Jade plant: ఈ కుబేరుని మొక్క మీ ఇంట్లో ఉంటే కనక వర్షమే
Jade plant: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ మొక్క మీ ఇంట్లో ఉండటం వల్ల సంపద పెరుగుతుంది. ఆర్థిక లాభం పొందుతారు. ఈ మొక్కని సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి.
కాలుష్య వాతావరణంతో విసిగిపోయిన చాలా మంది ఇంట్లో పచ్చని మొక్కలు పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు చాలా మంది తమ ఇళ్ళలో ఎక్కడ చూసినా చిన్న చిన్న కుండీల్లో మొక్కలు పెంచుకుంటున్నారు. ఇవి ఇంటికి అందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు మనకి ఆరోగ్యాన్ని అందిస్తాయి. గాలిని శుభపరిచి స్వచ్చమైన వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి.
సంపదని ఆకర్షించేందుకు అందరూ మనీ ప్లాంట్ తమ ఉండేలా చూసుకుంటారు. ఇంటి గుమ్మం దగ్గర వీటి తీగలు ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇది మాత్రమే కాదు మీ సంపదని పెంచే మొక్క మరొకటి ఉంది. అది మనీ ప్లాంట్ కంటే మరింత శుభ్రపదమైంది. ఇంతకీ ఆ మొక్క పేరు ఏంటో తెలుసా క్రాసులా. దీన్ని జాడే మొక్క, కుబేర మొక్క, లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం కుబేరుడు సంపదకి దేవుడిగా పిలుస్తారు. కుబేరుడు ఆశీస్సులు ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకి ఎటువంటి కొదువ ఉండదు.
కుబేరుడికి ఇష్టమైన క్రాసులా మొక్క మీ ఇంట్లో పెట్టుకుంటే సంపద రెట్టింపు అవుతుంది. అయితే వాస్తు ప్రకారం మాత్రమే ఈ మొక్కని ఇంట్లో నాటుకోవాలి. ఈ మొక్కని సరైన దిశలో నాటడం వల్ల కుబేరుడిని ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది. ధన లాభం పొందుతారు. ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రమే కాదు ఫెంగ్ షూయి శాస్త్రం ప్రకారం కూడా క్రాసులా మొక్క చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
ఏ దిశలో నాటాలి?
ఇంటి ఆర్థిక ఇబ్బందులని అధిగమించడానికి, కుబేరుడి అనుగ్రహం పొందటం కోసం ఇంటికి ఉత్తర దిశలో ఈ క్రాసులా మొక్క నాటాలి. ఈ మొక్క కుబేరుడికి ఎంతో ప్రీతికరమైనది. దీన్ని నాటడం వల్ల వ్యక్తి అదృష్టం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సంపద పెంచే మొక్క కావడంతో దీన్ని డబ్బు చెట్టు అని కూడా పిలుస్తారు.
అదే సమయంలో వ్యాపార రంగంలో విజయం సాధించాలని అనుకుంటే నైరుతి దిశ ఈ మొక్క పెట్టుకునేందుకు అనువైనది. ఇవి మాత్రమే కాదు పసుపు మొక్క, మందార పువ్వుని నాటడం వల్ల కుబేరుడి అనుగ్రహంతో పాటు ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది. ఇంట్లో జాడే మొక్క ఉండటం వల్ల సానుకూల శక్తి ఆకర్షితమవుతుంది. నెగటివ్ ఎనర్జీని తొలగించి వేస్తుంది. ఇది ఇంటికి సుఖ సంతోషాలని, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ మొక్కని ఇంట్లో పెట్టుకోవడం వల్ల శాంతి, కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటాయి. గుండ్రని మెరిసే ఆకులు ఉండటం వల్ల ఈ మొక్క అందరినీ ఆకర్షిస్తుంది. చూసేందుకు కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
క్రాసులా మొక్క నాటేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఉత్తర లేదా నైరుతి దిశలో క్రాసులా మొక్కను నాటాలి. ఈ దిశలో చీకటిగా ఉండకూడదు. మొక్క మీద సూర్యరశ్మి పడే విధంగా చూసుకోవాలి. అప్పుడే ఇంట్లో సంపద వర్షం కురుస్తుందని నమ్ముతారు.