iPhone discounts: ఆమెజాన్ లో ఈ నెలలో ఐ ఫోన్ లపై బెస్ట్ డీల్స్
iPhone discounts: ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15తో సహా ఆపిల్ తాజా ఆపిల్ ప్రొడక్ట్స్ ఈ ఏప్రిల్ 2024 లో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో తిరుగులేని డిస్కౌంట్లలో లభిస్తాయి. డిస్కౌంట్ లతో పాటు వినియోగదారులు బ్యాంక్ ఆఫర్స్ ను, ఎక్స్చేంజ్ బోనస్ ను కూడా పొందవచ్చు.
iPhone discounts: మీ స్మార్ట్ ఫోన్ ను అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారా? ఆపిల్ తాజా ఐఫోన్లపై ఈ కామర్స్ దిగ్గజం ఆమెజాన్ తిరుగులేని డిస్కౌంట్లను అందిస్తోంది. ఆమెజాన్ లో ఐ ఫోన్ 13, ఐ ఫోన్ 14, ఐ ఫోన్ 15 లపై అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి. అదనంగా, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ ఉన్నాయి.
ఐఫోన్ 13:
ఆమెజాన్ లో ఐ ఫోన్ 13 (iPhone 13) ఇప్పుడు 13 శాతం డిస్కౌంట్ తో లభిస్తుంది. డిస్కౌంట్ అనంతరం అమెజాన్ లో ఐ ఫోన్ 13 కేవలం రూ .52,090 లకు లభిస్తుంది. అదనంగా, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది మీ కొనుగోలును మరింత సులభతరం చేస్తుంది. నో కాస్ట్ ఈఎంఐతో క్రెడిట్ కార్డు లావాదేవీలపై రూ.2,345.53 ఈఎంఐ వడ్డీ ఆదా అవుతుంది. ఆమెజాన్ లో మరో ఆఫర్ కూడా ఉంది. ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ కు మారితే, అదనంగా రూ .1200 తగ్గింపు లభిస్తుంది. ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. వర్కింగ్ కండిషన్ లో ఉన్న మీ స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేస్తే, రూ .33,400 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఐ ఫోన్ 13 లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ డిస్ప్లే, అడ్వాన్స్డ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్, శక్తివంతమైన ఏ15 బయోనిక్ చిప్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
ఐఫోన్ 14
ఐఫోన్ 14 (iPhone 14) ఆమెజాన్ లో ఇప్పుడు రూ.62,800 లకు అందుబాటులో ఉంది. ఐ ఫోన్ 14 అసలు ధర రూ.69,900 కాగా, డిస్కౌంట్ అనంతరం అది రూ.62,800 లకు తగ్గింది. బ్యాంక్ ఆఫర్లతో అదనంగా రూ .3,000 తగ్గింపు పొందవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ డిస్ప్లే, అడ్వాన్స్డ్ కెమెరా సిస్టమ్, క్రాష్ డిటెక్షన్ టెక్నాలజీ ఉన్నాయి. ఇది సిరామిక్ షీల్డ్, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఐఫోన్ 15
ఆమెజాన్ లో ఐ ఫోన్ 15 పై 9% డిస్కౌంట్ లభిస్తుంది. ఐ ఫోన్ 15 ఒరిజినల్ ధర రూ. 79,900 కాగా, డిస్కౌంట్ అనంతరం ఇది రూ. 73,100 కి తగ్గుతుంది. వివిధ బ్యాంక్ ల క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే, రూ. 6,000 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. దీంతో రూ.3,291.62 వరకు ఈఎంఐ వడ్డీ ఆదా చేయవచ్చు. అదనంగా రూ.250 తగ్గింపు కోసం Flash.co ఇమెయిల్ ఐడికి మారండి. ఐ ఫోన్ 15 (iPhone 15) లో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉంది.