Lord Ganesha : వినాయకుని ఆకారంలో ఉన్న పరమార్థం ఏమిటి? వినాయకుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలుంటాయి?
Lord Ganesha : వినాయకుడి ఆకారం గురించి చాలా కథలు ఉన్నాయి. అయితే ఈ ఆకారంలో ఉన్న పరమార్థం ఏంటి? వినాయకుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అనే విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
వినాయకుని తొండం ఓంకారానికి, వక్రదంతం పరబ్రహ్మకి, పెద్ద చెవులు శ్రవణం చెప్పేటప్పుడు మంచి విషయాల్ని ఉంచుకొని చెడు విషయాలను ఏరిపారేయాలని సూచిస్తాయి. గణేశ ఉదరం స్థిరత్వానికి చిహ్నం. హస్త పాశ అంకుశాలు పాశం రాగానికి అంకుశం కోధానికీ గుర్తు అవి అధీనంలో ఉంటాయి. అభయహస్తం భక్తుల రక్షణకవచం. మరొక హస్త హోదకం ఆనందానికి ప్రతీక. పరమానందాన్ని ప్రసాదిస్తాడు.
ట్రెండింగ్ వార్తలు
గణపతికి సిద్ది బుద్ధి అనే ఇరువురు భార్యలు ఉన్నట్లు వారిలో సిద్ధికి లాభా, బుద్ధికి లక్ష్య అనే కుమారులున్నట్లు చెప్పారు. బుద్ధి లేదా వివేకం ఉన్నప్పుడు లక్ష్యం లేదా బుద్ధి కుదురుతుంది. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి శక్తి కూడా సిద్ధిస్తుంది. అదే లాభ గణపతి అనుగ్రహంతో కార్యసిద్ధి, బుద్ధికుశలత ద్వారా లక్ష్యసాధన పొందవచ్చును ఆధ్యాత్మికపరంగా భక్తులకు భగవల్లాభం లక్ష్యం మోక్షప్రాప్తికి ఆయన శక్తులు దోహదపడతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
వినాయకుని బుద్ధి సూక్ష్మత లోకకళ్యాణార్థం వినియోగించిన అగస్తునికి, అగస్త్యముని దక్షిణానికి వాస్తూ వరప్రసాదంగా పొందిన కావేరి పవిత్ర జలాన్ని కమండలంలో ఉంచి ఎవ్వరికి ఇవ్వలేదు. ఇంద్రుడి అభ్యర్థర మేరకు గణపతి కాకిరూపంలో వచ్చి కమండం అంచుపై వాలి కావేరీని ప్రవహింపచేస్తాడు. అగస్త్యముని తరుముకునాగా తన నిజస్వరూపం జూపించి ఆశీర్వదిస్తాడు. గణపతికి ప్రీతిపాత్రమైన సంఖ్య 21.
ఈ 21 రకాల పత్రాలలో పూజించడం ఆచారం. దీని ఆంతర్యం బెషధీయుక్త ప్రాశస్తం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్ర ప్రాతిపదికమీద బెషధీయుక్తమయిన పత్రాలతో జపిస్తే ఇటు మోక్షమే కాదు అటు ఆరోగ్యమూ ప్రాప్తిస్తాయి. ఏకవింశతి పూజతో నామాలతో స్వామిని త్రికరణశుద్ధిగా పూజిస్తే సత్వరఫల ప్రదాత అయిన విఘ్నరాజు మనందరికీ శుభాల్ని ప్రసాదిస్తాడు. ఓషధీవ తంతు నమః అనేది విఘ్నేశ్వరుని సహస్రనామాలలో ఒకటి. ఆ తత్వము సమస్త ఓషధులకు వాని శక్తులకు ఆధారంగా ప్రాశస్త్యాన్ని పొందింది. అంతర్నిహితమైన అద్భుత విజ్ఞాన నిదర్శన పూజాతత్త్వమే ఈ పత్రిపూజ విశిష్టత.
గణేశపూజలో దుర్వాయుగ్మం గరిక జంటతో పూజ విశేష ఫలప్రదం. పరమాదేవి దుర్వా దుస్వ్పప్న నాశనీ అంటూ (శ్రుతి గరికను దేవి ప్రస్తావించింది. బుద్ధి మీద పనిచేస్తుంది. దుస్వష్నాలను నివారిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మహాగణపతికి ప్రియమైన చతురావృత్తి తర్పణం అనుష్టించటం వల్ల ఆయుష్షు బుద్ధి యశస్సు కవిత్వం, ఐశ్వర్యం, బలం, భుక్తి, ముక్తి చేరగలవు. గణపతి విగ్రహాన్ని నీటిలోనుంచి తెచ్చిన మట్టితో చేస్తాం. గనుక మరల దానిని పత్రితో సహా నీటిలో కలపాలి. లోహగణపతులకు నిమజ్జనం అవసరముండదు. చతుర్థినాడు చేసేది వినాయకవ్రతకల్పం. కాబట్టి మృత్తికతోనే స్వామిని ఆరాధించి వరసిద్ధిని పొందుతామన్న మాట. రాగిలోహంతో వినాయకుణ్ణి ఆరాధిస్తే ఐశ్వర్యం వస్తుంది. వెండిలోహంతో స్వామిని ఆరాధిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది. స్వర్ణంతో గణేశ విగ్రహాన్ని తయారుచేసి ఆరాధిస్తూ సంకల్పసిద్ధి, ఐశ్వర్యం కలుగుతాయి. శిలారూపంలో స్వామిని ఆరాధిస్తే జ్ఞానసిద్ధి కలుగుతుందని చిలకమర్తి తెలిపారు.
చతుర్ధీ దేవత ఒకమారు సృష్టికర్త ప్రకృతిని ఆహ్వానించి పరమపవిత్రమైన షడక్షర గణేశమంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రజపం వల్ల గణేశానుగ్రహం కలిగి ప్రకృతి చతుర్ధీదేవత అయింది. ఆమె ఒకవైపు నల్లగా మరొకవైపు తెల్లగా జన్మించింది. ఆమె అంగాంగముల నుండి చంద్రుని మిగిలిన కళలు ఉద్భవించాయి. కృష్ణ చతుర్ధినాటి రాత్రివేళలో అతనిని పూజించడం వల్ల వారి వారి ఇష్టార్థాలు సిద్ధిస్తాయని గణపతి ప్రకృతికి వరమిచ్చాడని ముద్గల పురాణం తెలియచేస్తున్నది. గణనాథ కథలు సర్వులకు విదితములే. పరమేశ్వరి ముద్దుల తనయుడైన గణేశుని కథను, శమంతకోపాఖ్యానాన్ని గణపతి పురాణాన్ని పఠిస్తే సర్వకార్యాలు సిద్ధిస్తాయని అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ పేర్కొన్నారు.