తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Great Summer Sale 2024 : అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు

Amazon Great Summer Sale 2024 : అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు

Sharath Chitturi HT Telugu

29 April 2024, 13:30 IST

  • Amazon Great Summer Sale 2024 : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీని ప్రకటించింది. రెడ్​మీ 13 సీ, రెడ్​మీ నోట్ 13 ప్రోతో పాటు అనేక స్మార్ట్​ఫోన్స్​పై డిస్కౌంట్లు లభించనున్నాయి. ఆ లిస్ట్​..

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​ వచ్చేస్తోంది..
అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​ వచ్చేస్తోంది.. (Amazon)

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​ వచ్చేస్తోంది..

Amazon Great Summer Sale 2024 date :  గ్రేట్ సమ్మర్ సేల్ తేదీని ఎట్టకేలకు ప్రకటించింది దిగ్గజ ఈ-కామర్స్​ సంస్థ అమెజాన్​. ఇది భారతదేశంలో.. మే 2, 2024 న ప్రారంభమవుతుంది. ఈ సేల్​లో స్మార్ట్​ఫోన్లు సహా పలు కేటగిరీల్లోని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ డీల్స్, డిస్కౌంట్లు ఉన్నాయి. వన్​ప్లస్​, రెడ్​మీ, పోకో తదితర టాప్ బ్రాండ్ల డిస్కౌంట్ స్మార్ట్​ఫోన్స్​ జాబితాను ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024లో భారీ డిస్కౌంట్ ధరకు లభించే స్మార్ట్ఫోన్ల జాబితాను ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Vivo X100 Ultra: ఇది ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసమే.. 200 ఎంపీ పెరిస్కోప్ కెమెరాతో వివో ఎక్స్100 అల్ట్రా స్మార్ట్ ఫోన్

High dividend stocks: అదిరిపోయే డివిడెండ్ తో పాటు షేర్ వ్యాల్యూ కూడా బాగా పెరుగుతున్న 5 స్టాక్స్ ఇవి..

Nikhil Kamat: పిల్లలు ఎందుకు వద్దనుకున్నాడో చెప్పిన ‘జెరోధా’ నిఖిల్ కామత్. వారసుడు అనే కాన్సెప్టే నాన్సెన్స్ అని కామెంట్

Paytm UPI Lite: చిన్న చిన్న పేమెంట్స్ కోసం పేటీఎం యూపీఐ లైట్; పిన్ కూడా అవసరం లేదు..

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024 అమెజాన్

గ్రేట్ సమ్మర్ సేల్ 2024 సందర్భంగా కొత్తగా లాంచ్ అయిన, ప్రజాదరణ పొందిన అనేక స్మార్ట్​ఫోన్స్​పై డిస్కౌంట్స్​ లభిస్తున్నాయి. ఇది కొనుగోలుదారులకు.. ఫీచర్లతో నిండిన గ్యాడ్జెట్స్​ని చాలా సరసమైన ధరకు పొందే అవకాశాన్ని ఇస్తోంది. అమెజాన్ సేల్​లో.. రెడ్​మీ 13సీ, రెడ్​మీ నోట్ 13 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం34, షియోమీ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్23, ఐక్యూ జెడ్9, గెలాక్సీ ఎస్24, టెక్నో పోవా 6 ప్రో తదితర స్మార్ట్​ఫోన్స్​పై డిస్కౌంట్స్​ ఇస్తున్నట్టు అమెజాన్​ ప్రకటించింది. లిస్టెడ్ స్మార్ట్​ఫోన్స్​పై డిస్కౌంట్ ధరలు, డీల్స్​ని రానున్న రోజుల్లో వెల్లడించనుంది అమెజాన్​.

ఈ అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​లో డిస్కౌంట్స్​తో పాటు కస్టమర్ల కోసం బ్యాంక్ ఆఫర్లను కూడా ఇస్తోంది అమెజాన్​. ఐసీఐసీఐ బ్యాంక్, బీఓబీ కార్డు, వన్ కార్డ్ క్రెడిట్/డెబిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ సేల్​లో అమెజాన్ రూ.45,000 వరకు అద్భుతమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా ఇస్తుండటం విశేషం.

లిస్టెడ్ స్మార్ట్​ఫోన్స్​తో పాటు యాపిల్, శాంసంగ్, వ్​ప్లస్​ వంటి బ్రాండ్లకు చెందిన పలు ఫ్లాగ్షిప్ స్మార్ట్​ఫోన్స్​ కూడా భారీ డిస్కౌంట్లతో లభిస్తాయని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్​ఫోన్ డీల్స్​పై సంస్థ ఇంకా ప్రకటన చేయలేదు.

Amazon Great Summer Sale discounts on smartphones : అన్ని ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్ డీల్స్​ను ఏప్రిల్ 30 సాయంత్రం 6 గంటలకు టెక్ బార్ వెల్లడించనుంది. బీబోమ్ ఉత్తమ మిడ్ రేంజ్ స్మార్ట్​ఫోన్లపై డిస్కౌంట్లను వెల్లడిస్తుంది. టెక్ వైజర్ బడ్జెట్ స్మార్ట్​ఫోన్​లపై డిస్కౌంట్లను వెల్లడిస్తుంది.

ఐఫోన్ 15పై కూడా డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్​లో ఐఫోన్ 15 రూ.70,999కు, ఫ్లిప్​కార్ట్​లో రూ.65,999 ధరకు లభిస్తోంది. మరి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024 ఎలాంటి ఆఫర్ ఇస్తుందో వేచి చూడాలి.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్​లో అందుబాటులో ఉంది! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వండి.

తదుపరి వ్యాసం