తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Earn Money With Credit Cards : క్రెడిట్​ కార్డులతో కూడా డబ్బులు సంపాదించొచ్చు! ఇలా చేయండి..

Earn money with credit cards : క్రెడిట్​ కార్డులతో కూడా డబ్బులు సంపాదించొచ్చు! ఇలా చేయండి..

Sharath Chitturi HT Telugu

23 February 2024, 11:27 IST

google News
    • How to earn money with credit card : క్రెడిట్​ కార్డులతో డబ్బులు సంపాదించుకోవచ్చని మీకు తెలుసా? కొన్ని టిప్స్​ పాటిస్తే.. క్రెడిట్​ కార్డులు చాలా ఉపయోగపడతాయి. అవేంటంటే..
క్రెడిట్​ కార్డులతో కూడా డబ్బులు సంపాదించొచ్చు!
క్రెడిట్​ కార్డులతో కూడా డబ్బులు సంపాదించొచ్చు!

క్రెడిట్​ కార్డులతో కూడా డబ్బులు సంపాదించొచ్చు!

Credit card tips to earn money : క్రెడిట్​ కార్డు బిల్లులు కట్టలేక అలసిపోతున్నారా? 'ఈ క్రెడిట్​ కార్డును అనవసరంగా తీసుకున్నాను రా బాబు..' అని ఫీల్​ అవుతున్నారా? క్రెడిట్​ కార్డులతో ఖర్చు చేయడమే కాకుండా.. డబ్బులు కూడా సంపాదించుకోవచ్చని మీకు తెలుసా? అవును. నిజం! క్రెడిట్​ కార్డులతో డబ్బులు ఆదా చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని టిప్స్​ పాటించాలి. అవేంటంటే..

క్రెడిట్​ కార్డు వాడుతూనే డబ్బులు సంపాదించండి..

బ్యాంక్​లు.. క్రెడిట్​ కార్డులు ఇస్తాయి. వాటి మీద 30-45 రోజుల వరకు ఇంట్రెస్ట్​ ఫ్రీ లోన్​లు ఇస్తాయి. క్రెడిట్​ కార్డు వాడి.. మీరు ఎన్ని ఖర్చులు చేసినా, వాటిపై డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. నెల చివర్లో స్టేట్​మెంట్​ జనరేట్​ అవుతుంది. అక్కడి నుంచి 1- 2 వారాలకు క్రెడిట్​ కార్డు బిల్లు కట్టాల్సి ఉంటుంది. ఆ లోపు కట్టేస్తే.. మీ నుంచి బ్యాంక్​ ఎలాంటి డబ్బులు సంపాదించదు. కట్టకపోతే.. అప్పుడు వడ్డీ వేస్తుంది.

Best credit cards in 2024 : అయితే.. ఈ 30- 45 రోజుల టైమ్​ పీరియడ్​తో అడ్వాంటేజ్​ పొందొచ్చు. దీనికి ఒక ట్రిక్​ ఉండి. నెల మొదట్లో మీకు జీతం పడుతుంది కదా. సాధారణంగా.. వాటితోనే బిల్లులను కడతారు. అలా కాకుండా.. డబ్బులను పక్కన పెట్టండి. కరెంట్​ బిల్లు, షాపింగ్​, రెస్టారెంట్​ ఖర్చులు, పెట్రోల్​ బిల్లు, ట్యాక్సీ బిల్లు.. ఇలా మీరు క్రెడిట్​ కార్డులతో కట్టండి. స్టేట్​మెంట్​ జనరేట్​ అయ్యి, క్రెడిట్​ కార్డు బిల్లు కట్టడానికి 45 రోజుల సమయం ఉంటుంది. ఈలోపు.. మీరు దాచిన డబ్బులను 'ఇన్​వెస్ట్​' చేయాలి.

ఇన్​వెస్ట్​ చేయాలా? ఎలా? అంటారా? వాస్తవానికి అంత తక్కువ టైమ్​లో పెట్టుబడులు పెడుతుంటే.. భారీ రిటర్నులు ఆశించకూడదు. మరీ ముఖ్యంగా.. అంత తక్కువ టైమ్​లో స్టాక్​ మార్కెట్​, మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టకూడదు. ఇందుకోసం మన దగ్గర ఉన్న ఏకైక, బెస్ట్​ ఆప్షన్​.. 'ఫిక్స్​డ్​ డిపాజిట్​'. ఇది ఒక సేఫ్​ ఇన్​వెస్ట్​మెంట్​. మీకు ఫిక్స్​డ్​ అమౌంట్​ లభిస్తుంది.

Best way to earn money with credit cards : వివిధ బ్యాంక్​లలో ఎఫ్​డీలపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూడండి. ఏది బెస్ట్​ అనిపిస్తే దానిని ఎంచుకుని.. 30,35 రోజుల కోసం మీ మనీని పార్క్​ చేయండి. ఆ తర్వాత.. అసలు డబ్బును తీసి, క్రెడిట్​ కార్డు బిల్లులు కట్టేయండి. ఎఫ్​డీపై వచ్చిన వడ్డీ.. మీకు అదనపు ఆదాయం! ఈ విధంగా.. మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు.

ఈ ట్రిక్​లో మీరు కచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర అప్పటికే డబ్బులు పూర్తిగా ఉండాలి. అప్పుడే క్రెడిట్​ కార్డుతో ఖర్చులు చేయాలి. సరైన సమయానికి ఎఫ్​డీ నుంచి డబ్బులు తీసి.. బిల్లులు కట్టేయాలి.

రివార్డ్​ పాయింట్స్​తో కూడా లాభమే..!

ఈ మధ్య కాలంలో ఈ రివార్డ్​ పాయింట్స్​ అనేవి బాగా వినిపిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు.. రివార్డ్​ పాయింట్స్​ని ఇస్తూ ఉంటున్నాయి కంపెనీలు. దీని నుంచి కూడా మనం లబ్ధిపొందొచ్చు. మీరు ఎలాగో చేసే ఖర్చులను.. క్రెడిట్​ కార్డుల ద్వారా చేస్తే.. ఈ తరహా రివార్డ్​ పాయింట్స్​ పొందొచ్చు. వీటితో షాపింగ్​ చేయవచ్చు, ఫ్లైట్​ టికెట్స్​ కొనుక్కొవచ్చు.. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణ ధర కన్నా.. రివార్డ్​ పాయింట్స్​తో ధర తక్కుతుంది. ఆ డబ్బులను మీ పొదుపు చేసుకుని, ఇన్​వెస్ట్​ చేసుకోవచ్చు. అలా పరోక్షంగా క్రెడిట్​ కార్డుల ద్వారా డబ్బులు జనరేట్​ అవుతాయి.

సిబిల్​ స్కోర్​ పెంచుకోవడానికి మంచి ఆప్షన్​..!

Credit card tips and tricks : ఈ కాలంలో మంచి సిబిల్​ స్కోర్​ ఉండటం చాలా అవసరం. లోన్​ అనేది సులభంగానే దొరికేస్తుంది. కానీ.. దానిపై ఎంత వడ్డీ కట్టాలి? అనేది.. సిబిల్​ స్కోర్​పై భారీగా ఆధారపడి ఉంటుంది. సిబిల్​ స్కోర్​ ఎంత ఎక్కువగా ఉంటే.. తక్కువకు వడ్డీ రేటు లభించే అవకాశం ఉంది. అదే.. సిబిల్​ స్కోర్​ తక్కువగా ఉంటే.. లోన్​పై వడ్డీ అంత ఎక్కువగా ఉంటుంది.

జీవితంలో కార్​ లోని అని, హోం లోన్​ అని చాలా లోన్స్​ తీసుకుంటాము. వివిధ బ్యాంక్​లలో వడ్డీ రేట్లు వేరువేరుగా ఉంటాయి. అయితే.. సిబిల్​ స్కోర్​ ఎక్కువ ఉంటే, మీకు కాస్త తక్కువ వడ్డీకి లోన్​ లభిస్తుంది. క్రెడిట్​ కార్డులతో సిబిల్​ స్కోర్​ పెంచుకోవచ్చు! మీ బిల్లులను క్రెడిట్​ కార్డులతో కట్టండి. కానీ సమయానికి క్రెడిట్​ కార్డు బిల్లులు కట్టేస్తే.. సిబిల్​ స్కోర్​ పెరుగుతుంది. అలా.. భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా లోన్​ తీసుకుంటే.. తక్కువ వడ్డీ పడుతుంది. అలా పొదుపు చేసిన డబ్బులను ఇన్​వెస్ట్​ చేసుకోవచ్చు.

ఆఫర్స్​.. ఆఫర్స్​.. ఆఫర్స్​..

Personal finance tips in Telugu : రివార్డ్​ పాయింట్స్​ కాకుండా.. కస్టమర్లకు ఎప్పటికప్పుడు ఆఫర్స్​ని ఇస్తూనే ఉంటాయి క్రెడిట్​ కార్డ్​ కంపెనీలు. మరీ ముఖ్యంగా.. పండుగ సీజన్​లో ఇవి ఎక్కువగా ఉంటాయి. మీ దగ్గర ఆ క్రెడిట్​ కార్డు ఉంటే.. ఆఫర్స్​తో డబ్బులు తక్కువగా పడతాయి. మీకు డబ్బులు మిగులుతాయి.

పైన చెప్పిన టిప్స్​ని మీరు అప్లై చేస్తే.. ఎంతో కొంత డబ్బులు సంపాదిస్తారు. ఏం సంపాదించకపోవడం కన్నా.. కొంతైనా ఆదాయం పెంచుకోవడం బెస్ట్​ కదా!

తదుపరి వ్యాసం