Dy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. రెండు లక్షలకు పైబడిన రుణాల మాఫీపై ఆలోచన చేస్తున్నామన్నారు. రెండు లక్షల రుణమాఫీ కింద రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు.
Medak Tragedy : మెదక్ జిల్లాలో విషాదం జరిగింది. తోబుట్టువులతో భూ వివాదం కారణంగా మనస్థాపం చెందిన ఓ రైతు.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలో సుతార్ పల్లి గ్రామంలో జరిగింది.
Online Puja : సాంకేతిక పరిజ్ఞానం.. అసాధ్యన్నీ సుసాధ్యం చేస్తుంది. ఎక్కడో ఉన్న వారితో ఇక్కడే ఉన్నట్టుగా మాట్లాడినట్టే.. ఎక్కడో ఉన్న దేవతలకు ఇక్కడి నుండి పూజలు చేస్తున్నారు. ఆన్లైన్లో పూజలు చేస్తూ.. విదేశాల్లో ఉన్న తెలుగువారి మన్ననలు పొందుతున్నాడు మెదక్ జిల్లాకు చెందిన హైటెక్ పూజారి.
Adilabad Flood Loss : ఇటీవల భారీ వర్షాలు, వరదలు రైతన్నలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ప్రాణహిత, పెన్ గంగా నదీ పరివాహక ప్రాంతంలో పత్తి, సోయా, కంది పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ లో 9500 ఎకరాల్లో పం టనష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
Online Trading Fraud : ఆన్ లైన్ ట్రేడింగ్ లో ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని ఆశచూపి ఓ బ్యాంకు మేనేజర్ ను రూ.80 లక్షలు చీటింగ్ చేశాడు సైబర్ నేరగాడు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న సైబర్ నేరగాడు... ఓ లింక్ ద్వారా బ్యాంకు మేనేజర్ కు టోకరా వేశాడు.
Aadhaar Free Update : ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ప్రభుత్వం మరోసారి గడువు పెంచింది. ఈ ఏడాది డిసెంబర్ 14 వరకు ఉచితంగా ఆధార్ వివరాలు మార్పుచేర్పులు చేసుకోవచ్చని యూఐడీఏఐ ప్రకటించింది. ఈ మేరకు ఆన్ లైన్ సదుపాయం కూడా కల్పించింది.
Hyderabad Wines Close : హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం నేపథ్యంలో.. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజులు వైన్స్, బార్లు, కల్లు కాంపౌడ్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండ్రోజులు కిక్కుకు బ్రేక్ పడనుంది.
Hyderabad Real Estate Expo 2024 : హైదరాబాద్ రియల్ ఎస్టే్ట్ ఎక్స్ పో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ప్రారంభం అయింది. టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్ పో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ఇందులో 50కి పైగా ప్రముఖ డెవలపర్లు 150కి పైగా ప్రాజెక్ట్‌లు ఎక్స్ పో పెట్టారు.
Suryapet Crime : వారి రోజువారీ కూలీ పనులు చేసుకునే వ్యక్తులు. పాడు బుద్ధితో దొంగతనాలకు దిగారు. అమాయక రైతులనే టార్గెట్ చేసుకున్నారు. ఇళ్లు, పొలం దగ్గర నిలిపిన ట్రాక్టర్లను దొంగిలించారు. చివరకు పోలీసుల చేతికి చిక్కారు. దీంతో వారి భాగోతం అంతా బయటపడింది.
పోలీసుల అండతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శనివారం కౌశిక్ రెడ్డిని కలిసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రకమైన గుండాగిరి పదేళ్లలో ఎప్పుడూ లేదన్నారు. ఫ్యాక్షన్ సినిమాలు తలపించేలా దాడి చేసేందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hyderabad NIMS : తెలంగాణలో ఎంతో మంది చిన్నారులు గుండె జబ్బుల బారిన పడుతున్నారు. చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేక చనిపోతున్నారు. మరికొందరు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు పెట్టనుంది. ఈనెల 16 నుంచి నాగ్ పూర్ - సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ రైలు రామగుండంలో ఆగనుంది. ఈ కొత్త సేవలతో ఇకపై రామగుండం నుంచి సికింద్రాబాద్ కు కేవలం మూడు గంటల్లోనే చేరుకోవచ్చు.
TG Teachers Transfers : వారి నియామకం జరిగి దాదాపు పదేళ్లు గడిచింది. ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా ఆ టీచర్లు బదిలీలకు నోచుకోలేదు. అందరి లాగే తమకు బదిలీలకు అవకాశం ఇవ్వాలని ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Hyderabad : పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరెకపూడి గాంధీ వ్యవహారం కేసుల వరకూ వెళ్లింది. తాజాగా.. అరెకపూడి గాంధీపై హత్యయత్నం కేసు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అరెకపూడి గాంధీపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి మహబూబాబాద్‌లోని మెడికల్ కాలేజీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 106 ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో వీటిని రిక్రూట్ చేయనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీతో దరఖాస్తుల గడువు పూర్తి అవుతుంది. ఇంటర్వూల ఆధారంగా తుది జాబితాను ప్రకటించనున్నారు.
TG Govt DA : తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు.. సర్కారు తీపి కబురు చెప్పింది. పెండింగ్‌లో ఉన్న డీఏలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. మొత్తం 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని.. అతి త్వరలోనే వీటిపై నిర్ణయంపై తీసుకుంటామని తెలంగాణ మంత్రి చెప్పారు.
Palm oil crop : మెదక్ జిల్లాలో 2 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయించాని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 1176 ఎకరాల్లో రిజిస్ట్రేషన్ జరిగిందని అధికారులు వివరించారు. మెదక్ నేలలు పామాయిల్ సాగుకు అనుకూలం అని సైంటిస్టులు చెబుతున్నారు. అటు రైతులు కూడా పామాయిల్ సాగుకు మొగ్గుచూపుతున్నారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రభుత్వం హాలీ డే ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి బదులుగా నవంబర్ 9ని వర్కింగ్ డే(రెండో శనివారం)గా ప్రకటించింది.
కరీంనగర్ డీసీసీ పీఠంపై కీలక నేతలు కన్నేశారు. ఎలాగైనా దక్కిచుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. డీసీసీ రేసులో పలువురు నేతలు ఉన్నప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయమే కీలకం కానున్నది. డీసీసీ పగ్గాలు లేదా పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కడం ఖాయమని వెలిచాల రాజేందర్ రావు ధీమాతో ఉన్నారు.
హైడ్రా తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. హైడ్రా అధికారాలపై లక్ష్మి అనే మహిళ వేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. జీవో 99పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.