తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Holi Offers : ఐఫోన్​ 15 నుంచి ఐఫోన్​ 12 వరకు.. బెస్ట్​ డీల్స్​ ఇవే!

Amazon Holi offers : ఐఫోన్​ 15 నుంచి ఐఫోన్​ 12 వరకు.. బెస్ట్​ డీల్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu

24 March 2024, 15:35 IST

  • Amazon Holi offers 2024 : ఐఫోన్​ కొనాలని చాలా రోజుల నుంచి ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. అమెజాన్​ హోలీ ఆఫర్స్​ గురించి మీరు తెలుసుకోవాల్సిందే!

అమెజాన్​లో ఐఫోన్స్​పై సూపర్​ డీల్​..!
అమెజాన్​లో ఐఫోన్స్​పై సూపర్​ డీల్​..! (Pexels)

అమెజాన్​లో ఐఫోన్స్​పై సూపర్​ డీల్​..!

Amazon Holi offers on iPhone : రంగుల పండుగ హోలీ సమీపిస్తున్న నేపథ్యంలో.. అగ్రశ్రేణి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై తిరుగులేని డిస్కౌంట్లను ఇస్తోంది ప్రముఖ ఈ-కామర్స్​ సంస్థ అమెజాన్​. ఇందులో భాగంగా.. యాపిల్​ ఐఫోన్స్​ లైనప్​పై బెస్డ్​ డీల్స్​ లభిస్తున్నాయి. మీరు ఐఫోన్​ కొనాలని ఎప్పటి నుంచో చూస్తుంటే, ఇదే రైట్​ టైమ్​! అమెజాన్​లో ఐఫోన్స్​పై ఉన్న డీల్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

1. ఐఫోన్ 15 (128 జీబీ)

offers on Apple iPhone 15 : 6.1 ఇంచ్​ సూపర్ రెటీనా ఎక్స్​ డీఆర్ డిస్​ప్లేను కలిగి ఉన్న ఐఫోన్ 15లో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉంటుంది​. ఏ16 బయోనిక్ చిప్​సెట్​తో కూడిన ఈ ఫోన్ వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2ఎక్స్ ఆప్టికల్ క్వాలిటీ టెలిఫోటో లెన్స్​తో కెమెరా క్వాలిటీ సూపర్​గా ఉంటుంది. వాస్తవానికి రూ.79,900గా ఉన్న ఐఫోన్ 15 (128 జీబీ) వేరియంట్ ఇప్పుడు కేవలం రూ.71,290కే, అంటే 11శాతం భారీ డిస్కౌంట్​తో అమెజాన్​లో లభిస్తోంది.

2. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్​..

ఐఫోన్​ 15 ప్రో మ్యాక్స్​.. వాస్తవ ధర కన్నా 7శాతం డిస్కౌంట్​తో రూ. 159900 ధరకు అందిస్తోంది అమెజాన్​. 6.7 ఇంచ్​ సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ డిస్​ప్లే, ప్రొమోషన్ టెక్నాలజీ, సొగసైన టైటానియం ఫినిషింగ్​తో ఈ స్మార్ట్​ఫోన్​ ఒక విజువల్ ట్రీట్. కొత్త ఏ17 ప్రో ఎస్​ఓసీతో నడిచే ఈ బైక్ అత్యుత్తమ పనితీరును కనబరుస్తుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, కొత్త 5ఎక్స్ టెలిఫోటో లెన్స్​తో సహా ట్రిపుల్ కెమెరా సెటప్​తో, ఇది ఫోటోగ్రాఫీకి సూట్​ అవుతుంది.

3. ఐఫోన్ 14 ప్లస్..

Amazon Holi offers details : 6.7 ఇంచ్​ సూపర్ రెటీనా ఎక్స్​డీఆర్ డిస్​ప్లే, అదిరిపోయే విజువల్స్​తో ఐఫోన్ 14 ప్లస్​లో యాపిల్​కి చెందిన ఏ16 బయోనిక్ చిప్​సెట్​ ఉంది. 12 మెగాపిక్సెల్ లెన్స్​, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్​తో ట్రిపుల్ కెమెరా సెటప్​ కలిగి ఉంది. వాస్తవానికి రూ.79,900గా ఉన్న ఐఫోన్ 14 ప్లస్ (128 జీబీ) వేరియంట్ ఇప్పుడు కేవలం రూ.66,999కే, అంటే 16 శాతం భారీ డిస్కౌంట్​తో అమెజాన్​ హోలీ సేల్​లో లభిస్తోంది.

4. ఐఫోన్ 13..

అసాధారణ పనితీరు, వినూత్న ఫీచర్లకు ప్రసిద్ధి చెందిన ఐఫోన్ 13 (128 జిబి) అద్భుతమైన 6.1-ఇంచ్​ సూపర్ రెటీనా ఎక్స్​డీఆర్​ డిస్​ప్లేని కలిగి ఉంటుంది. ఇమ్మర్సివ్ విజువల్స్ కోసం సినిమాటిక్ మోడ్​ కూడా అందిస్తోంది యాపిల్​ సంస్థ. అత్యాధునిక డ్యూయల్ కెమెరా వ్యవస్థతో కూడిన ఇది.. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి బెస్ట్​ డివైజ్​! ఏ15 బయోనిక్ ప్రాసెసర్​తో పనిచేసే ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో మెరుపు వేగంతో పనిచేస్తుంది. 13 శాతం డిస్కౌంట్​తో.. ఐఫోన్ 13 (128 జీబీ) వేరియంట్ ధర రూ.59,900 నుంచి రూ.52,090కు తగ్గింది.

5. ఐఫోన్ 12..

iPhone 12 offers :128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6.1 ఇంత్​ సూపర్ రెటీనా ఎక్స్​డీఆర్ డిస్​ప్లే కలిగిన ఐఫోన్ 12లో.. 12 ఎంపీ డ్యూయల్ లెన్స్ సిస్టెమ్​తో అసాధారణ కెమెరా సామర్థ్యాలను అందిస్తోంది యాపిల్​. ఏ14 బయోనిక్ చిప్​తో నడిచే ఈ ఫోన్ ఆకట్టుకునే వేగం, సామర్థ్యాన్ని అందిస్తుంది. అమెజాన్​లో అదిరిపోయే ఆఫర్​తో ఐఫోన్ 12 అసలు ధర రూ.74,900 నుంచి కేవలం రూ.54,899కే లభిస్తోంది.

తదుపరి వ్యాసం