Malayalam Horror Movies: ఓటీటీలో మిస్సవ్వకుండా చూడాల్సిన మలయాళం హారర్ మూవీస్ ఏవంటే?
లో బడ్జెట్‌తో తెరకెక్కిన కొన్ని మలయాళ హారర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి.డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో రూపొందిన ఈ హారర్ మూవీస్ ఏ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోన్నాయంటే...
(1 / 5)
హారర్ కామెడీ కథాంశంతో రూపొందిన రొమాంచం మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రెండు కోట్ల బడ్జెట్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ 70 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
(2 / 5)
సీనియర్ నటి రేవతి, షేన్ నిగమ్ ప్రధాన పాత్రల్లో సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన భూతకాలం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననల్ని అందుకున్నది. ఈ మలయాళం హారర్ మూవీని సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు.
(3 / 5)
మమ్ముట్టి హీరోగా నటించిన రీసెంట్ మలయాళం హారర్ మూవీ భ్రమయుగం థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపించింది. బ్లాక్ అండ్ వైట్ ఫార్మెట్‌లో దర్శకుడు రాహుల్ సదాశివన్ ఈ హీరర్ మూవీని తెరకెక్కించాడు. భ్రమయుగం సోనీ లివ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది
(4 / 5)
టొవినో థామస్ హీరోగా నటించిన నీలవెలిచామ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మలయాళం హారర్ మూవీ గత ఏడాది థియేటర్లలో రిలీజైంది.
ఇతర గ్యాలరీలు