Mutual Funds: లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్.. ఏ ఫండ్ లో పెట్టుబడులు పెట్టడం బెటర్?-mutual funds large cap vs mid cap vs small cap how to find the best mfs
Telugu News  /  Business  /  Mutual Funds: Large Cap Vs Mid Cap Vs Small Cap. How To Find The Best Mfs
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Mint)

Mutual Funds: లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్.. ఏ ఫండ్ లో పెట్టుబడులు పెట్టడం బెటర్?

25 May 2023, 19:03 ISTHT Telugu Desk
25 May 2023, 19:03 IST

Mutual Funds: మ్యుచ్యువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా అనుమానాలు వస్తుంటాయి. పెట్టుబడి పెట్టేముందు.. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఏ తరహా ఫండ్ ను ఎన్నుకోవాలనే విషయంలోనూ అనుమానాలు వస్తుంటాయి.

మ్యుచ్చువల్ ఫండ్ పోర్ట్ ఫొలియోను రూపొందించుకోవడం కొంత క్లిష్టమైన పనే. అందులో ఏ సెక్షన్లో ఎంత పెట్టుబడి పెడితే బావుంటుందనే విషయంలో గందరగోళం ఉంటుంది. అయితే, పెట్టుబడి పెడ్తున్న వ్యక్తి తీసుకునే రిస్క్ శాతాన్ని బట్టి మ్యుచ్యువల్ ఫండ్స్ తరహా ను ఎంపిక చేసుకోవడం సముచితమని నిపుణులు సూచిస్తున్నారు.

మ్యుచ్యువల్ ఫండ్స్ కేటగిరీలు

మ్యుచ్యువల్ ఫండ్స్ లో ప్రధానంగా మూడు కేటగిరీలు ఉంటాయి. అవి లార్జ్ క్యాప్ (large-cap mutual funds), మిడ్ క్యాప్ (mid-cap mutual funds), స్మాల్ క్యాప్ (small-cap mutual funds). ఇన్వెస్టర్.. తన పెట్టుబడుల విషయంలో సంప్రదాయ విధానాన్ని (conservative) ఇష్టపడే వాడా? లేక బ్యాలెన్స్డ్ (balanced) గా ఉండేవాడా? లేక దూకుడుగా (aggressive) ఉండేవాడా? అనే అంశంపై కూడా ఏ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలనే విషయం ఆధారపడి ఉంటుంది.

  • లార్జ్ క్యాప్: ఫండమెంటల్స్ బలంగా ఉన్న పెద్ద కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే లార్జ్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడంలో కొంతవరకు రిస్క్ తక్కువ ఉంటుంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లతో పోలిస్తే.. ఈ లార్జ్ క్యాప్ మ్యుచ్యువల్ ఫండ్స్ లో రిటర్న్ తక్కువే, అదే సమయంలో రిస్క్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇవి చాలా వరకు సురక్షితమైన పెట్టుబడి మార్గాలు. వీటిపై మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం తక్కువగా ఉంటుంది.
  • మిడ్ క్యాప్: పోర్ట్ ఫొలియో డైవర్సిఫికేషన్ కోరుకునే వారికి సూటబుల్ ఫండ్స్ ఈ మిడ్ క్యాప్ ఫండ్స్. ఇందులో రిటర్న్స్ మరియు రిస్క్ .. రెండూ సమానంగా ఉంటాయి. మిడ్ క్యాప్ పై కూడా మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అంతా బావుంటే, లార్జ్ క్యాప్ కన్నా బెటర్ రిటర్న్ ను అందిస్తాయి.
  • స్మాల్ క్యాప్: సమీప భవిష్యత్తులో మంచి పనితీరు చూపగలవని భావించే చిన్న తరహా కంపెనీల్లో ఈ ఫండ్స్ పెట్టుబడులు పెడ్తాయి. అయితే, వీటిలో పెట్టే పెట్టుబడులకు రిస్క్ ఎక్కువ. వీటిపై మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతా బావుంటే, ఈ ఫండ్స్ మంచి రిటర్న్స్ ను ఇస్తాయి. లార్జ్, మిడ్ క్యాప్ ల ఫండ్స్ కన్నా మంచి రిటర్న్స్ ను వీటి నుంచి ఆశించవచ్చు.

ఎందులో బెటర్?

ఈ మూడు తరహాల ఫండ్స్ లో ప్లాన్డ్ గా పెట్టుబడులు పెట్టాలని, మూడింటి మిక్స్ గా పోర్ట్ ఫోలియో ఉండాలని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ జితేంద్ర సోలంకీ సూచిస్తున్నారు. పెట్టుబడి మొత్తంలో 50% నుంచి 70% లార్జ్ క్యాప్ లో, మిగతా మొత్తాన్ని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం సరైన విధానమని సూచిస్తున్నారు. ‘మొత్తం ఇన్వెస్ట్ మెంట్ లో 30% లార్జ్ క్యాప్, 30% ఫ్లెక్సి క్యాప్, 20% మిడ్ క్యాప్, 20% స్మాల్ క్యాప్ ల్లో పెట్టుబడులు పెట్టాలి’ అని ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ బల్వంత్ జైన్ వివరించారు. పెట్టుబడి కాలపరిమితిని బట్టి కూడా ఇన్వెస్ట్ మెంట్ తరహాను ఎంపిక చేసుకోవాలి. ఐదు నుంచి ఏడేళ్ల కాల పరిమితికి లార్జ్ క్యాప్ మంచి నిర్ణయమవుతుంది.