HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.

Telugu News

ముంబయి నటి కేసు-ముగ్గురు ఐపీఎస్ లపై ఏపీ సర్కార్ సస్పెన్షన్ వేటు

IPS Officers Suspended : ముంబయి నటి కేసు-ముగ్గురు ఐపీఎస్ లపై ఏపీ సర్కార్ సస్పెన్షన్ వేటు

07:15 PM IST

  • IPS Officers Suspended : మంబయి నటి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ లపై ఏపీ సర్కార్ వేటు వేసింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Hyderabad Metro : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం- ఈ నెల 17న అర్ధరాత్రి 2 వరకు మెట్రో సేవలు

06:28 PM IST

  • Hyderabad Metro : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం దృష్ట్యా మెట్రో సేవలు పొడిగించింది. సెప్టెంబర్ 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది.

YS Jagan : ఇకనైనా కళ్లు తెరవండి చంద్రబాబు.. వెంటనే ఆ లేఖను వెనక్కి తీసుకోండి: జగన్

04:47 PM IST

  • YS Jagan : సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. రాష్ట్రానికి ఎంబీబీఎస్‌ అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం దారుణమన్నారు. ఇకనైనా కళ్లు తెరిచి లేఖను వెనక్కి తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.

Revanth Reddy House : సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం

03:39 PM IST

  • Revanth Reddy House : సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం రేపింది. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్‌ను సెక్యూరిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఆ బ్యాగ్ ఎవరు పెట్టారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్‌లో హైటెన్షన్ కొనసాగుతున్న సమయంలో ఈ బ్యాగ్ హాట్ టాపిక్‌గా మారింది.

Choose The Right Bike : మీ ఎత్తు ప్రకారం ఏ బైక్ అయితే బాగుంటుంది? రైడింగ్ ఈజీగా ఉంటుంది?

06:00 PM IST

  • Choose The Right Bike : చాలా మంది బైక్ ఫీచర్లను చూసి కొంటారు. అయితే దీనితోపాటుగా మీ ఎత్తును బైక్ బరువును కూడా చూసుకోవాలి. నడిపేందుకు కంఫర్ట్‌గా ఉంటుందో చూసుకోవాలి. అప్పుడే దానిపై రైడింగ్ హాయిగా చేయవచ్చు. మీ ఎత్తు, బరువు ప్రకారం ఏ బైక్ అయితే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం..

Hyderabad ECIL Trade Apprentice : హైదరాబాద్ ఈసీఐఎల్ లో 437 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, ఇలా దరఖాస్తు చేసుకోండి

05:35 PM IST

  •  Hyderabad ECIL Trade Apprentice : హైదరాబాద్ లోని ఈసీఐఎల్ లో 437 ట్రేడ్ అప్రెంటిస్ షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన ఐటీఐ అభ్యర్థులు ఈ నెల 29లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ లో అప్రెంటిస్ గా నమోదు చేసుకోవాలి.

Arvind Kejriwal Resignation : అరవింద్ కేజ్రీవాల్ ముందస్తు ఎన్నికలకు వెళితే మళ్లీ అధికారంలోకి వస్తారా?

04:03 PM IST

  • Arvind Kejriwal Resignation : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనకు న్యాయస్థానంలో న్యాయం జరిగిందని, అయితే ఇప్పుడు ప్రజల కోర్టులో న్యాయం జరగాలని కోరుకుంటున్నానని కేజ్రీవాల్ చెప్పారు. అయితే ఆప్ ముందస్తు ఎన్నికల వెళితే ఫలితం ఎలా ఉంటుందని చాలా మంది చర్చిస్తున్నారు. 

Arvind Kejriwal : ‘రెండు రోజుల్లో రాజీనామా చేస్తా’- అరవింద్​ కేజ్రీవాల్ సంచలన ప్రకటన!​

12:58 PM IST

  • Arvind Kejriwal resignation : రెండు రోజుల్లో దిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు. ప్రజల తీర్పు వచ్చిన తర్వాతే, తిరిగి సీఎం సీటులో కూర్చుంటానని కేజ్రీవాల్​ అన్నారు.

Smartphones Under 10k : రూ.10వేలలోపు స్మార్ట్‌ఫోన్లు.. 16జీబీ ర్యామ్, 108ఎంపీ కెమెరా!

04:30 PM IST

Smartphones Under 10k : తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్లు కొనాలని చూస్తున్నారా? అయితే మీకోసం మంచి ఆప్షన్స్ ఉన్నాయి. రూ.10,000 కంటే తక్కువ ధరలో వస్తున్న కొన్ని స్మార్ట్‌పోన్ల గురించి తెలుసుకుందాం..

Anchor Shyamala : పిల్లికి కూడా బిచ్చం పెట్టని మీరా వరదసాయం గురించి మాట్లాడేది- సీఎం చంద్రబాబుపై యాంకర్ శ్యామల సెటైర్లు

03:42 PM IST

  • Anchor Shyamala On CBN : వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల... సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. రెండు ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్ల వరకు ఎలా సంపాదించారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంతో ఎవరికైనా ఇంత సాయం చేసి ఉంటే చెప్పాలని ప్రశ్నించారు. జగన్ పై విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

Khairtabad Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు

04:48 PM IST

  • Khairtabad Ganesh : ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో బడా గణేష్ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఖైరతాబాద్ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. దర్శనానికి ఇవాళే చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.

Budameru Flood: ప్రళయానికి పక్షం రోజులు... ఇంకా వరద ముంపులోనే విజయవాడ రూరల్ గ్రామాలు, రాకపోకలు నిలిచి దయనీయ పరిస్థితులు

01:33 PM IST

  • Budameru Flood: విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తి సరిగ్గా పక్షం రోజులైంది. వరద ముంపు నుంచి విజయవాడ నగరం కోలుకున్నా ఇంకా రూరల్ గ్రామాలు తేరుకోలేదు. రోడ్లు కూడా వరద ముంపులోనే ఉన్నాయి. వేలాదిమంది ప్రజలకు విజయవాడ నగరంలో రాకపోకలు తెగిపోయాయి.వరద ముంచెత్తాక ప్రభుత్వ సాయం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Business Loan : మీరు బిజినెస్ లోన్ పొందాలని ఆలోచిస్తున్నారా? ముందు ఇవి తెలుసుకోండి

03:00 PM IST

  • Business Loan : బ్యాంకుల్లో వ్యాపార రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు బ్యాంకులు కొన్ని ముఖ్యమైన అంశాలను చూస్తాయి. వాటి ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. వీటిలో మొదటిది క్రెడిట్ స్కోర్. ఇది కాకుండా మరికొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. అవేంటో చూడండి..

Khairatabad Ganesh : గణపయ్య సాక్షిగా ఇవేం పాడు పనులయ్యా..! పోలీసుల అదుపులో 285 మంది!

12:32 PM IST

  • Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి బడా గణపతిని దర్శించుకుంటున్నారు. ఈ సమయంలో కొందరు పోకిరీలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా 285 మంది పట్టుబడ్డారు.

AP Sub Registrar Offices : సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రాచరిక విధానానికి స్వస్తి, సామాన్యుడి గౌరవం పెంచేలా కీలక నిర్ణయం

02:45 PM IST

  • AP Sub Registrar Offices : ఏపీ ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొత్త మార్పులు చేసింది. ఏళ్ల నాటి రాచరికపు విధానానికి స్వస్తి పలికింది. సబ్ రిజిస్ట్రార్ ఎత్తైన కుర్చీలో కూర్చోవడం, చుట్టూ రెడ్ క్లాత్ తో ఉన్న పోడియం ఉండేవి. తక్షణమే వీటిని తొలగించాలని ఆదేశించింది.  

Hyundai Alcazar vs MG Hector Plus : ఈ రెండు బడా ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ?

11:33 AM IST

  • Alcazar vs Hector Plus : 2024 హ్యుందాయ్​ అల్కాజార్​ వర్సెస్​ ఎంజీ హెక్టార్​ ప్లస్​.. ఈ రెండు బడా ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? ఇక్కడ తెలుసుకోండి..

Simhachalam Tour : వైజాగ్ - సింహాచలం ట్రిప్ - అప్పన్న దర్శనంతో పాటు సబ్ మెరైన్ మ్యూజియం చూడొచ్చు! ఇదిగో తాజా ప్యాకేజీ

01:11 PM IST

  • సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నారా..?  అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ 'టూరిజం 'వైజాగ్ బ్లిస్' ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో భాగంగా వైజాగ్ సిటీలోని టూరిస్ట్ ప్లేసులు కూడా చూడొచ్చు. రెండు రోజుల్లో ట్రిప్ పూర్తి అవుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి….

Medak Crime News : పార్కింగ్ ప్లేస్ లో రెక్కీ, ఆపై చోరీ - 17 బైకులు స్వాధీనం, నిందితుడు అరెస్ట్

12:20 PM IST

  • పార్కింగ్ ప్లేస్ లో ఉండే బైకులను చోరీ చేస్తున్న వ్యక్తిని  పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా అతని వద్ద నుంచి 17 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని కొనుగోలు చేసిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మెదక్ ఎస్పీ వెల్లడించారు.

AP New Liquor Policy : లిక్కర్ ప్రియులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ, కర్ణాటక కంటే తక్కువ ధరకే మద్యం!

11:21 AM IST

  • AP New Liquor Policy : ఏపీలోని మందు బాబులకు త్వరలోనే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇన్నాళ్లు మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతున్న వారికి బిగ్ రిలీఫ్ దక్కనుంది. అవును.. ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Attack on TDP Office case : తెలియదు.. గుర్తులేదు.. పోలీసుల విచారణలో వైసీపీ నేతల సమాధానం ఇదే!

01:09 PM IST

  • Attack on TDP Office case : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే.. పోలీసుల విచారణకు వైసీపీ నేతలు సహకరించడం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏది అడిగినా.. తెలియదు.. గుర్తు లేదని చెబుతున్నట్టు వివరించారు.

Bold Movie OTT: ఓటీటీలో అద‌ర‌గొడుతోన్న తెలుగు బోల్డ్ మూవీ - 40 మిలియ‌న్ల వ్యూస్‌!

07:34 PM IST

Bold Movie OTT: ఓటీటీలో తెలుగు బోల్డ్ మూవీ హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్ అద‌ర‌గొడుతోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైన ఈ మూవీ న‌ల‌భై మిలియ‌న్ల స్ట్రీమింగ్ మిన‌ట్స్ వ్యూస్‌ను ద‌క్కించుకున్న‌ది.  హ‌నీమూన్ ఎక్స్‌ప్రెస్‌లో చైత‌న్య‌రావు, హెబ్బాప‌టేల్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

Family Cars : ఫ్యామిలీతో వెళ్లేందుకు ఇవి బెస్ట్ ఛాయిస్.. ప్రారంభ ధర రూ.5.32 లక్షలు, 26 కి.మీ మైలేజీ

07:30 PM IST

  • Best Cars For Family : చాలా మంది ఫ్యామిలీతో కలిసే వెళ్లేందుకు కంఫర్ట్‌గా ఉండే కార్లను కొనుగోలు చేస్తారు. అయితే కన్ఫ్యూజన్ లేకుండా మంచి కార్లను కొంటే సమస్య ఉండదు. అలాంటి కార్ల గురించి తెలుసుకుందాం..

Mouth ulcers: నోట్లో పొక్కులు వస్తే ఇవి నమలండి.. వెంటనే తగ్గిపోతాయి

07:00 PM IST

Mouth ulcers: మౌత్ అల్సర్స్ కు కారణాలు: నోటి పూతలకు అనేక కారణాలు ఉంటాయి. కానీ చిన్న బొబ్బలు తరచుగా విడుదల కావడానికి ఈ కారణాలు కారణమవుతాయి.

Minister Ponnam Prabhakar : బీఆర్ఎస్ తీరు చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతుందనే అనుమానం- మంత్రి పొన్నం ప్రభాకర్

06:48 PM IST

Minister Ponnam Prabhakar : శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఊపేక్షించమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తీరు చూస్తే కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకుంటూ కాంగ్రెస్ ను బద్నాం చేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు.

shubman gill:శుభ్‌మ‌న్ గిల్‌కు బీసీసీఐ షాక్ - బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరం - టీమిండియాలోకి ఇషాన్ కిష‌న్ రీఎంట్రీ?

06:41 PM IST

shubman gill: బంగ్లాదేశ్‌తో జ‌రుగ‌నున్న టీ20 సిరీస్ నుంచి శుభ్‌మ‌న్ గిల్‌ను త‌ప్పించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సిరీస్ ద్వారా టీమిండియాలో ఇషాన్ కిష‌న్ రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Viral Fever : కంపు కొడుతున్న పల్లెలు.. పట్టించుకోని అధికారులు.. మంచానపడుతున్న ప్రజలు

06:00 PM IST

  • Viral Fever : పరిశుభ్రంగా ఉండాల్సిన పల్లెలు కంపు కొడుతున్నాయి. వర్షాలతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా దోమలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాపిస్తున్నాయి.  జ్వరాలను అదుపు చేసేందుకు వైద్యశాఖ శిబిరాలు నిర్వహిస్తుంటే వ్యాధులకు కారణమైన అపరిశుభ్రాన్ని పారద్రోలడంపై సంబంధింత శాఖలు దృష్టిసారించడం లేదు.

Sreemukhi: తెలుగులో హోస్ట్‌గా మ‌రో టీవీ షోకు శ్రీముఖి గ్రీన్‌సిగ్న‌ల్

05:50 PM IST

Sreemukhi: తెలుగులో నంబ‌ర్ వ‌న్ టీవీ హోస్ట్‌గా కొన‌సాగుతోంది శ్రీముఖి. ఆదివారం విత్ స్టార్ మా ప‌రివారంతో పాటు ప‌లు రియాలిటీ షోస్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజాగా శ్రీముఖి మ‌రో కొత్త టీవీ షోకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

Lemon Pickle: తియ్యగా, పుల్లగా నిమ్మకాయ ఊరగాయ, ఊరబెట్టకుండానే తినేయొచ్చు

05:30 PM IST

Lemon Pickle: మార్కెట్లో దొరికే స్వీట్ లెమన్ ఊరగాయ మీకు ఇష్టమైతే ఇంట్లోనే దాన్ని తయారు చేయొచ్చు. ఊరగాయల్లాగా దీనికి చుక్క నూనె కూడా అక్కర్లేదు. తీపి నిమ్మకాయ ఊరగాయ రెసిపీ ఎలాగో చూసేయండి.

APSRTC : ఓవైపు సెల్‌ఫోన్.. మరోవైపు బస్ డ్రైవింగ్.. ప్రయాణికుల ప్రాణాలంటే లెక్కలేదా?

05:21 PM IST

  • APSRTC : తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా.. కొందరు బస్ డ్రైవర్లు మారడం లేదు. మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ బస్ డ్రైవర్ సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేశారు. అత్యంత ప్రమాదకరంగా బస్సును నడిపారని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Brahmamudi Promo: త‌ప్పును రాజ్‌పై నెట్టేసిన రుద్రాణి - కొడుకుకు అప‌ర్ణ ప‌నిష్‌మెంట్ - తిరిగి అత్తింటికి కావ్య‌

05:08 PM IST

Brahmamudi Promo: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ లేటెస్ట్ ప్రోమోలో రుద్రాణి కార‌ణంగానే కావ్య పుట్టింటికి వెళ్లిపోయింద‌ని ఆమెపై అప‌ర్ణ ఫైర్ అవుతుంది. కావ్య పుట్టింటికి వెళ్లిపోవ‌డానికి తాను కార‌ణం కాద‌ని రాజ్ అంటూ రుద్రాణి అంటుంది. త‌ల్లి ముందు రాజ్‌ను ఇరికించిన‌ట్లుగా చూపించారు.

Leafy vegetables: ఈ ఆకుకూరలు తినడమే తగ్గించేశాం.. పోషకాలు తెలిస్తే పక్కాగా మొదలు పెడతారు

04:30 PM IST

Leafy vegetables: ఎప్పుడూ తినే ఆకుకూరలే కాకుండా అధిక పోషకాలున్నవి కొన్ని ఉన్నాయి. చామకూర, తమలపాకు, మునగాకు, ఎర్ర తోటకూర తక్కువగా తింటారు. వాటి పోషకాలు తెల్సుకోండి.

Dhanush 3 Movie: తెలుగు రీ రిలీజుల్లో ధ‌నుష్ త్రీ రికార్డ్ - స్ట్రెయిట్ హీరోల కలెక్షన్స్ దాటేసిన డబ్బింగ్ మూవీ

04:07 PM IST

తెలుగు రీ రిలీజ్ మూవీస్‌లో ధ‌నుష్ డ‌బ్బింగ్ మూవీ త్రీ రికార్డు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. శ‌నివారం థియేట‌ర్ల‌లో రీ రిలీజైన ఈ మూవీ కోటి న‌ల‌భై ఎనిమిది ల‌క్ష‌ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ వారం రిలీజైన ప‌లు తెలుగు స్ట్రెయిట్ సినిమా కంటే త్రీ మూవీ ఎక్కువ‌గా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

నోటిఫికేషన్ సెంటర్