OTT Releases This Week: ఓటీటీ ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌ - ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!-the road to boys hostel new movies and web series releasing ott this week netflix amazon prime video zee5 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  The Road To Boys Hostel New Movies And Web Series Releasing Ott This Week Netflix Amazon Prime Video Zee5

OTT Releases This Week: ఓటీటీ ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌ - ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

Nelki Naresh Kumar HT Telugu
Nov 09, 2023 09:47 AM IST

OTT Releases This Week: ఈ వారం తెలుగు, త‌మిళంతో పాటు వివిధ భాష‌ల‌కు చెందిన సినిమాలు, సిరీస్‌లు ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు, సిరీస్‌లు ఏవంటే?

త్రిష ది రోడ్ మూవీ
త్రిష ది రోడ్ మూవీ

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌

లేబుల్ వెబ్‌సిరీస్‌

జ‌ర్నీ ఫేమ్ జై ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లేబుల్ వెబ్‌సిరీస్ న‌వంబ‌ర్ 10 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో మురికివాడ‌ల హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం పోరాడే లాయ‌ర్‌గా జై క‌నిపించ‌బోతున్నాడు. ఈ సిరీస్‌కు అరుణ్‌రాజా కామ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

వాలాట్టీ మూవీ

ది శాంటా క్లాజెస్ వెబ్‌సిరీస్‌

నెట్‌ఫ్లిక్స్‌

ఇరుగ‌ప‌త్రు

వెంక‌ట్‌ప్ర‌భు, శ్ర‌ద్ధా శ్రీనాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ సూప‌ర్ హిట్ మూవీ ఇరుగ‌పాత్రు న‌వంబ‌ర్ 10న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. రొమాంటిక్ డ్రామా మూవీకి యువ‌రాజ్ డైరెక్ట‌ర్‌.

ది కిల్ల‌ర్‌

సైబ‌ర్ బంక‌ర్‌

ఎస్కేపింగ్ ట్వీన్ ఫ్లేమ్స్‌

రాబీ విలియ‌మ్స్‌

ఫేమ్ ఆఫ్ట‌ర్ ఫేమ్‌

అమెజాన్ ప్రైమ్ వీడియో

షూట్ బూట్ త్రీ

స్నేహ‌, వెంక‌ట్ ప్ర‌భు లీడ్ రోల్స్ చేసిన త‌మిళ మూవీ షూట్ బూల్ త్రీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

బీటీఎస్ ఎట్ టూ క‌మ్‌

పిప్పా

రెయిన్ బో రిస్తా

007 రోడ్ టూ ఏ మిలాన్‌

ఆహా ఓటీటీ

ది రోడ్‌

త్రిష హీరోయిన్‌గా న‌టించిన ది రోడ్ మూవీ ఈ వారం ఆహా ఓటీటీ ద్వారా తెలుగుతో పాటు త‌మిళ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఫేక్ యాక్సిడెంట్స్ చేసే ఓ ముఠాను ఎదురించి పోరాడిన యువ‌తి క‌థ‌తో ద‌ర్శ‌కుడు అరుణ్ వ‌సీగ‌ర‌ణ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు.

జీ5 ఓటీటీ

గూమ‌ర్‌

బాలీవుడ్ మూవీ గూమ‌ర్ మూవీ జీ5 ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. అభిషేక్‌బ‌చ్చ‌న్‌, స‌యామీ ఖేర్ కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ మూవీని డైరెక్ట‌ర్ ఆర్ బాల్కీ తెర‌కెక్కించాడు.

ఈటీవీ విన్‌

బాయ్స్ హాస్ట‌ల్‌

క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ హాస్ట‌ల్ హుదుగురు బేకాగిద్దారే తెలుగులో బాయ్స్ హాస్ట‌ల్ పేరుతో తెలుగులో రిలీజైంది. థియేట‌ర్ల‌లో మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ డ‌బ్బింగ్ మూవీ న‌వంబ‌ర్ 10న ఈటీవీ విన్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.