోనే రానుందని సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలివే..

Family Star Runtime: ఎక్కువ రన్‍టైమ్‍తో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా
Family Star Runtime: ఎక్కువ రన్‍టైమ్‍తో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా

Family Star: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీపై ఫుల్ హైప్ ఉంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్‌ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కించినట్టు అర్థమవుతంది. గతంలో గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు విజయ్ - డైరెక్టర్ పరుశరామ్. ఫ్యామిలీ స్టార్ కోసం వారి కాంబో రిపీట్ అవడంతోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 5వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ సినిమా రన్‍టైమ్ లాక్ అయినట్టు సమాచారం బయటికి వచ్చింది.

yearly horoscope entry point

రన్‍టైమ్ ఇదే..

ఫ్యామిలీ స్టార్ సినిమా సెన్సార్ ఇటీవలే పూర్తయినట్టు తెలుస్తోంది. 2 గంటల 40 నిమిషాల (160 నిమిషాలు) రన్‍టైమ్‍తో ఈ చిత్రం రానుందని సమాచారం. త్వరలోనే ఈ విషయం అధికారికంగా వెల్లడి కానుంది. సాధారణంగా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‍మెంట్ చిత్రానికి ఇది ఎక్కువ రన్‍టైమే.

160 నిమిషాల పాటు ప్రేక్షకులను అలరించాలంటే ఫ్యామిలీ స్టార్ మూవీ కథనం ఆసక్తికరంగా ఉండాల్సింది. స్క్రీన్‍ప్లే కూడా ఫ్లాట్‍గా కాకుండా ఇంట్రెస్టింగ్‍గా, గ్రిప్పింగ్‍గా ఉండే రన్‍టైమ్ పెద్ద సమస్య కాకపోవచ్చు. అయితే, మధ్యలో ప్రేక్షకులకు బోర్ అనిపిస్తే ఇబ్బందులు తప్పకపోవచ్చు.

డియర్ కామ్రెడ్, ఖుషి ఇలా..

విజయ్ దేవరకొండ కెరీర్లో డియర్ కామ్రెడ్ (2019) మంచి సినిమాగా నిలిచింది. ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చినా.. రన్‍టైమ్ మొదట్లో బాగా దెబ్బవేసింది. ఈ చిత్రం ప్రారంభంలో ఏకంగా సుమారు 3 గంటల రన్‍టైమ్‍తో వచ్చింది. ఇదే మైనస్ అయింది. ఆ తర్వాత కొన్ని సీన్లు కట్ చేసి రన్‍టైమ్ తగ్గించినా.. బాక్సాఫీస్ దగ్గర పుంజుకోలేకపోయింది. విజయ్ హీరోగా నటించిన ఖుషి (2023) చిత్రం గతేడాది రిలీజై నిరాశపరిచింది. ఈ చిత్రం కూడా 2 గంటల 45 నిమిషాల రన్‍టైమ్‍తో వచ్చింది. విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‍ బస్టర్ అర్జున్ రెడ్డి (2017) రన్‍టైమ్ 3 గంటల 2 నిమిషాలు. అయితే, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ మిగితా వాటితో పోలిస్తే విభిన్నం.

విజయ్ - పరుశురామ్ కాంబినేషన్‍లో గీతగోవిందం (2018) సినిమా 2 గంటల 28 నిమిషాల రన్‍టైమ్‍తో వచ్చింది. ఈ చిత్రం ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‍గా సాగడంతో భారీ హిట్ అయింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కోసం ఈ కాంబో మరింత ఎక్కువగా 2 గంటల 40 నిమిషాల రన్‍టైమ్‍కు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కూడా ఫుల్ లెంగ్త్ అలరిస్తే నిడివి పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు.

ఫ్యామిలీ స్టార్ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన మూడు పాటలు బాగా పాపులర్ అయ్యాయి. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు నిర్మించారు. ఈ చిత్రం భారీ హిట్ అవుతుందని మూవీ టీమ్ చాలా కాన్ఫిడెంట్‍గా ఉంది. ఈ చిత్రానికి వేసవి సెలవులు కూడా ప్లస్‍గా ఉన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే ఫ్యామిలీ స్టార్ సూపర్ హిట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 5న తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది.

Whats_app_banner