How to check CIBIL score : సిబిల్​ స్కోర్​ చెక్​ చేసుకోవాలా? ఇలా చేయండి..-how to check cibil score online check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  How To Check Cibil Score : సిబిల్​ స్కోర్​ చెక్​ చేసుకోవాలా? ఇలా చేయండి..

How to check CIBIL score : సిబిల్​ స్కోర్​ చెక్​ చేసుకోవాలా? ఇలా చేయండి..

Sharath Chitturi HT Telugu
May 27, 2023 12:30 PM IST

How to check CIBIL score : సిబిల్​ స్కోర్​ అంటే ఏంటి? దానిని ఎలా చెక్​ చేసుకోవాలి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

సిబిల్​ స్కోర్​ చెక్​ చేసుకోవాలా? ఇలా చేయండి..
సిబిల్​ స్కోర్​ చెక్​ చేసుకోవాలా? ఇలా చేయండి.. (CIBIL)

How to check CIBIL score online : ప్రజల్లో ఇటీవలి కాలంలో సిబిల్​ స్కోర్​పై అవగాహన పెరుగుతోంది. సిబిల్​ స్కోర్​ విలువ తెలిసి వస్తుండటంతో చాలా మంది దానిని మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నారు. అయితే.. చాలా మందికి సిబిల్​ స్కోర్​ ఎలా చెక్​ చేసుకోవాలో తెలియడం లేదు. ఇది చాలా సింపుల్​ విషయం. మరి సిబిల్​ స్కోర్​ను ఎలా చెక్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాము..

సిబిల్​ స్కోర్​తో ఉపయోగాలేంటి?

సిబిల్​ (సీఐబీఐఎల్​) అంటే క్రెడిట్​ ఇన్ఫర్మేషన్​ బ్యూరో ఇండియా లిమిటెడ్​. ఇదొక క్రెడిట్​ బ్యూరో. మీ క్రెడిట్​ హిస్టరీ సమాచారాన్ని ఇది కలెక్ట్​ చేసి, మీకు సిబిల్​ స్కోర్​ను ఇస్తుంది. మంచి సిబిల్​ స్కోర్ ఉంటే కలిగే​ ఉపయోగాలు తెలుసుకుందాము..

  • లోన్​ అప్లికేషన్​ ప్రక్రియ వేగంగా జరిగిపోతుంది
  • లోన్​ డాక్యుమెంటేషన్​ ప్రక్రియ సులభమైపోతుంది
  • తక్కువ వడ్డీకే రుణాలు లభించే అవకాశం ఉంది
  • రీపేమెంట్​ టెన్యూర్​ కూడా పెరిగే అవకాశం ఉంటుంది
  • లోన్​ ఆప్షన్స్​ పెరుగుతాయి.

సిబిల్​ స్కోర్​ ఎంత ఉండాలి?

సిబిల్​ స్కోర్​ అనేది సాధారణంగా 720- 900 మధ్యలో ఉంటుంది. 750 స్కోర్​ ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మీ సిబిస్​ స్కోర్​ను ఇలా చెక్​ చేసుకోండి..

స్టెప్​ 1:- సిబిల్​ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- 'Get your CIBIL score' ఆప్షన్​పై క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- మీ పేరు, ఈమెయిల్​ ఐడీ, పాస్​వర్డ్​ ఎంటర్​ చేయండి. పాస్​పోర్ట్​ నెంబర్​, పాన్​- ఆధార్​ నెంబర్​ వంటి ఐడీ ప్రూఫ్​లను సబ్మీట్​ చయండి.

స్టెప్​ 4:- మీ పిన్​ కోడ్​, డేట్​ ఆఫ్​ బర్త్​, ఫోన్​ నెంబర్​ వివరాలు ఎంటర్​ చేయండి.

స్టెప్​ 5:- 'యాక్సెప్ట్​ అండ్​ కంటిన్యూ' ఆప్షన్​పై క్లిక్​ చేయండి.

స్టెప్​ 6:- మీ ఫోన్​కు ఒక ఓటీపీ వస్తుంది. అది టైప్​ చేసి, కంటిన్యూ బటన్​ క్లిక్​ చేయండి.

స్టెప్​ 7:-'గో టు డాష్​బోర్డ్​' మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 8:- myscore.cibil.com కు మీ పేజ్​ రీ-డైరక్ట్​ అవుతుంది.

స్టెప్​ 9:- 'మెంబర్​ లాగిన్​'పై క్లిక్​ చేయండి. మీ సిబిల్​ స్కోర్​ స్క్రీన్​పై కనిపిస్తుంది.

సిబిల్​ వర్సెస్​ క్రెడిట్​..

CIBIL score vs Credit score : సిబిల్​ స్కోర్​, క్రెడిట్​ స్కోర్​ పేర్లు విని చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. ఈ రెండు ఒకటి కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్​లు, ఎన్​బీఎఫ్​సీలు, హోజింగ్​ ఫైనాన్స్​ కంపెనీలు వంటి వాటికి సిబిల్​ స్కోర్​ అసోసియేట్​ అయ్యి ఉంటుంది. సిబిల్​ ఇచ్చే క్రెడిట్​ రేటింగే ఈ సిబిల్​ స్కోర్​.

మరోవైపు.. మీకు ఎంత వరకు క్రెడిట్​ ఇవ్వొచ్చు అన్న విషయం మీ క్రెడిట్​ స్కోర్​పై ఆధారపడి ఉంటుంది. మీ క్రెడిట్​ హిస్టరీ, అమౌంట్​ డ్యూ, క్రెడిట్​ కార్డు బిల్లులు, రీపేమెంట్​ హిస్టరీ, ఎన్ని క్రెడిట్​ ఖాతాలు ఉన్నాయి వంటి వివరాలతో క్రెడిట్​ స్కోర్​ను ఇస్తారు. అయితే క్రెడిట్​ కార్డులు ఇవ్వాలన్నా మీ సిబిల్​ స్కోర్​ చూస్తారు!

Whats_app_banner

సంబంధిత కథనం