Negative Energies in House | ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయని అనుమానామా? వెంటనే ఇలా చేయండి!-immediately follow these vastu remedies to remove negative energies from house ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Immediately Follow These Vastu Remedies To Remove Negative Energies From House

Negative Energies in House | ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయని అనుమానామా? వెంటనే ఇలా చేయండి!

HT Telugu Desk HT Telugu
Oct 13, 2022 08:20 PM IST

Negative Energies in House: కొందరి ఇంట్లో అన్నీ ఉన్నా ఏదో వెలతి ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరగవు, ఏ పని ముందుకు సాగదు. ఎప్పుడు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. దీనిని నివారించటానికి నిపుణులు అందించిన ఈ చిట్కాలు పాటించండి.

Negative Energies in House- Vastu Remedies
Negative Energies in House- Vastu Remedies (Unsplash)

Negative Energies in House: క్రమరహితమైన నిర్మాణాలు వాస్తు దోషాలను కలిగి ఉంటాయి. వాటికి అక్కడి ప్రాదేశిక ప్రభావం అదనంగా ఉండవచ్చు. ఫలితంగా ఆ చోటు ప్రతికూల శక్తులకు ఆవాసంగా మారుతుంది. ఈ కారణంగా ఆ ప్రదేశంలో నివసించే వ్యక్తులకు జీవితంలో నిత్యం సమస్యలు, ఊహించని సంఘటనలు ఎదురుకావొచ్చు. ప్రత్యేకించి దక్షిణం నుండి పడమర దిశలో తీవ్రమైన వాస్తు లోపాలు ఉండటం, పూజా మందిరం తప్పు ప్రదేశంలో ఉండటం వంటివి ప్రతికూల ఫలితాలను కలిగిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

అదేవిధంగా, ఇల్లు అపరిశుభ్రంగా ఉండటం, ఇల్లంతా చిందరవందరగా ఉండటం. ఇంట్లో ఎక్కువగా ఉపయోగించని, పాడైపోయిన, విరిగిన వస్తువులు ఉండటం వంటివి ప్రతికూల శక్తులను పెంచి పోషిస్తాయి.

అంతేకాకుండా ఇంటి గోడలపై కుటుంబ సభ్యుల మధ్య శత్రుత్వాన్ని వర్ణించే చిత్రాలు లేదా మూర్ఖత్వం, విచారాన్ని వర్ణించే ఏ విధమైన పెయింటింగ్‌లు ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తులు విపరీతంగా పెరుగుతాయి. తాజ్ మహల్ వంటి కళాఖండాలు లేదా భయానకమైన శిల్పాలు మీకు తెలియకుండానే ప్రతికూలతను పెంచుతాయి. అలాగే పగిలిన అద్దాలు, విరిగిన చిత్రాలు లేదా దేవుళ్ల విగ్రహాలు, ముళ్లతో కూడిన కాక్టస్ మొక్కలు ఉన్నపుడు ప్రతికూల శక్తులు సులభంగా అనుభూతి చెందుతాయి.

Negative Energies in House - Vastu Remedies

భారతీయ ప్రాచీన శాస్త్రాలలో ఒకటైన వాస్తు శాస్త్రంలో ఇంటి నుండి ప్రతికూలతను ఎలా తొలగించవచ్చో వివిధ మార్గాలు, పద్ధతులు ఉన్నాయి. కొన్ని దోషాలను నిర్మూలించటానికి సాధారణ మార్గాలు ఉండగా మరికొన్ని తీవ్రమైన దోషాలకు మార్గాలు సంక్లిష్టంగా ఉన్నాయి. ఇంట్లో చెడు శక్తి తీవ్రంగా ఉంటే నిపుణుల పర్యవేక్షణలో నివారణలు చేసుకోవాల్సి ఉంటుంది.

సాధారణ మార్గాల్లో ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించటం కోసం ఈ నివారణలను పాటించండి.

మీ ఇంటి ప్రవేశ ద్వారం పరిశుభ్రంగా ఉంచండి

ఇంటి ప్రవేశద్వారం ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ చిట్కా ప్రతికూల శక్తిని దూరంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా మీ ఇంటికి వచ్చే అతిథులకు మంచి అభిప్రాయాన్ని కలిగించడంలో సహాయపడుతుంది. మీరు మీ ఇంటి ప్రవేశద్వారం వద్ద చిన్నచిన్న మొక్కలను, పూలకుండీలను ఉంచవచ్చు.

ఇంటి లోపల స్వచ్ఛత

మీ ఇల్లు లోపల మాత్రమే కాకుండా బయట కూడా పరిశుభ్రంగా, వస్తువులన్నీ చక్కగా ఉండటం చాలా అవసరం. వెలుతురు, గాలి సరిగ్గా వచ్చేలా ఉండాలి. కిటికీలు తెరిచి ఉంచుకోవాలి. ఇలా ప్రతికూల శక్తులు పోయి, సానుకూల శక్తులకు ఆహ్వానం పలికినట్లుగా ఉంటుంది.

డోర్ నాబ్స్, కిటికీలను తుడవడానికి నిమ్మరసం, ఉప్పు, వైట్ వెనిగర్ కలిపిన నీటి మిశ్రమాన్ని ఉపయోగించాలి. ఆ తర్వాత, అన్ని ప్రవేశ ద్వారాల వద్ద సముద్రపు ఉప్పును పోసి, ప్రతికూల శక్తి ఆవరణలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి డోర్‌మ్యాట్‌తో కప్పండి. నేలను తుడుచుకునేటప్పుడు, ఒక చిటికెడు సముద్రపు ఉప్పును నీటిలో కలపాలి (గురువారాల్లో తప్ప) ఈ పరిహారం ఇల్లు లేదా పని చేసే చోటులో ప్రతికూల శక్తిని నాశనం చేయడంలో సహాయపడుతుంది.

దీపధూపాలు

ఇంట్లో ధూపం వెయ్యడం, అగర్బత్తిలను కాల్చడం, దేవతా విగ్రహాల ముందు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది, ఇది శుభ శక్తులను పెంచుతుంది. ధూపం, అగర్బత్తీల పొగను ఇంట్లోని ప్రతి మూలకు ప్రతిరోజూ రెండుసార్లు చూపించాలి. ఇది ప్రతికూల శక్తిని తగ్గించడానికి, ఆరోగ్యకరమైన అలాగే శక్తివంతమైన జీవితాన్ని అందించడంలో మీకు సహాయపడుతుంది.

దేవతామూర్తుల పటాలు, విగ్రహాలు, యంత్రాలు

ఇంట్లో దేవుళ్ల చిత్రాలు, విగ్రహాలు, పిరమిడ్ యంత్రాలు మొదలైన ఆధ్యాత్మిక వస్తువులను ఉంచడం శుభ శక్తులను ఆహ్వానిస్తుంది. వాస్తుకు అనుగుణంగా పూజ గదికి అనువైన ప్రదేశం ఈశాన్యంలో ఉండాలి. ప్రాంగణంలో సానుకూల శక్తుల ప్రవేశాన్ని, వృద్ధిని మెరుగుపరచడానికి ఏనుగులు, ఇతర శుభప్రదమైన చిహ్నాలను వ్యూహాత్మక ప్రదేశాలలో ఉంచవచ్చు.

శబ్దంతో సకలం పవిత్రం

దేవునికి గంటల శబ్దాలు, శంఖు నాదాలు వంటివి ఇంట్లో వినిపించాలి. ఇవి ఇంట్లో తిష్టవేసిన ప్రతికూల శక్తులను తరిమేస్తాయి.

అధ్యాత్మిక మంత్రాలను జపించడం లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ద్వారా భక్తిగీతాలను వినిపించడం కూడా చేయవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్