Best small cap mutual funds : బెస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ ఇదే..
Best small cap mutual funds : స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే..
Best small cap mutual funds : మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని మ్యూచువల్ ఫండ్స్‌తో ప్రారంభించాలని చూస్తున్నారా? రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైతే.. స్మాల్ క్యాప్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది! మార్కెట్లో చాలా స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. మరి వాటిల్లో దేనిని ఎంచుకోవాలి? అని మీకు సందేహం కలుగుతుంది. ఈ నేపథ్యంలో గత 3ఏళ్ల ప్రదర్శన ఆధారంగా.. టాప్ ఫండ్స్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాము. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి.
క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్..
ఇందులోని డైరక్ట్ ప్లాన్.. మూడేళ్లల్లో 58.07శాతం రిటర్నులు ఇచ్చింది. రెగ్యులర్ ప్లాన్ 55.72శాతం రిటర్నులు తెచ్చిపెట్టింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌ను ఫండ్ ట్రాక్ చేస్తుంది. ఇది మూడేళ్లల్లో కేవలం 38.73శాతం రిటర్నులు మాత్రమే ఇచ్చింది.
నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్..
ఇందులోని డైరక్ట్ ప్లాన్ మూడేళ్లల్లో 48.29శాతం, రెగ్యులర్ ప్లాన్ 46.99శాతం మేర రిటర్నులు తెచ్చిపెట్టాయి. ఇది కూడా నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌నే ట్రాక్ చేస్తుంది.
కెనెరా రొబెకో స్మాల్ క్యాప్ ఫండ్..
మూడేళ్లల్లో డైరక్ట్ ప్లాన్ 45.34శాతం, రెగ్యులర్ ప్లాన్ 42.93శాతం మేర లాభాలను తెచ్చిపెట్టాయి. ఇది కూడా పైన చెప్పిన ఇండెక్స్‌నే ట్రాక్ చేస్తుంది.
ఇదీ చూడండి:- Mutual Funds: లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్.. ఏ ఫండ్ లో పెట్టుబడులు పెట్టడం బెటర్?
హెచ్డీఎఫ్సీ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్..
ఇందులోని డైరక్ట్ ప్లాన్ మూడేళ్లల్లో 44.88శాతం, రెగ్యులర్ ప్లాన్ 43.88శాతం లాభాలను ఇచ్చాయి. ఇది బీఎస్ఈ 250 స్మాల్ క్యాప్ టోటల్ రిటర్న్ ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుంది. ఈ సూచీ మూడేళ్లల్లో 39.16శాతం మేర లాభాలను తెచ్చిపెట్టింది.
కొటాక్ స్మాల్ క్యాప్ ఫండ్..
కొటాక్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లోని డైరక్ట్ ప్లాన్‌తో మదుపర్లు మూడేళ్లల్లో 43.84శాతం మేర లాభాలను పొందారు. రెగ్యులర్ ప్లాన్‌లో అది 41.84శాతంగా ఉంది. ఇది నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌ను ఫాలో అవుతుంది.
టాటా స్మాల్ క్యాప్ ఫండ్..
ఇందులోని డైరక్ట్ ప్లాన్ మూడేళ్లల్లో 43.82శాతం, రెగ్యులర్ ప్లాన్ 41.24శాతం రిటర్నులు తెచ్చిపెట్టాయి.
జులై 19 వరకు ఉన్న డేటాను రూపొందించి, ఈ లిస్ట్‌ను తయారు చేయడం జరిగింది.
(గమనిక:- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. మ్యూచవల్ ఫండ్స్ అంటే రిస్క్‌తో కూడుకున్న విషయం అని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించడం ఉత్తమం.)
సంబంధిత కథనం