తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips For Money: లక్ష్మీదేవితో పాటు ఈ దేవుడి విగ్రహం ఇంట్లో పెట్టుకున్నారంటే సంపదకి లోటే ఉండదు

Vastu tips for money: లక్ష్మీదేవితో పాటు ఈ దేవుడి విగ్రహం ఇంట్లో పెట్టుకున్నారంటే సంపదకి లోటే ఉండదు

Gunti Soundarya HT Telugu

03 February 2024, 18:30 IST

google News
    • Vastu tips for money: ఆర్థిక సమస్యలతో విసిగిపోయారా? అయితే మీ ఇంట్లో ఈ దిశలో లక్ష్మీదేవితో పాటు ఈ దేవుడి విగ్రహం పెట్టుకోండి. సంపద పెరిగి డబ్బుకు కొరత ఉండదు. 
లక్ష్మీదేవి ఆశీస్సులు పొందే మార్గం
లక్ష్మీదేవి ఆశీస్సులు పొందే మార్గం

లక్ష్మీదేవి ఆశీస్సులు పొందే మార్గం

Vastu tips for money: ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్నారా? అయితే మీ ఇంటి పూజ గదిలో లక్ష్మీదేవితో పాటు ఈ విగ్రహం కూడా ఉంచడం వల్ల డబ్బు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాస్తు ప్రకారం ఆర్థిక పురోగతి నేరుగా ఇంటి తూర్పు, ఈశాన్య దిక్కుతో సంబంధం కలిగి ఉంటుంది.

వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ దిశలలో వాస్తు లోపం ఉంటే ఆ వ్యక్తి డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. ఈ దిశలో కొన్ని వస్తువులు పెట్టడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. అందుకే వాస్తు ప్రకారం విజయవంతమైన కెరీర్, ఆర్థిక శ్రేయస్సు కోసం ఈ దిశలో కొన్ని వస్తువులు పెట్టుకుంటే మంచిది. దాని వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

బ్లూ పిరమిడ్

ఇంటికి ఉత్తర దిశలో నీలం రంగు పిరమిడ్ ఉంచడం శుభ్రపదంగా భావిస్తారు. దీన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ వ్యక్తికి ధనానికి ఎటువంటి కొదవ ఉండదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

గాజు గిన్నె

అలంకరణ కోసం కొంతమంది తమ ఇళ్ళలో గాజు వస్తువులు అందంగా అమర్చుకుంటారు. వాస్తు ప్రకారం ఒక గాజు గిన్నెను ఇంటికి ఉత్తర దిశలో ఉంచాలి. దానితో పాటు గిన్నెలో వెండి నాణెం ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం మీ మీద ఉంటుంది.

తులసి మొక్క

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తర దిశలో తులసి మొక్కని నాటాలి. వీటితో పాటు ఉసిరి చెట్టు నాటడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది.

వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహం

వాస్తు ప్రకారం వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటి ఈశాన్య దిశలో ఉంచాలి. అలాగే వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాల ముందు రోజూ దీపాలు వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనానికి లోటు ఉండదు.

ఉత్తరం

వాస్తు ప్రకారం ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు. అందుకే ఆ దిక్కున డబ్బులు పెట్టుకునేందుకు సేఫ్, లాకర్ ఏర్పాటు చేసుకోవాలని పండితులు చెప్తారు. సంపదల దేవుడిగా కుబేరుడిని పరిగణిస్తారు. ఆయన ఆశీస్సులు పొందటం కోసం ఈ దిశలో సేఫ్ పెట్టడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

పూజకి ఈశాన్య దిక్కు

ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా పూజ గది లేదా మందిరం ఉంటుంది. ఒకవేళ పూజ గది ఏర్పాటు చేసుకోలేని వాళ్ళు కనీసం ఒక అల్మరా అయినా దేవుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఉపయోగిస్తారు. పూజ చేసుకునేందుకు ఈశాన్య దిక్కు ఉత్తమం. అలాగే పూజ చేసేటప్పుడు మీ ముఖం తూర్పు దిశలో ఉండాలి.

పూజ గదిలో విగ్రహాలు 9 అంగుళాలకి మించి ఎత్తు ఉండకూడదు. ఏ దేవత విగ్రహం లేదా చిత్రపటం అయినా కూడా సంతోషకరమైన భంగిమలో ఉన్నది ఏర్పాటు చేసుకోవాలి. ఆగ్రహంతో ఉన్న దేవతామూర్తుల చిత్రపటాలు పెట్టకూడదు. విరిగిన, పగిలిన విగ్రహాలు పొరపాటున కూడా ఉంచకూడదు. వాటిని ఆలయంలో పూజారికి ఇస్తే నిమజ్జనం చేస్తారు. దేవతల విగ్రహాలు ఎప్పుడూ నేల మీద ఉండకూడదు. కనీసం భూమికి రెండు అంగుళాలు ఎత్తులో ఉండాలి. పూర్వీకుల చిత్రపటాలు పూజ గదిలో పెట్టుకోకూడదు.

 

తదుపరి వ్యాసం