తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Affiliate Account : అమెజాన్​ అఫీలియేట్​ అకౌంట్​ ఎలా క్రియేట్​ చేసుకోవాలి?

Amazon affiliate account : అమెజాన్​ అఫీలియేట్​ అకౌంట్​ ఎలా క్రియేట్​ చేసుకోవాలి?

Sharath Chitturi HT Telugu

26 February 2024, 12:07 IST

google News
    • How to create amazon affiliate account : అమెజాన్​ అఫీలియేట్​ లింక్స్​ క్రియేట్​ చేసుకుని కమిషన్​తో డబ్బులు సంపాదించాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! అమెజాన్​ అఫీలియేట్​ అకౌంట్​ని ఇలా క్రియేట్​ చేసుకోండి..
అమెజాన్​ అఫీలియేట్​ అకౌంట్​ ఎలా క్రియేట్​ చేసుకోవాలి?
అమెజాన్​ అఫీలియేట్​ అకౌంట్​ ఎలా క్రియేట్​ చేసుకోవాలి?

అమెజాన్​ అఫీలియేట్​ అకౌంట్​ ఎలా క్రియేట్​ చేసుకోవాలి?

Amazon affiliate program in India : ప్రస్తుతం ఉన్న జీతం సరిపోవడం లేదా? సెకెండ్​ ఇన్​కమ్​ గురించి ఆలోచిస్తున్నారా? లేక మీకంటూ ఒక వెబ్​సైట్​, సోషల్​ మీడియా అకౌంట్​ ఉండి.. దాని నుంచి కాస్త రెవెన్యూ జనరేట్​ చేసుకోవాలని చూస్తున్నారా? అయితే.. మీరు అమెజాన్​ అఫీలియేట్​ ప్రోగ్రామ్​ గురించి తెలుసుకోవాల్సిందే! చాలా మంది ఇప్పటికే ఈ ప్రోగ్రామ్​ ద్వారా బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అసలేంటి ఈ అమెజాన్​ అఫీలియేట్​ ప్రోగ్రామ్​? ఇది ఎలా పనిచేస్తుంది? అకౌంట్​ ఎలా క్రియేట్​ చేసుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

అమెజాన్​ అఫీలియేట్​ ప్రోగ్రామ్​ అంటే ఏంటి?

ప్రపంచంలో ఉన్న ది బెస్ట్​ మార్కెటింగ్​ ప్రోగ్రామ్స్​లో ఈ అమెజాన్​ అఫీలియేట్​ ప్రోగ్రామ్​ ఒకటి. మీకు ఏదైనా వెబ్​సైట్​, బ్లాగ్​, సోషల్​ మీడియా అకౌంట్​ ఉంటే చాలు.. అమెజాన్​ అఫీలియేట్​లో అకౌంట్​ని క్రియేట్​ చేసుకోవచ్చు. మీకు నచ్చిన లేక మీరు వాడుతున్న ప్రాడక్ట్స్​ని ప్రోమోట్​ చేసి, దాని ద్వారా కొంత మొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చు!

ఈ​ ప్రోగ్రామ్​లో చేరిన తర్వాత.. మీకంటూ ఒక యునీక్​ అసోసియేట్​ ఐడీని ఇస్తుంది అమెజాన్​. దాని ద్వారా అఫీలియేట్​ లింక్స్​ని మనం జనరేట్​ చేసుకోవచ్చు.​ వాటిని షేర్​ చేసినా లేక యునీక్​ ఐడీ ద్వారా ప్రాడక్ట్స్​ని ఎంచుకుని వాటి లింక్స్​ని షేర్​ చేసినా.. అవి రిఫరల్​ లింక్స్​గా పనిచేస్తాయి. ఆ లింక్స్​ని క్లిక్​ చేసి ఎవరైనా ప్రాడక్ట్స్​ కొంటే.. అందులో మీకు కొంత కమిషన్​ జనరేట్​ అవుతుంది.

Earn second income from home : మీరు ఇప్పటికే చాలా యూట్యూబ్​ ఛానెల్స్​లో ఇలాంటి 'అఫీలియేట్​ లింక్స్​' చూసి ఉంటారు. యూట్యూబర్స్​.. వాళ్లు వాడుతున్న ప్రాడక్ట్స్​ లింక్స్​ ఇస్తారు. వాటిని ఫాలోవర్స్​ కొంటే.. యూట్యూబర్స్​కు కమిషన్​ వస్తుంది.

ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అమెజాన్​లో ఉండే అన్ని ప్రాడక్ట్స్​కి ఒకటే కమిషన్​ రేట్​ ఉండదు. కమిషన్​ రేట్​ అనేది ప్రాడక్ట్​ ప్రైజ్​ ఆధారంగా 1శాతం నుంచి 20శాతం మధ్యలో ఉంటుంది. ఉదాహరణకు కిచెన్​ అప్లైయెన్స్​ కొంటే కమిషన్​ రేట్​ 6శాతంగా ఉంటుంది. గ్రాసరీ కొంటే 8శాతంగా ఉంటుంది. మొబైల్​ ఫోన్స్​ కొంటే 1శాతంగా ఉంటుంది. బుక్స్​ కొంటే.. కమిషన్​ రేట్​ 5శాతంగా ఉంటుంది.

అమెజాన్​ అఫీలియేట్​ ప్రోగ్రామ్​కు ఎవరెవరు అర్హులు?

amazon affiliate commission rate : అమెజాన్​ అఫీలియేట్​ ప్రోగ్రామ్​లో చేరడం ఫ్రీ. అయితే.. ఇందుకు కోసం ఎలిజిబులుటీ క్రైటీరియా ఉంటుంది. వెబ్​సైట్​, మొబైల్​ యాప్​, సోషల్​ మీడియాకు వేరువేరుగా ఉంటాయి.

వెబ్​సైట్​:- ఒరిజినల్​ కంటెంట్​ ఉండాలి. కనీసం 10 బ్లాగ్​ పోస్ట్స్​ చేసి ఉండాలి. చివరిగా చేసిన పోస్ట్​.. 60 రోజులు దాటకూడదు. మీరు చేసిన పోస్ట్​ పబ్లిక్​గా అందుబాటులో ఉండాలి.

మొబైల్​ యాప్​:- గూగుల్​ ప్లే, యాపిల్​, అమెజాన్​ యాప్​ స్టోర్​లో మీరు క్రియేట్​ చేసిన యాప్​ ఫ్రీగా అందుబాటులో ఉండాలి. అందులో ఒరిజినల్​ కంటెంట్​ ఉండాలి. అమెజాన్​ షాపింగ్​ యాప్​ని పోలి ఉండకూడదు.

Amazon affiliate account sign up : సోషల్​ మీడియా:- సోషల్​ మీడియా అకౌంట్స్​ యాక్టివ్​గా ఉండాలి. ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ అయితే.. బిజినెస్​ అకౌంట్​ ఉండాలి. 500 ఆర్గానిక్​ ఫాలోవర్స్​ ఉండాలి.

అమెజాన్​ అఫీలియేట్​ అకౌంట్​ ఎలా క్రియేట్​ చేసుకోవాలి?

How to create Amazon affiliate account : అమెజాన్​ అఫీలియేట్​ ప్రోగ్రామ్​లో చేరాలంటే.. ముందు అసోసియేట్​ అకౌంట్​ని క్రియేట్​ చేసుకోవాలి.

స్టెప్​ 1:- https://affiliate-program.amazon.in/ అమెజాన్​ అఫీలియేట్​ అసోసియేట్స్​ హోం పేజ్​లోకి వెళ్లండి. సైన్​ అప్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 2:- మీ అకౌంట్​ వివరాలను ఎంటర్​ చేయండి.

స్టెప్​ 3:- మీ వెబ్​సైట్​ అడ్రెస్​ని ఎంటర్​ చేయండి.

స్టెప్​ 4:- మీ ప్రిఫర్డ్​ స్టోర్​ ఐడీని ఎంటర్​ చేయండి.

స్టెప్​ 5:- మీ సైట్​కి ట్రాఫిక్​ ఎలా వస్తుందో వివరించండి.

స్టెప్​ 6:- మీ పేమెంట్​ మోడ్​ని ఎంటర్​ చేయండి.

స్టెప్​ 7:- మీ అమెజాన్​ అఫీలియేట్​ లింక్స్​ని క్రియేట్​ చేసుకోండి.

మీ అమెజాన్​ అసోసియేట్​ అకౌంట్​ క్రియేట్​ అవుతుంది. ఇప్పుడు..

స్టెప్​ 1:- మీ అమెజాన్​ అసోసియేట్​ అకౌంట్​లో లాగిన్​ అవ్వండి.

స్టెప్​ 2:- టాప్​ బానర్​ మీద కనిపించే ప్రాడక్ట్​ లింకింగ్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- అమెజాన్​ అసోసియేట్స్​ సైట్​స్ట్రైప్​ ఆధారంగా ప్రాడక్ట్​ అఫీలియేట్​ లింక్​ని జనరేట్​ చేసుకోండి.

how to make secondary income : స్టెప్​ 4:- ఆ లింక్​ని ఇతరులకు షేర్​ చేయండి. వాళ్లు ఏదైనా కొనుగోలు చేస్తే మీకు కమిషన్​ వస్తుంది.

మొదట్లో యూజర్ల సంఖ్య పెద్దగా లేకపోయినా.. ఈ అమెజాన్​ అఫీలియేట్​ లింక్స్​తో కొంత కొంత సెకెండ్​ ఇన్​కమ్​ జనరేట్​ చేసుకోవచ్చు. లింక్స్​ క్రియేట్​ చేసి మీ స్నేహితులు, బంధువులకు షేర్​ చేస్తే.. వాళ్లు అవి కొంటే, మీకు కొంత కమిషన్​ వస్తుంది. అది తక్కువగానే ఉన్నా.. అసలేం లేకపోవడం కన్నా బెటర్​ కదా!

తదుపరి వ్యాసం