8th Pay Commission: 8వ పే కమిషన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన
8th Pay Commission: 8వ పే కమిషన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 8: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభకు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ కేంద్ర వేతన సంఘం సకాలంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోందా, తద్వారా జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చేలా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదా అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
1947 నుండి ఇప్పటి వరకు ఏడు పే కమీషన్లు ఏర్పాటయ్యాయి. ప్రతి పదేళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాల స్ట్రక్చర్ సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది.
7వ కేంద్ర వేతన సంఘాన్ని భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28, 2014న ఏర్పాటు చేసింది.
భారతదేశంలో మొదటి పే కమిషన్ జనవరి 1946లో ఏర్పాటైంది. వేతన సంఘం రాజ్యాంగ చట్రం వ్యయ శాఖ (ఆర్థిక మంత్రిత్వ శాఖ) క్రిందకు వస్తుంది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా జీతాలను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఇతర చర్యల గురించి మంత్రి సమాధానమిస్తూ.. వారి జీతాల వాస్తవ విలువలో కోతను భర్తీ చేయడానికి వీలుగా డియర్‌నెస్ అలొవెన్స్ (కరవు భత్యంత) ఇస్తున్నట్టు మంత్రి బదులిచ్చారు. భారత వినియోగదారుల ధరల సూచిక కింద అంచనా వేసిన ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ సవరిస్తున్నట్టు తెలిపారు.