తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Cpm: డైలమాకు తెలంగాణ సీపీఎం తెర.. భువనగిరిలో పోటీ చేస్తున్న సీపీఎం,

Telangana CPM: డైలమాకు తెలంగాణ సీపీఎం తెర.. భువనగిరిలో పోటీ చేస్తున్న సీపీఎం,

HT Telugu Desk HT Telugu

29 April 2024, 11:45 IST

    • Telangana CPM: తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో సీపీఎం ఒక్క చోటనే బరిలోకి దిగింది. అలా భువనగిరి సీటులో చివరి వరకు పోటీలో ఉంటుందా..? పక్కకు తప్పుకుంటుందా..? అనే సందేహాలను ముగిస్తూ భువనగిరిలో పోటీకి రెడీ అయ్యారు.
భువనగిరి ఎంపీ స్థానంలో సిపిఎం పోటీ
భువనగిరి ఎంపీ స్థానంలో సిపిఎం పోటీ

భువనగిరి ఎంపీ స్థానంలో సిపిఎం పోటీ

Telangana CPM: తెలంగాణలో బీజేపీ BJP దూకుడును అడ్డుకునేందుకు తమకు మద్దతు ఇవ్వాలని, ఇండియా కూటమి స్ఫూర్తిని కొనసాగించాలని Congress టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి సీపీఎం నాయకత్వాన్ని కోరారు.

ట్రెండింగ్ వార్తలు

Mamata Banerjee: ‘కేంద్రంలో ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తాం’: మమతా బెనర్జీ

Factcheck: ఇండియా టుడే, టైమ్స్ నౌ సహా సంస్థలు ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదు

EC Serious On CS DGP : ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్- సీఎస్, డీజీపీలకు నోటీసులు

CEO AP Meena: నాలుగు దశల్లో దేశంలోనే అత్యధికం.. ఏపీలో82శాతం పోలింగ్‌ నమోదు.. పట్టణ ప్రాంతాల్లో పెరిగిన ఓటింగ్

Telangana అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, CPM సీపీఎంల మధ్య స్నేహం చెడింది. ఆ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగానే బరిలోకి దిగినా.. ఒక్క చోట కూడా గెలవలేదు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి స్థానాన్ని సీపీఎం ఎంచుకుంది.

ఈ స్థానంలో కూడా తమ అభ్యర్థికి మద్దు ఇవ్వాలనిCongress కాంగ్రెస్ కోరింది. ఒకటీ రెండు ఎమ్మెల్సీ పదవులను కూడా ఆశపెట్టినట్టు సమాచారం. దీంతో సీపీఎం బరి నుంచి తప్పుకుంటుందేమోనన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

చివరకు 16 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతు ఇస్తామని, Bhuvanagiri భువనగిరిలో మాత్రం పోటీలో ఉంటామని సీపీఎం రాష్ట్రం నాయకత్వం ప్రకటించడంతో డైలమాకు తెరపడింది.

ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గతమెంతో ఘనం

భువనగిరి లోక్ సభా నియోజకరవ్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రాతినిధ్యం వహించిన చరిత్ర వామపక్షాలకు ఉంది. ఒక్క సీపీఎం మాత్రమే పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ పార్టీ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు సార్లు అంతకంటే ఎక్కు సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారున్నారు.

భువనగిరి ఎంపీ సీటు పరిధిలో జనగామ, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో సీపీఎం జనగామలో 1985,1994లో, తుంగతుర్తిలో 1978, 1983 , నకిరేకల్ లో ఏకంగా ఎనిమిది పర్యాయాలు 1967 లో, అదే మాదిరిగా 1978 నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో సీపీఎం విజయాలు సాధించింది.

ఇబ్రహీంపట్నంలో 1989, 1994, 2004 లో సీపీఎం గెలిచింది. ఆలేరు, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల నుంచి విజయాలు సాధించినా, పార్టీకి బలమైన కేడర్ ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిత్ర పక్షాల పొత్తుల్లో భాగంగా ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఐ ప్రాతినిధ్యం వహించింది.

భువనగిరి ఎంపీ నియోజకవర్గంలో తమ పార్టీకి ఉన్న ఈ పట్టును పరిగణలోకి తీసుకునే పోటీ చేశామని ఆ పార్టీ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి ఎం.డి.జహంగీర్ ‘ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ’కు వివరించారు.

ఇండియా కూటమిలో భాగస్వామి పక్షాలుగా కాంగ్రెస్, సీపీఎంలు కలిసి ఉన్నా.. ఈ నియోజకవర్గంలో పోటీలో ఉంటున్నామని, మిగిలిన 16 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుకు మద్దతు ఇస్తామని పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించిందని తెలిపారు.

సీపీఎం గడపలు తొక్కుతున్న కాంగ్రెస్ అభ్యర్థులు

భువనగిరి సీటు నుంచి సీపీఎంను ఉప సంహరింప చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ముందుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సీపీఎం రాష్ట్ర నాయకత్వంతో చర్చ జరిపారు.

భువనగిరి నుంచి పక్కకు తప్పుకోవడానికి ససేమిరా అన్న సీపీఎం మిగిలిన చోట్ల మద్దతు ఇస్తానని ప్రకటించింది. దీంతో ఇప్పటికే నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి తన తండ్రి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డితో కలిసి నల్గొండ సీపీఎం ఆఫీసు వెళ్లి జిల్లా నాయకులతో సమావేశమై మద్దతు కోరారు.

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డ్ సైతం ఖమ్మం సీపీఎం ఆఫీసుకు వెళ్ళి సీపీఎం నాయకులతో సమావేశమ్యారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో సీపీఎం బలమైన కేడర్ ను కలిగి ఉంది. ఖమ్మం ఎంపీ సీటు నుంచి కూడా గతంలో సీపీఎం ప్రానిధ్యం వహించింది, అదే మాదిరిగా ఎమ్మెల్యే పదవులను కూడా గెలుచుకుంది.

నల్గొండ ఎంపీ సీటు పరిధిలో కూడా సీపీఎం బలమైన పార్టీ యంత్రాంగం ఉంది. నల్గొండ నుంచి ఒక సారి, మిర్యాలగూడెం నుంచి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా సీపీఎం నాయకులు విజయాలు సాధించారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకునే కాంగ్రెస్ అభ్యర్థులు సీపీఎం కార్యాలయాలు మెట్లు ఎక్కుతున్నారు.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, HT TELUGU నల్గొండ )

తదుపరి వ్యాసం