Inspector Rishi: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న న‌వీన్ చంద్ర త‌మిళ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ వెబ్‌సిరీస్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-inspector rishi web series ott release date naveen chandra tamil web series streaming on amazon prime ott on march 29th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Inspector Rishi Web Series Ott Release Date Naveen Chandra Tamil Web Series Streaming On Amazon Prime Ott On March 29th

Inspector Rishi: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న న‌వీన్ చంద్ర త‌మిళ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ వెబ్‌సిరీస్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Mar 14, 2024 12:35 PM IST

Inspector Rishi Web Series: న‌వీన్ చంద్ర ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న త‌మిళ వెబ్‌సిరీస్ ఇన్‌స్పెక్ట‌ర్ రిషి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స‌యింది. క్రైమ్ డ్రామా థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

ఇన్‌స్పెక్ట‌ర్ రిషి
ఇన్‌స్పెక్ట‌ర్ రిషి

Inspector Rishi Web Series: హీరోగా, విల‌న్‌గానే కాకుండా డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ వెర్స‌టైల్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు న‌వీన్ చంద్ర‌. తెలుగులో బిజీగా ఉన్న న‌వీన్ చంద్ర త‌మిళంలో చ‌క్క‌టి అవ‌కాశాల‌ను అందుకుంటున్నాడు. తాజాగా ఓ వెబ్‌సిరీస్‌తో ఈ నెలాఖ‌రున త‌మిళ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు న‌వీన్ చంద్ర‌.

ఇన్‌స్పెక్ట‌ర్ రిషి...

న‌వీన్ చంద్ర లీడ్ రోల్‌లో క్రైమ్ డ్రామా థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఇన్‌స్పెక్ట‌ర్ రిషి పేరుతో త‌మిళంలో ఓ వెబ్‌సిరీస్ తెర‌కెక్కింది. ఈ వెబ్‌సిరీస్‌కు సుఖ్‌దేవ్ ల‌హిరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నందిని క్రియేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. మార్చి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.

గురువారం ఇన్‌స్పెక్ట‌ర్ రిషి స్ట్రీమింగ్ డేట్‌ను అమెజాన్ ప్రైమ్ అఫీషియ‌ల్‌గా వెల్ల‌డించింది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో న‌వీన్ చంద్ర చేతిలో గ‌న్ ప‌ట్టుకొని వెన‌క్కి తిరిగి చూస్తున్న‌ట్లుగా ఇంటెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు.

అత‌డి చుట్టూ ఎత్తైన వృక్షాల‌తో అడ‌వి క‌నిపిస్తోంది. త‌ల‌పై కొమ్ముల‌తో పొడ‌వైన వెంట్రుక‌ల‌తో ఓ వింత ఆకారం కూడా ఈ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తోంది. క్రైమ్ ఎలిమెంట్స్‌కు సూప‌ర్ నాచుర‌ల్ అంశాల‌ను మిక్స్ చేసి ఈ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించిన‌ట్లు పోస్ట‌ర్ చూస్తే క‌నిపిస్తోంది.

త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఇన్‌స్పెక్ట‌ర్ రిషి స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు అమెజాన్ ప్రైమ్ ప్ర‌క‌టించింది. ఇన్‌స్పెక్ట‌ర్ రిషి పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

న‌వీన్ చంద్ర పోలీస్ ఆఫీస‌ర్‌...

ఇన్‌స్పెక్ట‌ర్ రిషిలో న‌వీన్ చంద్ర పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. న‌వీన్ చంద్ర‌తో పాటు ఈ వెబ్‌సిరీస్‌లో సునైన కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

అందాల రాక్ష‌సితో ఎంట్రీ...

అందాల రాక్ష‌సి సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు న‌వీన్ చంద్ర‌. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం అందుకున్నాడు. ఆ త‌ర్వాత హీరోగా ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది, భ‌మ్ భోలేనాథ్‌తో కొన్ని సినిమాలు చేశాడు. స‌రైన విజ‌యాలు ద‌క్క‌క‌పోవ‌డంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారాడు. నేను లోక‌ల్‌, అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌తో పాటు ప‌లు సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించాడు.

జిగ‌ర్తాండ డ‌బుల్ ఎక్స్‌...

లారెన్స్‌, ఎస్‌జే సూర్య హీరోలుగా గ‌త ఏడాది త‌మిళంలో రిలీజైన జిగ‌ర్తాండ డ‌బుల్ ఎక్స్ మూవీతో కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యాడు. త‌న విల‌నిజంతో ఆక‌ట్టుకున్నాడు. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న గేమ్ ఛేంజ‌ర్‌లో న‌వీన్ చంద్ర ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఇటీవ‌లే రామ్‌చ‌ర‌ణ్, న‌వీన్ చంద్ర‌ల‌పై హైద‌రాబాద్‌లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాడు డైరెక్ట‌ర్ శంక‌ర్‌.ఎలెవెన్ పేరుతో తెర‌కెక్కుతోన్న బైలింగ్వ‌ల్ మూవీలో న‌వీన్ చంద్ర హీరోగా న‌టిస్తున్నాడు.

సునైన కెరీర్ తెలుగు సినిమాల‌తోనే మొద‌లైంది. టెన్త్‌క్లాస్‌, స‌మ్‌థింగ్ స్పెష‌ల్ సినిమాల్లో న‌టించింది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత శ్రీవిష్ణు రాజ‌రాజ‌చోర‌తో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. సునైన త‌మిళంలో చేసిన లాఠీ, రెజీనా సినిమాలు తెలుగులోకి అదే పేర్ల‌తో డ‌బ్ అయ్యాయి.

IPL_Entry_Point