Digital Marketing Jobs: 5Gతో డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు భారీ డిమాండ్!-digital marketing jobs 2022 most in demand digital marketing roles in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Digital Marketing Jobs: 5gతో డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు భారీ డిమాండ్!

Digital Marketing Jobs: 5Gతో డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు భారీ డిమాండ్!

HT Telugu Desk HT Telugu

త్వరలో భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 5G వచ్చిన తర్వాత దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది. దీంతో రాబోయే కాలంలో డిజిటల్ మార్కెటింగ్ పరిధి మరింత పెరుగుతుందని, ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగనుందని మార్కెటింగ్ నిపుణులు భావిస్తున్నారు.

Digital Marketing Jobs

స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ విప్లవం తర్వాత, సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రతి రంగం సాంకేతికతో అనుసంధానం చేయబడింది. Zomato, Swiggy, Paytm, Amazon వంటి సంస్థలు కంపెనీలు ఆన్‌లైన్ అధారంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో డిజిటల్ మార్కెటింగ్ నిపుణులను నియమించుకుంటున్నాయి. డిజిటల్ యుగంలో చాలా కంపెనీలు ఆన్‌లైన్ మార్కెటింగ్‌ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. అందుకే నేడు భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు చాలా డిమాండ్ ఉంది. అంచనా ప్రకారం, భారతదేశంలో 2 లక్షలకు పైగా డిజిటల్ మార్కెటింగ్ నిపుణుల కోసం ఇప్పటికీ డిమాండ్ ఉంది. దేశ, విదేశాల మార్కెట్‌లో డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసి, దేశంలోని చాలా సంస్థలు యువతకు డిజిటల్ మార్కెటింగ్‌లో ప్రత్యేక శిక్షణను ఇస్తున్నాయి.

5Gతో విస్తృతం కానున్న డిజిటల్ మార్కెటింగ్ పరిధి:

త్వరలో భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 5G వచ్చిన తర్వాత దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది. దీంతో రాబోయే కాలంలో, డిజిటల్ మార్కెటింగ్ పరిధి మరింత పెరుగుతుందని, ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుందని మార్కెటింగ్ నిపుణులు భావిస్తున్నారు. అందుకే, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత డిజిటల్ మార్కెటింగ్ రంగంలోకి రావడానికి ఇదే సరైన సమయం. ఈ రంగంలోకి వచ్చే యువతకు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ద్వారా అనేక సంస్థలు ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. అతి తక్కువ సమయంలో మంచి ప్యాకేజీ ఉద్యోగాన్ని పొందవచ్చు.

Google తన లెర్నింగ్ పోర్టల్‌లో తన అత్యుత్తమ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. మీరు ఈ ఆన్‌లైన్ కోర్సులలో నమోదు చేసుకోవడం ద్వారా ట్యుటోరియల్స్, ఆన్‌లైన్ తరగతులకు యాక్సెస్ పొందవచ్చు. వీటిలో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO), సోషల్ మీడియా, వెబ్‌సైట్ ట్రాఫిక్ విశ్లేషణ మొదలైన వాటితో సహా వివిధ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు పూర్తిగా ఉచితం. ఈ కోర్సులు చేయడానికి పట్టే గరిష్ట సమయం 1 - 40 గంటలు. Google ద్వారా అందించే డిజిటల్ మార్కెటింగ్ కోర్సును డిజిటల్‌లో ఏళ్ళుగా అనుభవం ఉన్ననిపుణులు రూపొందిస్తారు.

సంబంధిత కథనం