Anatomy Of a Fall: 2024 ఆస్కార్ విన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది - తెలుగులోనూ స్ట్రీమింగ్
Anatomy Of a Fall: ఆస్కార్ విన్నింగ్ మూవీ అనాటమీ ఆఫ్ ఏ ఫాల్… అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ఫ్రెంచ్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ఐదు విభాగాల్లో నామినేషన్...
ఇటీవల ప్రకటించిన 96వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ అవార్డును గెలుచుకున్నది. 96వ ఆస్కార్ అవార్డుల్లో మొత్తం ఐదు విభాగాల్లో అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ నామినేట్ అయ్యింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్ట, బెస్ట్ హీరోయిన్‌తో పాటు స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో ఈ మూవీ నామినేషన్‌ను దక్కించుకున్నది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఈ మూవీకి ఆస్కార్ దక్కింది.
వందకుపైగా అవార్డులు…
ఆస్కార్‌తో పాటు వరల్డ్ వైడ్‌గా వందకుపైగా అవార్డులను గెలుచుకున్నది అనాటమీ ఆఫ్ ఏ ఫాల్. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ మూవీగా నిలిచింది. బ్రిటీష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్, సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్, యూరోపియన్ ఫిల్మ్ అవార్డ్స్‌తో పాలు పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ అయిన ఈ మూవీ ప్రతి చోట బెస్ట్ ఫిల్మ్‌గా అవార్డులను దక్కించుకున్నది.
సాండ్ర హల్లర్...
అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ మూవీలో సాండ్ర హల్లర్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసల్ని దక్కించుకున్నది సాండ్ర హల్లర్. అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ మూవీకి గాను ఆమెకు ఆస్కార్ వరించే అవకాశం ఉన్నట్లు బలంగా ప్రచారం జరిగింది. తృటిలో అవార్డును మిస్సయింది. సాండ్ర హల్లర్‌తో పాటు స్వాన్ అర్లాడ్, మిలో మకాడో గ్రానర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.
భర్త హత్య కేసులో...
సాండ్ర వోయిటర్ ఓ రచయిత. మంచుకొండల్లోని తన ఫ్యామిలీతో ఒంటరిగా జీవిస్తుంటుంది.వోయిలర్ భర్త అనుమానస్పద రీతిలో కన్నుమూస్తాడు. ఆ ప్రాంతంలో వోయిటర్ తప్ప మరెవరూ లేకపోవడంతో ఆమె ఈ హత్య చేసిందని పోలీసులు అనుమానిస్తుంటారు. అసలు ఈ హత్య ఎవరు చేశారు? ఈ నేరం నుంచి వోయిటర్ ఎలా బయటపడింది అన్నదే ఈ మూవీ కథ.
మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు, టర్న్‌లతో జస్టిన్ ట్రైట్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఆరు మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 35 మిలియన్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఫ్రెంచ్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలోని విజువల్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.