Ujjivan SFB revises FD rates: ఈ బ్యాంక్ లో పెరిగిన FD వడ్డీ రేట్లు
Ujjivan SFB revises FD rates: Ujjivan Small Finance Bank (SFB) తమ బ్యాంక్ లోని ఫిక్సడ్ డిపాజిట్ల(FD)పై వడ్డీ రేట్లను సవరించింది.
Ujjivan SFB revises FD rates: ఫిక్స్ డ్ డిపాజిట్ల(FD)పై వడ్డీ రేటును ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Ujjivan Small Finance Bank (SFB)) సవరించింది. బ్యాంక్ వెబ్ సైట్ లో తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 5 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయి.
Ujjivan SFB revises FD rates: ఈ ఎఫ్ డీ లపై
సవరించిన వడ్డీ రేట్లు ప్లాటినా(Platina F), డొమెస్టిక్, ఎన్ఆర్ఐ ఎఫ్ డీ(Domestic & NRO FD)లకు వర్తిస్తాయి. అలాగే, సంపూర్ణ నిధి, సంపూర్ణ లక్ష్య, ఆర్డీ, NRE- Fixed Deposits లకు కూడా కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
Ujjivan SFB revises FD rates: Platina FDలకు గరిష్టంగా 8.2%
ప్రస్తుత ద్రవ్యోల్బణ స్థాయి కన్నా ఎక్కువగా ఎఫ్డీలపై వడ్డీ ఇస్తున్నామని బ్యాంక్ తెలిపింది. Platina FD పై గరిష్టంగా వార్షిక 8.2% వడ్డీ లభిస్తుంది. రూ. 15 లక్షల నుంచి రూ. 2 కోట్ల మధ్య డిపాజిట్లకు ఈ Platina FD 8.2% వడ్డీ రేటు లభిస్తుంది. ఈ ప్లాటినా డిపాజిట్లకు సీనియర్ సిటిజన్లకు ఇచ్చే అదనపు 0.5 % వడ్డీ రేటు వర్తించదు.
Ujjivan SFB revises FD rates: 6.70% నుంచి 7.40% వరకు
12 నెలల నుంచి 5 ఏళ్ల కాల పరిమితి కలిగిన FD లపై ఈ బ్యాంక్ 6.70% నుంచి 7.40% వరకు వార్షిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. 560 రోజుల కాలపరిమితితో ఉన్న Platina FD లకు 8.20% వడ్డీ లభిస్తుంది.