Vastu Tips for Placing Mirrors । మీ ఇంట్లో అద్దం సరైన దిశలోనే ఉందా? లేదంటే..
Vastu Tips for Placing Mirrors: వాస్తు శాస్త్రం ప్రకారం అద్దానికి చాలా ప్రముఖ్యత ఉంది. ఇంట్లో పగిలిన అద్దం ఉంచుకోకూడదు. అద్దాలు ఏ మూలలో ఉంటే శుభకరమో ఇక్కడ తెలుసుకోండి.
వాస్తు శాస్త్రంలో ప్రతిదానికీ దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. ప్రతి వస్తువును సరైన స్థలంలో ఉంచాలని వాస్తు శాస్త్రం నొక్కి చెబుతుంది. ఇంట్లోని ఆయా వస్తువులు సరైన చోట ఉంచడం ద్వారా ఆ ఇల్లు వాస్తు దోషాలు లేకుండా ఉంటుందని, తద్వారా ఇంట్లో సమతుల్యత, సానుకూలత ఏర్పడుతుంది. కానీ మనం తరచుగా ఈ విషయాలను మరచిపోతాము. వస్తువులను సరైన స్థలంలో ఉంచకపోవడం వల్ల ఇంట్లో గొడవలు, సమస్యలు పెరుగుతాయని నమ్మకం.
ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి. ఆ ఇంట్లోకి రాగానే ఒక మంచి అనుభూతి కలగాలి. ఇంట్లో వస్తువుల అమరిక ద్వారా ఇలాంటి అనుభూతి కలుగుతుంది. అందుకే ఇంటి నిర్మాణానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది, ఇంటి అలంకరణకు, ఇంట్లో వస్తువుల అమరికకు వాస్తు శాస్త్రంలో అంతే ప్రాముఖ్యత ఉంటుంది.
మనం ఉదయం లేచిన దగ్గర్నించీ చాలా సార్లు అద్దంలో చూసుకుంటాం. అద్దం ఒక వస్తువు, అయినప్పటికీ ఇది మన జీవనవిధానంలో ఒక భాగం. అందువల్ల అద్దానికి వాస్తుశాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
Vastu Tips for Placing Mirrors - వాస్తు ప్రకారం ఇంట్లో అద్దాలు
ఇంట్లో అద్దాలు ఉండటం వలన గోడకు అలంకరణ మాత్రమే కాకుండా మన దైనందిన అవసరాలను తీర్చుతుంది. అంతేకాదు. ఇంట్లో వివిధ ప్రదేశాలలో అద్దం ఉంచడం ద్వారా వాస్తు దోషాలు కూడా అంతం అవుతాయని నిపుణులు అంటున్నారు. ఇంటిలోని ఏ మూలలో, ఎలాంటి అద్దం శుభప్రదంగా పరిగణించబడుతుందో తెలుసుకోండి.
ఇంట్లో అద్దం పెట్టడానికి సరైన స్థలం ఏదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఇంటి నేలమాళిగలో లేదా నైరుతి మూలలో, అంటే బాత్రూమ్ లేదా టాయిలెట్ ఉంటే, అద్దం తూర్పు దిశలో ఉండాలి, అది కూడా చతురస్ర లేదా దీర్ఘచతురస్ర ఆకారంలో అద్దం పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి వాస్తు దోషాలు త్వరలో తొలగిపోతాయి.
మీ ఇంట్లో ఏదైనా భాగం అసాధారణ ఆకారంలో అంటే ఒక మూల తక్కువగా, లేదా విస్తరించినట్లుగా ఉంటే ఆ భాగంలో అద్దం ఉంచాలి. లేదా చీకటిగా ఉన్న ప్రాంతంలోనూ అద్దం ఉంచాలి. ఇలా ఉంచడం ద్వారా మీరు శక్తిని సమతుల్యం చేసినట్లు అవుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, పడకగదిలో అద్దం మంచానికి ఎదురుగా ఉంచుకోవడం మంచిది కాదు. మంచంపై పడుకున్న మనుషుల ప్రతిబింబాలు అద్దంలో కనిపించకూడదు. ఇలా ఉంటే నెగెటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది. సంబంధబాంధవ్యాలు దెబ్బతింటాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం, అద్దం లేదా గాజు ఫ్రేమ్ చాలా ప్రకాశవంతమైన రంగులో ఉండకూడదు ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తుంది. ముదురు రంగులకు బదులుగా లేత, సున్నితమైన రంగులను ఉపయోగించాలి. ఎరుపు, ముదురు నారింజ లేదా ముదురు గులాబీ రంగు ఫ్రేమ్‌లను నివారించండి. బదులుగా, తెలుపు, క్రీమ్, ఆకాశం, లేత నీలం, లేత ఆకుపచ్చ, గోధుమ రంగు మొదలైన రంగులను ఎంచుకోండి. అలాగే ఇంట్లో పగిలిన అద్దాలు అసలు ఉంచుకోకూడదు.
మీ ఇంటి వెలుపల విద్యుత్ స్తంభాలు, ఎత్తైన భవనాలు, అవాంఛిత చెట్లు పొడుచుకు వచ్చినట్లయితే, మీరు ఇంటి ప్రధాన ద్వారం తలుపుపై పాక్వా అద్దం ఉంచడం ద్వారా దోషం తొలగించవచ్చు. పాక్వా అద్దం అష్టభుజి చెక్క ఫ్రేమ్‌లో ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్