Kia EV6 facelift : కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్.. మరింత స్టైలిష్‌గా- మరింత పవర్‌ఫుల్‌గా!
14 May 2024, 13:40 IST
- కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ రివీల్ అయ్యింది. ఈ మోడల్ మరింత స్టైలిష్‌గా, మరింత పవర్‌ఫుల్‌గా ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్..
Kia EV6 facelift launch in India : రిఫ్రెష్ చేసిన ఈవీ6 లగ్జరీ ఎలక్ట్రిక్ కారును.. దక్షిణ కొరియాలో ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్. ఈవీ స్టైల్, పర్ఫార్మెన్స్ని పెంచే అనేక అప్డేట్స్ ఇచ్చింది. ఈ ఈవీ6 ఫేస్‌లిఫ్ట్‌లో గణనీయమైన డిజైన్ మార్పులు, ఇంటీరియర్ మార్పులతో పాటు కొత్త, మరింత శక్తివంతమైన బ్యాటరీ వంటివి కనిపిస్తున్నాయి.
ఈవీ6 ఫేస్‌లిఫ్ట్‌లో అత్యంత ముఖ్యమైన మార్పులు ముందు భాగంలో ఉన్నాయి. ట్రెడిషనల్ హెడ్ లైట్ల స్థానంలో ఈవీ3, ఈవీ4 కాన్సెప్ట్‌ల స్ఫూర్తితో యాంగ్యులర్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, హెడ్‌ల్యాంప్స్ తో పాటు ఈవీ6, ఈవీ9 ప్రొడక్షన్ మోడళ్లు ఉన్నాయి. ఫ్రంట్ ఫ్యాసియాని పూర్తిగా రీడిజైన్ చేసింది సంస్థ. ఇందులో బంపర్, లోయర్ గ్రిల్ ప్రాంతానికి అప్డేట్స్ వచ్చాయి.
19 ఇంచ్, 20 ఇంచ్ సైజుల్లో స్టైలిష్ కొత్త బ్లాక్ అండ్ సిల్వర్ వీల్స్ అందుబాటులోకి రావడం మినహా మిగిలిన బాహ్య భాగాలు చాలావరకు అలాగే ఉన్నాయి. వెనుక భాగంలో ఈవీ6 సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్‌ని మెయిన్టైన్ చేస్తూ, వాహనం వెడల్పును విస్తరించే విలక్షణమైన సింగిల్ ఎల్ఈడీ లైట్ బార్ని కలిగి ఉంది.
ఇంటీరియర్ మార్పులు..
Kia EV6 facelift 2025 : ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్ లోపలి భాగంలో అనేక ముఖ్యమైన అప్గ్రేడ్లను కలిగి ఉంది. ఇంటీరియర్ కేంద్ర బిందువు కొత్తగా రూపొందించిన కర్వ్డ్ పనోరమిక్ స్క్రీన్. ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే రెండింటినీ ఏకీకృతం చేస్తుంది. కియా టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను పునరుద్ధరించింది. ఫింగర్ ప్రింట్ రీడర్‌ను జోడించింది. ఇది డ్రైవర్లు కీని ఉపయోగించకుండా వాహనాన్ని ప్రారంభించడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాక, అప్డేటెడ్ మోడల్ ఇప్పుడు వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది.
ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్ కోసం కియా ఈవీ6 సపోర్ట్ను కూడా విస్తరించింది. ఇంతకు ముందు నావిగేషన్‌కు మాత్రమే పరిమితమైన ఈ అప్డేట్.. ఇప్పుడు ప్రధాన ఎలక్ట్రానిక్ నియంత్రణ వ్యవస్థలకు విస్తరించాయి. ఇది ఎలక్ట్రిక్ వెహికిల్ అడాప్టబిలిటీ, లైఫ్‌ని పెంచుతుంది. ఇంటీరియర్ అప్గ్రేడ్లలో డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్, మెరుగైన హెడ్-అప్ డిస్ప్లే, ప్రస్తుత జెనెసిస్ మోడళ్లలో కనిపించే ఆగ్మెంటెడ్ రియాలిటీ నావిగేషన్ సిస్టమ్ ఉన్నాయి.
కియా ఈవీ6 పవర్..
Kia EV6 facelift release date : కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్ మునుపటి 77.4 కిలోవాట్ల ప్యాక్ స్థానంలో హ్యుందాయ్ మోటార్ గ్రూప్ తాజా 84 కిలోవాట్ల బ్యాటరీని కలిగి ఉంది. ఈ అప్‌గ్రేడ్ రియర్ వీల్ డ్రైవ్ మోడల్ రేంజ్‌ని 475 కిలోమీటర్ల నుంచి 494 కిలోమీటర్లకు విస్తరించింది. కొత్త బ్యాటరీ 350 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది కేవలం 18 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేయగలదు.
స్టాండర్డ్ రియర్ వీల్ డ్రైవ్ మోడళ్లు.. 225 బీహెచ్పీ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. డ్యూయెల్ మోటార్ వర్షెన్లు 320బీహెచ్పీ పవర్, 605ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తాయి. రైడ్ సౌకర్యాన్ని పెంచడానికి, మోటారు శబ్దాన్ని తగ్గించడానికి, భద్రతను మెరుగుపరచడానికి.. కియా ఈవి 6 ఫ్రీక్వెన్సీ-సెలెక్టివ్ డ్యాంపర్లను చక్కగా ట్యూన్ చేసింది.