Shanmukh Jaswanth: గంజాయి కేసులో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్.. తమ్ముడి కోసం వెళ్తే దొరికిన అన్న!-shanmukh jaswanth caught with drugs and police arrested ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shanmukh Jaswanth: గంజాయి కేసులో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్.. తమ్ముడి కోసం వెళ్తే దొరికిన అన్న!

Shanmukh Jaswanth: గంజాయి కేసులో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్.. తమ్ముడి కోసం వెళ్తే దొరికిన అన్న!

Sanjiv Kumar HT Telugu
Feb 22, 2024 01:25 PM IST

Shanmukh Jaswanth Arrested For Consuming Drugs: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు. తన ఫ్లాట్‌లో గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడిపోయాడు. దీంతో షణ్ముఖ్ జశ్వంత్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.

గంజాయి కేసులో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్.. తమ్ముడి కోసం వెళ్తే దొరికిన అన్న!
గంజాయి కేసులో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్.. తమ్ముడి కోసం వెళ్తే దొరికిన అన్న!

Shanmukh Jaswanth Caught With Drugs: సోషల్ మీడియా వాడేవారికి యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి పెద్దగా పరిచయం లేదు. సాఫ్ట్‌వేర్ డెవలపర్ యూట్యూబ్ సిరీస్‌తో తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సిరీస్‌లో హీరోయిన్‌గా బేబీ మూవీ వైష్ణవి చైతన్య నటించిన విషయం తెలిసిందే. ఇలా సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య తదితర వెబ్ సిరీస్‌లతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్.

యూట్యూబ్ సిరీస్‌లతో మాత్రమే కాకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కూడా పాల్గొని తనదైన ఆట తీరుతో మెప్పించాడు. ఇవే కాకుండా పలు వివాదాలతో కూడా ట్రెండింగ్‌లో కొనసాగాడు షణ్ముఖ్ జశ్వంత్. నిత్యం కాంట్రవర్సీలతో హైలెట్ అయ్యే యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్ మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు. ఈసారి ఏకంగా గంజాయి సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో హైలెట్ అవుతోంది.

అయితే, షణ్ముఖ్ జశ్వంత్ తమ్ముడు సంపత్ వినయ్ ఓ అమ్మాయిని చాలా కాలంగా ప్రేమించాడు. కొంత కాలం తర్వాత వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ సైతం జరిగింది. అయితే, తర్వాత ఏమైందో కానీ కొద్ది రోజుల నుంచి ప్రేమించిన అమ్మాయిని దూరం పెట్టాడు సంపత్ వినయ్. దాదాపుగా 20 రోజుల క్రిత ఆమెను కాదని మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు షణ్ముఖ్ సోదరుడు. ఈ విషయం ఏపీలో ఉంటున్న తన ప్రియురాలికి తెలిసి హైదరబాద్ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది.

నార్సింగి పోలీస్ స్టేషన్‌లో సంపత్ వినయ్‌పై ఫిర్యాదు చేసింది సదరు యువతి. గత పదేళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామని, ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయిందని, ఇప్పుడు తనను కాదని మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని ఫిర్యాదులో వెల్లడించింది. కేసు ఫైల్ చేసిన పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టారు. సదరు అమ్మాయితో కలిసి సంపత్ వినయ్‌ను అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్ జశ్వంత్ ఫ్లాట్‌కు వెళ్లారు పోలీసులు.

ఇంట్లోకి వెళ్లి చూడగా.. అక్కడ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. అంతేకాకుండా, అతని సోదరుడి దగ్గర మరో 16 గ్రాముల గంజాయి దొరికినట్లు పోలీసులు పేర్కొన్నారు. దాంతో వెంటనే అన్నదమ్ములని ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో షణ్ముఖ్ తీవ్ర వాగ్వాదానికి దిగి.. దురుసుగా ప్రవర్తించినట్లు సమచారం. గంజాయి కేసులో షణ్ముఖ్ జశ్వంత్ పాత్ర ఎంతుందో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా షణ్ముఖ్ జశ్వంత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంతకుముందు మద్యం మత్తులో షణ్ముఖ్ వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో అతివేగంగా కారు నడిపి మూడు వాహనాలు ఢీ కొట్టాడు షణ్ముఖ్. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి డ్రగ్స్ వివాదంలో బుక్కయ్యాడు షణ్ముఖ్ జశ్వంత్. కాగా షణ్ముఖ్ జశ్వంత్ మొదట షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా హర్ష చెముడుతో తీసిని వైవా షార్ట్ ఫిల్మ్ వీరికి మంచి పేరు తీసుకొచ్చింది.