తెలుగు న్యూస్  /  బిజినెస్  /  8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

Sharath Chitturi HT Telugu

29 April 2024, 15:15 IST

    • 8th Pay Commission news : 8వ పే కమిషన్​కి సంబంధించిన ముఖ్యమైన వార్త! 8వ పే కమిషన్​ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సిఫార్సు అందింది.
8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్!
8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్!

8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్!

8th Pay Commission date : 8వ పే కమిషన్​ గురించి అప్డేట్​ కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ముఖ్యమైన సమాచారం! 8వ పే కమిషన్​ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి అధికారిక ప్రతిపాదన అందింది. త్వరలోనే.. దీనిని కేంద్రం పరిశీలించే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Android users: ఆండ్రాయిడ్ యూజర్లకు సెర్ట్ అలర్ట్; స్మార్ట్ ఫోన్స్ కు హ్యాకింగ్ ముప్పు ఉందని హెచ్చరిక

Exchange torn currency notes: చిరిగిన కరెన్సీ నోట్లను బ్యాంక్ ల్లో మార్చుకోవడానికి ఈ ప్రొసీజర్ ఫాలో కండి..

Kia EV6 facelift : కియా ఈవీ6 ఫేస్​లిఫ్ట్​.. మరింత స్టైలిష్​గా- మరింత పవర్​ఫుల్​గా!

Maruti Suzuki Swift vs Tata Tiago : స్విఫ్ట్​ వర్సెస్​ టియాగో.. ఏ హ్యాచ్​బ్యాక్​ కొనాలి?

8వ పే కమిషన్​ ఏర్పాటుకు సంబంధించి.. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్​ శాఖకు లేఖ రాసింది ఐఆర్​టీఎస్​ఏ (ఇండియన్​ రైల్వే టెక్నికల్​ సూపర్​వైజర్స్​ అసోసియేషన్​). ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను కూడా.. ఈ లేఖలో లేవనెత్తింది ఐఆర్​టీఎస్​ఏ. భవిష్యత్తులో లోపాలు లేని వ్యవస్థను రూపొందించాలని సూచించింది.

8వ పే కమిషన్​ని ఎందుకు ఏర్పాటు చేస్తారు?

సాధారణంగా.. 10ఏళ్ల కాల వ్యవధిలో సెంట్రల్​ పే కమిషన్​ని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసి, వాటిని రివ్యూ చేసి, జీతాలు, అలోవెన్స్​లు, ఇతర సౌకర్యాలకు సంబంధించిన మార్పులను సిఫార్సు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పే, ఆలోవెన్స్​తో పాటు ఇతర విషయాలను కాలక్రమేన రివ్యూ చేసేందుకు ఒక శాశ్వత వ్యవస్థను రూపొందించాలని.. 3వ, 4వ, 5వ పే కమిషన్స్​ సిఫార్సు చేశాయి.

ఇదీ చూడండి:- Bank Holidays in May : మే నెలలో బ్యాంక్​లకు 10 రోజుల పాటు సెలవులు- పూర్తి లిస్ట్​ ఇదే..

8th Pay Commission : వేతనాలతో పాటు అనేక విషయాలను తన లేఖలో ప్రస్తావించింది ఐఆర్​టీఎస్​ఏ. కొత్త సెంట్రల్​ పే కమిషన్​ని ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేసింది. ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు, లోపాలను తొలగించాలని పేర్కొంది. వేతనాలు, అలోవెన్స్​లు, వర్కింగ్​ కండీషన్​, ప్రమోషన్​లు, పోస్ట్​ క్లాసిఫికేషన్స్​లోని సమస్యలను తొలగించేందుకు.. 8వ పే కమిషన్​కి తగినంత సమయం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేసింది.

మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 8వ పే కమిషన్​తో ఉపయోగం ఉందా? అంటే కచ్చితంగా ఉంటుంది. డీఏ హైక్​, వేతనాల సవరణకు ఈ కమిషన్​ చాలా అవసరం.

హెచ్ ఆర్ ఏ సంగతి ఏంటి..?

DA hike news : ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని ప్రభుత్వం 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఇది 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ విషయంలో ఎలాంటి సమస్య లేనప్పటికీ.. అందుకు అనుగుణంగా పెరగాల్సిన హెచ్ఆర్ఏ విషయంలో కొంత అనిశ్చితి, గందరగోళం నెలకొంది. సాధారణంగా, డీఏ పెంపుతో పాటు ఇంటి అద్దె అలవెన్స్ కూడా పెరుగుతుంది. అయితే 7వ వేతన సంఘం హెచ్ఆర్ఏ సవరణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక ఉత్తర్వులను కానీ, నోటిఫికేషన్ ను కానీ జారీ చేయలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం