Bank Holidays in May : మే నెలలో బ్యాంక్​లకు 10 రోజుల పాటు సెలవులు- పూర్తి లిస్ట్​ ఇదే..-bank holidays in may 2024 banks to remain closed on these 10 days ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bank Holidays In May : మే నెలలో బ్యాంక్​లకు 10 రోజుల పాటు సెలవులు- పూర్తి లిస్ట్​ ఇదే..

Bank Holidays in May : మే నెలలో బ్యాంక్​లకు 10 రోజుల పాటు సెలవులు- పూర్తి లిస్ట్​ ఇదే..

Sharath Chitturi HT Telugu
Apr 28, 2024 04:30 PM IST

Bank Holidays in May 2024 : మే నెలలో బ్యాంక్​లకు 10 రోజుల పాటు సెలవు దక్కనుంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుని, మీరు మీ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోండి..

మే నెలలో బ్యాంక్​ సెలవుల వివరాలివే..
మే నెలలో బ్యాంక్​ సెలవుల వివరాలివే.. (Mint)

May 2024 Bank Holidays list : మే 2024కు సంబంధించిన బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని ఆర్​బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) ప్రకటించింది. వివిధ మతపరమైన సెలవులు, వారాంతపు సెలవుల కారణంగా.. దేశవ్యాప్తంగా బ్యాంక్​లు.. మే నెలలో కనీసం 10 రోజుల పాటు సెలవులు తీసుకోనున్నాయి.

ముఖ్యంగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తో సహా అన్ని జాతీయ బ్యాంకులు.. 2024 మేలో కనీసం 10 రోజుల పాటు పని చేయవమని కస్టమర్లు గుర్తుపెట్టుకోవాలి. వీటిలో రెండు- నాలుగు శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలకు ప్రాంతీయ పండుగలకు సెలవులు కూడా ఉండవచ్చు. అందుకే.. బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని తెలుసుకుని.. అందుకు తగ్గట్టుగా కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవడం ఉత్తమం. చివరి నిమిషంలో అసౌకర్యాలను నివారించడానికి మీరు బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని తెలుసుకోవాల్సి ఉంటుంది.

Bank Holidays in May : బ్యాంకుల హాలిడే క్యాలెండర్​ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. వివిధ రాష్ట్రాల స్థానిక ఆచారాలను బట్టి బ్యాంకుల ప్రాంతీయ సెలవులు మారుతూ ఉంటాయి.

మే 2024 లో బ్యాంక్​ సెలవుల పూర్తి జాబితా..

మే 1 బ్యాంక్ సెలవు: మే డే / లేబర్ డే, మహారాష్ట్ర డే కారణంగా దేశవ్యాప్తంగా.. మహారాష్ట్రలో బ్యాంకులు మూతపడి ఉంటాయి.

మే 8న బ్యాంకులకు సెలవు: బహుముఖ ప్రజ్ఞాశాలి రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినం సందర్భంగా.. పశ్చిమ్​ బెంగాల్​లో బ్యాంకులకు సెలవు.

మే 10 బ్యాంకు సెలవు: అక్షయ తృతీయ పండుగ కారణంగా బ్యాంకులకు సెలవు.

2024 Bank holidays list : మే 23 బ్యాంకు సెలవు: బుద్ధ పూర్ణిమ సందర్భంగా బ్యాంకులకు సెలవు.

ఇతర సెలవులు..

రెండో శనివారం బ్యాంకులకు సెలవు: మే 11

నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు: మే 25

ఆదివారం బ్యాంకులకు సెలవు: మే 4, 12, 18, 26

బ్యాంక్​ సెలవులు ఉన్నా.. ఇవి పనిచేస్తాయి!

Telangana Bank holidays in May 2024 : ఆన్​లైన్ బ్యాంకింగ్ సేవలు అన్ని బ్యాంకు సెలవుల్లో, వారాంతాల్లో అంతరాయం లేకుండా పనిచేస్తాయి. అత్యవసర లావాదేవీల కోసం ఖాతాదారులు బ్యాంకుల వెబ్​సైట్​లు, మొబైల్ యాప్​లు లేదా ఏటిఎంలను ఉపయోగించి తమ బ్యాంకింగ్ పనులను సౌకర్యవంతంగా పూర్తి చేసుకోవచ్చు. ఏదేమైనా.. బ్యాంకు సిబ్బంది నుంచి సహాయం అవసరమైతే మాత్రం.. బ్యాంక్ హాలిడే షెడ్యూల్ గురించి తెలుసుకోవడం ముఖ్యం. తదనుగుణంగా సందర్శనలను ప్లాన్ చేయడం చాలా అవసరం.

WhatsApp channel

సంబంధిత కథనం