Telugu News  /  Rasi Phalalu  /  Vastu For Home Entrance, Do Not Keep These Things At Your Main Door, Know What To Keep
Vastu For Home Entrance
Vastu For Home Entrance (Pixabay)

Vastu For Home Entrance। ఇంటి ప్రవేశ ద్వారం ఎదురుగా ఇవి ఉండకూడదు, ఏవి ఉండాలంటే?

29 November 2022, 16:17 ISTHT Telugu Desk
29 November 2022, 16:17 IST

Vastu For Home Entrance: వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం అతి ముఖ్యమైనది. సానుకూలత, ప్రతికూలత రెండూ ఇక్కడ్నించే ప్రవేశిస్తాయి. ఇంటి గుమ్మం వద్దం ఏం ఉంచుకోకూడదో చూడండి.

ఎవరైనా తమ కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది ఇల్లు మాత్రమే. ఈ ఇల్లు మన గౌరవాన్ని, మన వ్యక్తిత్వాన్ని, మన విలువలను, విలువైన వస్తువులను భద్రపరిచే ఒక సొంత బ్యాంక్ లాంటిది. అటువంటి ఇంటిని వాస్తు పరంగా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించుకోవడం చాలా అవసరం. వాస్తు మన జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాలను నిర్దేశిస్తుంది. మన అదృష్టం, శ్రేయస్సు, సంపద, కుటుంబంలో సంతోషం ఇలా అనేక అంశాల్లో పాత్ర వహిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

కాబట్టి కొత్త ఇంటిని నిర్మించేటపుడు లేదా కొనుగోలు చేసేటపుడు వాస్తు నియమాలు చూసుకోవాలి. అలాగే ప్రస్తుతం ఉన్న ఇంట్లో కూడా వాస్తు పరంగా ఏవైనా దోషాలు ఉంటే వాటిని సరిచేసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Vastu For Home Entrance- ఇంటి ప్రవేశ ద్వారం వాస్తు చిట్కాలు

వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం చాలా ముఖ్యమైనది. అదృష్టం తలుపుతట్టాలన్నా, ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించాలన్నా అందుకు మీ ఇంటి ముఖద్వారం ఎలా ఉందనేదే నిర్ణయిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మం వద్దం ఏమి ఉంచకూడదు, ఏం ఉంచాలో ఇప్పుడు తెలుసుకోండి.

ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉండరాదు

చాలా మంది ప్రవేశ ద్వారం వద్ద గడప ముందర చెప్పులు ఉంచడం చేస్తారు. అలాగే ప్రవేశ ద్వారానికి ఎదురుగా షూర్యాక్ లేదా చెప్పుల స్టాండ్ ఉంచుతారు. కానీ ప్రధాన ద్వారం ఎదురుగా గానీ, గడప ముందు గానీ చెప్పులు ఉంచడం వాస్తు పరంగా దోషాన్ని కలిగిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద బూట్లు, చెప్పులు చిందరవందరగా పడి ఉండటం వల్ల ఇంట్లో నిత్యం తగాదాలు, గొడవలు జరుగుతాయి కాబట్టి, షూ రాక్‌ను ఒక పక్కగా ఉంచాలి. ఓపెన్ షూ రాక్‌కు బదులుగా క్లోజ్డ్ షూ రాక్‌ని ఉపయోగించండి. వీలైతే దాని పైన ఒక అలంకార వస్తువును ఉంచండి. ఇది వాస్తుపరంగా సరైనది.

చెట్టు లేదా మొక్కలు

మెయిన్ డోర్ నుండి మాత్రమే పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏదైనా అడ్డంకి ఉంటే, వాస్తు ప్రకారం అది సమస్యను సృష్టించవచ్చని నమ్ముతారు. మీ ఇంటి ద్వారానికి ఎదురుగా చెట్టు ఉంటే అది అశుభ సంకేతం. వాస్తు ప్రకారం అస్సలు మంచిది కాదు. అలాగే ఇంటి అలంకరణ కోసం చాలా సార్లు ఇంటి ప్రధాన ద్వారం వద్ద మీద తీగలు, మొక్కలు పెంచుతారు. కానీ ఇది వాస్తు పరంగా దోషం. ఇంటి ఆవరణలో మొక్కలు, చెట్లు ఉండాలి. ద్వారానికి ఎదురుగా కాకుండా ద్వారానికి ఇరుపక్కలా ఉంటే అది సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది.

స్వస్తిక్ గుర్తు ఉండాలి

ఇంటి ప్రవేశ ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును ఉపయోగించండి. మీరు దానిని పెయింట్ చేయవచ్చు లేదా గుర్తు స్వస్తిక్ ఉన్న స్టిక్కర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది అదృష్టం, శ్రేయస్సు తెస్తుంది. స్వస్తిక్ స్వస్థతను కలుగజేస్తుంది. వ్యాధులు, దుఃఖాలను తగ్గిస్తుంది మరోవైపు ఆనందం, శ్రేయస్సును పెంచుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

కిటికీలు

ఇంటి ప్రధాన ద్వారంపై కిటికీని నిర్మించడం ద్వారా ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. ఆనందం, శాంతి చేకూరుతుంది. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించేటప్పుడు ప్రధాన ద్వారానికి రెండు వైపులా సమాన పరిమాణంలో కిటికీలు వేయాలి. ప్రధాన తలుపుకు ఇరువైపులా కిటికీలు చేయడం ద్వారా, ఒక అయస్కాంత వృత్తం సృష్టించబడుతుంది, దాని కారణంగా సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే, ఇంట్లో ఉన్న మొత్తం కిటికీల సంఖ్య సరిసమానంగా ఉండాలి, బేసిగా ఉండకూడదు.

ఏనుగు విగ్రహాలు

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇల్లు లేదా కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఒక జత ఏనుగుల విగ్రహాలు తోండం ఎత్తినట్లుగా ఉండాలి. ఇది కుటుంబానికి ఆనందం, అదృష్టాన్ని తెస్తుంది. సంబంధాలను బలపరుస్తుంది, కుటుంబంలోని సభ్యులందరి మధ్య సామరస్యం ఉంటుంది. ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి తిరుగుతుంది.

గాలికి మోగే సంగీత వాయిద్యం

చాలా సార్లు, కొందరి ఇళ్లలో విండ్ చైమ్ మధురమైన ధ్వనిని మీరు విని ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో కాకుండా ఇంటి వెలుపల లేదా గేట్‌ వద్ద 6 రాడ్‌లతో కూడిన మెటల్ విండ్‌చైమ్‌ను ఉంచడం మంచిది. విండ్ చైమ్ ధ్వని ఇంటి నుండి ప్రతికూలతను బయటకు తొలగిస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పూర్తిగా మత విశ్వాసాలకు అనుకూలంగా జాబితా చేసినది. వీటికి ఎలాంటి కచ్చితమైన శాస్త్రీయత, ఆధారాలు లేవు, కేవలం నమ్మకాలతోనే ముడిపడిన అంశాలు మాత్రమే.

టాపిక్