Naga Chaitanya Thandel: ఇండియా - పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో తండేల్ - స్టోరీ రివీల్ చేసిన నాగచైతన్య
లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తండేల్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.
(1 / 6)
తండేల్ మూవీ స్టోరీలైన్‌ను నాగచైతన్య రివీల్ చేశాడు. యథార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి తండేల్ మూవీని తెరకెక్కిస్తోన్నట్లు నాగచైతన్య చెప్పాడు.
(2 / 6)
2018లో శ్రీకాకుళానికి చెందిన ఓ జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. అతడిని పాకిస్థాన్ నావిక దళం అరెస్ట్ చేసింది. ఆ సంఘటన స్ఫూర్తితో తండేల్ మూవీ తెరకెక్కుతోన్నట్లు నాగచైతన్య ప్రకటించాడు.
(3 / 6)
ఏడాదిన్నర పాటు పాకిస్థాన్ జైలులో శిక్షను అనుభవించిన ఆ జాలరి ఎలా రిలీజయ్యాడు? ఆ జాలరిని క్షేమంగా ఇండియా రప్పించేందుకు అతడి ప్రియురాలు ఎలాంటి పోరాటం చేసిందనే అంశాలను తండేల్ సినిమాలో చూపించబోతున్నట్లు నాగచైతన్య తెలిపాడు.
(4 / 6)
తండేల్ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి డీగ్లామర్ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం ఇద్దరు శ్రీకాకుళం యాసను నేర్చుకున్నట్లు సమాచారం.
(5 / 6)
ప్రేమమ్, సవ్యసాచి తర్వాత నాగచైతన్య, డైరెక్టర్ చందూ మొండేటి కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ఇది.
ఇతర గ్యాలరీలు