Wall clock: ఇలాంటి గోడ గడియారం మీ ఇంట్లో ఉంటే మీ ఆదాయం పెరుగుతుంది, అదృష్టం వెంటే ఉంటుంది-vastu tips for wall clock this type of wall clock in your home bring happiness and luck ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Wall Clock: ఇలాంటి గోడ గడియారం మీ ఇంట్లో ఉంటే మీ ఆదాయం పెరుగుతుంది, అదృష్టం వెంటే ఉంటుంది

Wall clock: ఇలాంటి గోడ గడియారం మీ ఇంట్లో ఉంటే మీ ఆదాయం పెరుగుతుంది, అదృష్టం వెంటే ఉంటుంది

Gunti Soundarya HT Telugu
Feb 14, 2024 04:08 PM IST

Wall clock: అందరి ఇళ్ళలో గోడ గడియారం ఉంటుంది. కానీ దాన్ని సరైన దిశలో పెట్టినప్పుడే అదృష్టం, సమయం, సంపద మీకు కలిసి వస్తాయి. వాస్తు ప్రకారం ఏ దిశలో గోడ గడియారం పెట్టుకోవాలంటే..

గోడ గడియారం ఏ దిశలో ఉండాలి?
గోడ గడియారం ఏ దిశలో ఉండాలి? (pexels)

Wall clock: ప్రతి ఒక్కరి ఇంట్లో గోడ గడియారం తప్పనిసరిగా ఉంటుంది. ఎక్కడ గోడకి మేకు ఉంటే అక్కడ తగిలించేస్తారు. మరికొందరు తమకు అనువుగా ఉండే ప్రదేశంలో చూడగానే కంటికి టైమ్ కనిపించాలనే ఉద్దేశంతో హాల్లో పెట్టుకుంటారు. కానీ నిజానికి గోడ గడియారం ఇంట్లో ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు. దాన్ని వాస్తు ప్రకారం తగిలించాలని నిపుణులు చెబుతున్నారు. 

వాస్తు ప్రకారం ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు సానుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంది. అవి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఇంట్లో పెట్టుకునే గడియారానికి కూడా వాస్తు చూసుకోవాలి. దాన్ని సరైన దిశలో పెట్టినప్పుడు అదృష్టం వరిస్తుంది. ఇంట్లో ఆనందం తీసుకొస్తుంది. లేదంటే ఇంట్లో సమస్యలు, ఏ పని తలపెట్టినా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో వచ్చే మాట ఒకటే.. ఏంటో ఈ మధ్య ఏం చేసినా టైమ్ కలిసి రావడం లేదని అంటుంటారు. నిజానికి ఈ మాట వెనుక అర్థం అదే. గడియారం సరైన దిశలో ఉంటే అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది.

ఏ దిశలో గడియారం ఉంచాలి?

వాస్తు ప్రకారం ఇంటి తూర్పు దిశలో గోడ గడియారాన్ని ఉంచడం ఉత్తమంగా భావిస్తారు. దక్షిణ దిశ గోడకి గడియారం ఉంచడం అశుభంగా భావిస్తారు. ఇది జీవితంలో ప్రతికూలతని పెంచుతుంది. 

గడియారం ఎక్కడ పెట్టకూడదు 

వాస్తు ప్రకారం గడియారం పడక గదిలో మంచం ముందు పెట్టుకోకూడదు. మంచం ముందు గడియారం ఉండటం ఉంటే మంచం ప్రతిబింబం గడియారం మీద పడుతుంది. అలా జరిగితే అది చెడు ప్రభావాన్ని చూపుతుంది. తలుపు పైన గడియారం తగిలించడం నివారించండి. 

టైమ్ కరెక్ట్ గా ఉండాలి 

గడియారంలో టైమ్ కరెక్ట్ గా ఉండాలి. వాస్తవ సమయం కంటే తక్కువ సమయం ఉన్న పెట్టకూడదు. అయితే కొన్ని నిమిషాలు ముందు పెట్టుకోవచ్చు. ఆఫీసుకి, స్కూల్ కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఇలాగే చేస్తారు. టైమ్ కొన్ని నిమిషాలు ఎక్కువ పెట్టుకోవడం వల్ల సరైన టైమ్ కి గమ్యానికి చేరుకుంటారు. 

గడియారం శుభ్రంగా ఉండాలి 

గోడకి తగిలించేది కదా అని దుమ్ము కొట్టుకుపోయినా కూడా తుడవకుండా అలాగే ఉంచేస్తారు. ఎప్పుడో బ్యాటరీలు ఆగిపోయి గడియారం తిరగకుండా ఉన్నప్పుడు కొత్తవి వేస్తూ దాన్ని శుభ్రం చేయడం మరుస్తారు. కానీ అలా అసలు చేయకూడదు. గోడ గడియారం మురికిగా ఉండటం వల్ల ఇంట్లో గొడవలు జరిగే పరిస్థితి ఏర్పడుతుందని నమ్ముతారు. 

అద్దం పగలకూడదు

గోడ గడియారం అద్దం పగిలినా పని చేస్తుంది కదాని దాన్ని అలాగే ఉంచేస్తారు. కానీ ఇంట్లో పగిలిన అద్దం ఉండకూడదు. చెడిపోయిన గడియారం అసలు పెట్టుకోకూడదు. ఇది వ్యక్తి జీవితంలో అడ్డంకులు కలిగిస్తుంది. వాస్తు ప్రకారం నీలం, నలుపు, సింధూరం రంగు గోడ గడియారాలు ఎప్పుడు ఉపయోగించకూడదు. 

గడియారం పరిమాణం ముఖ్యమే 

వాస్తు ప్రకారం గోడ గడియారం దిశ ఎంచుకున్నట్టే దాని ఆకారం కూడా చాలా ముఖ్యమైనది. ఇంట్లో లోలక గడియారం ఉంటే చాలా శుభప్రదంగా భావిస్తారు. మీ వీలుని బట్టి ఇంట్లో ఎనిమిది వైపుల గోడ గడియారాన్ని ఉంచుకోవచ్చు. దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. గుండ్రటి ఆకారంలోని గడియారం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకుంటే డబ్బు ప్రవాహం పెరుగుతుంది. పిల్లలు చదువు పట్ల ఆసక్తి కనబరుస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. 

అర్థ చంద్రాకారం గడియారం కూడా పెట్టుకోవచ్చు. ఇది కుటుంబ జీవితంలో ఆనందం, శాంతిని పెంచుతుందని నమ్ముతారు. భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగడం కోసం హార్ట్ షేప్ గడియారం పెట్టుకోవచ్చు. వాస్తు ప్రకారం త్రిభుజాకారంలో ఉన్న గడియారం ఎప్పుడు ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది నెగిటివిటీని ఆకర్షిస్తుంది.

Whats_app_banner