Fixed deposit interest rate : ఈ బ్యాంక్.. ఎఫ్డీలపై 9శాతం వడ్డీని ఇస్తోంది!
Unity Small Finance Bank FD rates : ఎఫ్‌డీల్లో పెట్టుబడులు పెడుతున్నారా? అయితే.. ఈ బ్యాంక్‌ని చెక్ చేయండి. ఇక్కడ 9శాతం వరకు వడ్డీ లభిస్తోంది!
Unity Small Finance Bank : భారతదేశానికి అత్యంత ఇష్టమైన పెట్టుబడి మార్గాల్లో ఒకటి.. ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ). జీరో రిస్క్‌తో.. గ్యారంటీ రాబడి హామీ ఇవ్వడం, పొదుపు ఖాతాలతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లను అందించడంతో పాటు ఎఫ్డీలు ఆదాయపు పన్ను ప్రయోజనాలను కూడా తీసుకొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా రేట్లు అధికంగా ఉన్న ప్రస్తుత సమయంలో.. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో పాటు పలు ఇతర బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. వీటిల్లో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి. ఈ బ్యాంక్.. ఎఫ్డీలపై 9శాతం వరకు వడ్డీని ఇస్తోంది!
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో వడ్డీ రేట్లు..
పెద్ద బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అధిక రేట్లను లభిస్తాయి. ఇక యూనిటీ ఫైనాన్స్ బ్యాంక్.. సాధారణ వినియోగదారులకు 4.5% నుంచి 9% మధ్యలో వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఏడు రోజుల నుంచి పదేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 4.5 శాతం నుంచి 9.5 శాతం వరకు వడ్డీ ఇస్తుండటం విశేషం. ఈ డిపాజిట్ వడ్డీ రేట్లు.. 2024 ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. 1001 రోజుల కాలపరిమితిపై అత్యధికంగా 9 శాతం వడ్డీని అందిస్తోంది. రూ.10,000 డిపాజిట్ మొత్తంతో మీకు నచ్చిన కాలపరిమితిని ఎంచుకోవచ్చు.
వడ్డీ రేట్లు ఇలా..
6 నెలలు - 201 రోజులు- 8.75%
501 రోజులు- 8.75%
Unity Small Finance Bank FD rates in Telugu : 701 రోజులు- 8.95%
1001 రోజులు- 9 %
1002 రోజులు - 3 సంవత్సరాలు- 8.15%
3 సంవత్సరాలు - 5 సంవత్సరాలు- 8.15%
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో ఎఫ్డీ రకాలు..
- రెగ్యులర్ ఎఫ్డీ
- షార్ట్ టర్మ్ & లాంగ్ టర్మ్ ఎఫ్డీ
- రీ-ఇన్వెస్ట్మెంట్
అయితే.. ఇతర బ్యాంక్‌లతో పోల్చుకుంటే.. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లలో రిస్క్ కాస్త ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్..
HDFC bank FD rates : దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను సవరించింది. ఫిబ్రవరి 9 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి హెచ్డీఎఫ్సీ ఫిక్స్డ్ డిపాజిట్లలో, మీరు మీ డబ్బును 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీని పొందవచ్చు. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అన్ని కాలపరిమితులలో 0.50% అదనపు వడ్డీ రేటు లభిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్డీ రేట్లు..
ICICI bank FD rates : ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో సంవత్సరానికి 3.00% నుంచి 7.20% వరకు వడ్డీ రేట్లు లభిస్తుంది. ఈ పథకం కాలపరిమితి 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది.
సంబంధిత కథనం