How to invest 10000 salary : రూ. 10వేల జీతంతో కూడా కోటీశ్వరులు అవ్వొచ్చు.. ఎలా అంటే!
07 January 2024, 11:50 IST
- How to invest with 10000 salary : మీకు నెలకు రూ. 10వేల జీతం వస్తోందా? బాధపకండి! ఆ రూ. 10వేల జీతంతోనే మీరు కోటీశ్వరులు అవ్వొచ్చు. ఎలా అంటే..
రూ. 10వేల జీతంతో కూడా కోటీశ్వరులవ్వొచ్చు..
How to invest with 10000 salary : మీరు ఇప్పుడిప్పుడే ఉద్యోగంలోకి అడుపెడుతున్నారా? 'తక్కువ జీతం వస్తోంది, భవిష్యత్తులో కష్టమవుతుందేమో,' అని ఆలోచిస్తున్నారా? అదే సమయంలో.. కోటీశ్వరులవ్వాలని కలలు కంటున్నారా? అయితే ఇది మీకోసమే! నెలకు రూ. 10వేల జీతంతో కూడా కోటీశ్వరులవ్వొచ్చు! అందుకోసం ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
ఎఫ్డీలు- స్టాక్ మార్కెట్.. ఏది బెస్ట్?
ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్ చాలా ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, బాండ్స్ పేర్లు ఎక్కువ వినపడుతుంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు బెస్ట్ అని మన పెద్దలు అంటూ ఉంటారు. ఎలాంటి రిస్క్ లేకుండా.. రిటర్నులు వస్తాయి. నిజమే.. ఎఫ్‌డీల్లో రిస్క్ ఉండదు. కానీ రిటర్నులు కూడా పెద్దగా ఉండవు! ఎఫ్డీలతో వచ్చిన రిటర్నులతో భవిష్యత్తులో మనం ఏం చేయలేము. అదే సమయంలో..స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే.. అద్భుతమైన రిటర్నులు సంపాదించుకోవ్చచు. నిజమే.. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కానీ కాల్క్యులేటెడ్ రిస్క్ తీసుకుంటే, మరీ ముఖ్యంగా చిన్న వయస్సులోనే ఇన్వెస్ట్మెంట్ జర్నీని మొదలుపెడితే కళ్లు చెదిరే రీతులో రిటర్నులు సంపాదించుకోవచ్చు.
How to get rich in Telugu : చాలా మంది.. తక్కువ జీతం వస్తోంది, దీనితో ఫైనాన్షియల్ ఫ్రీడం ఎలా సంపాదించుకోవాలి? అని బాధపడుతూ ఉంటారు. పోకిరి సినిమాలో మహేశ్ బాబు చెప్పిన.. 'ఎప్పుడొచ్చాము అన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా?' అన్న డైలాగ్‌ని ఫైనాన్షియల్ వరల్డ్‌కి అప్లై చేస్తే.. 'ఎంత జీతం వస్తోందన్నది కాదన్నయ్య.. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు మొదలుపెట్టాము అనేదే ముఖ్యం' అని అనడంలో సందేహమే లేదు.
మరి మీకు నెలకు రూ. 10వేల జీతం వస్తోందా? కోటీశ్వరులవ్వాలని కలలు కంటున్నారా? అయితే.. మీ కలలను సాకారం చేసుకునేందుకు ఉపయోగపడే ఓ స్ట్రాటజీ మీకు చెబుతాము.
ఇదీ చూడండి:- How to invest 15000 salary : ఇలా చేస్తే రూ. 15వేల జీతంతో.. రూ. 1కోటి సంపాద!
నెలకు రూ. 10వేల జీతంతో రూ. 1కోటి సంపద..
మీ నెల జీతం నెలకు రూ. 10వేలు అనుకుందాము. అందులో మీరు నెలకు రూ. 3వేలతో మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఈ స్ట్రాటజీలో భాగంగా.. మనం నిఫ్టీ50 ఇండెక్స్ ఫండ్, మిడ్‌క్యాప్100 ఇండెక్స్ ఫండ్, స్మాల్‌క్యాప్250 ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాము.
Best investment strategy to earn 1 crore : నిఫ్టీ50లోని స్టాక్స్‌ని కలిపితే వచ్చేదే ఈ నిఫ్టీ50 ఇండెక్స్ ఫండ్. మిడ్క్యాప్లోని టాప్ 100 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ఫండ్. ఇక స్మాల్‌క్యాప్250లో ఇన్వెస్ట్ చేయడాన్ని స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్ అంటారు.
ఇక మీ నెలవారీ జీతంలో 30శాతం, అంటే రూ. 3వేలను వీటిల్లో ఇన్వెస్ట్ చేయాలి. 10శాతం అంటే రూ. 300 నిఫ్టీ50లో, 20శాతం అంటే రూ. 600 మిడ్‌క్యాప్100, 70శాతం అంటే రూ. 2,100ని ఇన్వెస్ట్ చేయాలి.
ఆ తర్వాత.. మీకు ప్రతి ఏడాది జీతం పెరుగుతుంది కాబట్టి.. అందులోని 30శాతం కూడా ఇన్వెస్ట్మెంట్స్కి కేటాయించాలి. అంటే మొదటి ఏడాది రూ. 3వేల ఇన్వెస్ట్మెంట్. రెండో ఏడాది రూ. 3,330 అవుతుంది. అలా.. ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుకంటూ వెళ్లాలి.
ఇలా చేస్తే.. 10ఏళ్లల్లో మీరు రూ. 13లక్షలు సంపాదిస్తారు. 15ఏళ్లల్లో మీ సంపద రూ. 39 లక్షలకు పెరుగుతుంది. కానీ.. 20ఏళ్లల్లో మీ ఇన్వెస్టమెంట్ వాల్యూ రూ. 1.04కోట్లుగా మారుతుంది. ఇదే కాంపౌండింగ్కి ఉన్న పవర్! ఇంకో 10ఏళ్లతో పాటు ఇలాగే ఇన్వెస్ట్ చేస్తూ వెళితే.. మీ సంపద రూ. 6.69కోట్లు అవుతుంది.
How to get rich with 10,000 salary : అయితే.. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పైన చెప్పిన స్ట్రాటజీలో స్మాల్‌క్యాప్250లో 70శాతం డబ్బులు పెట్టడం జరిగింది. ఇది కాస్త రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. రిస్క్ వద్దు అనుకనేవాళ్లు మిడ్‌క్యాప్100 ఇండెక్స్ ఫండ్‌లో ఎక్కువ డబ్బులు పెట్టడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే.. రిస్క్ తగ్గుతుంది. అదే సమయంలో రూ. 1 కోటి మార్క్‌ని మీరు చేరుకునేందుకు ఇంకొన్నేళ్లు పడుతుంది.