TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త వేరియంట్లు.. త్వరలోనే లాంచ్​!-tvs iqube electric scooter to get more variants soon launch likely next month ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tvs Iqube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త వేరియంట్లు.. త్వరలోనే లాంచ్​!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో కొత్త వేరియంట్లు.. త్వరలోనే లాంచ్​!

Sharath Chitturi HT Telugu
May 12, 2024 01:30 PM IST

TVS iQube electric scooter new variants : టీవీఎస్​ ఐక్యూబ్​లో కొత్త వేరియంట్లు లాంచ్​కు రెడీ అవుతున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టీవీఎస్​ ఐక్యూబ్​..
టీవీఎస్​ ఐక్యూబ్​..

TVS iQube electric scooter : టీవీఎస్ ఈ ఆర్థిక సంవత్సరంలో.. తన బెస్ట్​ సెల్లింగ్​ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్​కి కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టడానికి రెడీ అవుతోంది. టీవీఎస్ ఐక్యూబ్ తన మొదటి ఎలక్ట్రిక్ ఆఫర్​గా.. సంస్థకు విజయవంతమైంది. కంపెనీ ఇప్పుడు తన పోర్ట్​ఫోలియోకు ఎలక్ట్రిక్ త్రీ వీలర్​ని జోడించడంతో పాటు 2025 ఆర్థిక సంవత్సరంలో వేరియంట్ల సంఖ్యను విస్తరించాలని చూస్తోంది.

టీవీఎస్​ ఐక్యూబ్ కొత్త వేరియంట్లు వేర్వేరు బ్యాటరీ కెపాసిటీలు, ధర పాయింట్లతో లభిస్తాయని టీవీఎస్​ సీఈఓ, డైరక్టర్​ రాధాకృష్ణన్ వెల్లడించారు. కొత్త ఐక్యూబ్ వేరియంట్లు.. వచ్చే నెల ప్రారంభంలో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. అయితే, రాబోయే ఆఫర్లకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉన్నాయి. ఈ కొత్త వేరియంట్లలో రెండేళ్ల క్రితం ఆవిష్కరించిన ఐక్యూబ్ ఎస్టీ కూడా ఉందా? లేదా? అనేది కూడా అస్పష్టంగా ఉంది.

TVS iQube new variants : ఫేమ్-2 సబ్సిడీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఈఎంపీఎస్) గడువు 2024 జూలై 31న ముగియడంతో టీవీఎస్ తన అమ్మకాల జోరును నిలుపుకునేందుకు.. మరింత పోటీతత్వంతో కూడిన ఆఫర్లను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది. సబ్సిడీ సవరణ తర్వాత టీవీఎస్​ ఐక్యూబ్ ధరలు పెరిగాయి. ఈ మోడల్ ఇప్పుడు రూ .1.37 లక్షల (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) నుంచి అందుబాటులో ఉంది.

ఇదీ చూడండి:- Tata Nexon SUV : టాటా నెక్సాన్​లో కొత్త ఎంట్రీ లెవల్​ వేరియంట్లు.. భారీగా దిగొచ్చిన ఎస్​యూవీ ధర!

ఏథర్ రిజ్టా, ఓలా ఎస్ 1 ఎక్స్ వంటి కొత్త ఆఫర్ల రాకతో, టీవీఎస్ తన అమ్మకాల జోరును పెంచాలని చూస్తోంది. కొత్త వేరియంట్లు, ప్రొడక్ట్ రిఫ్రెష్ నేటి కాలంలో ఐక్యూబ్​ను మరింత సముచితంగా ఉంచాలి. ఈ-స్కూటర్ తక్కువ ప్రారంభ ధరతో చిన్న బ్యాటరీ ప్యాక్​తో వస్తుందని ఆశించవచ్చు. ప్రస్తుతం ఈ మోడల్ 3.04 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో అందుబాటులో ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 107 కిలోమీటర్లు రేంజ్​ని అందిస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 5.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో వస్తుంది.

TVS iQube on road price in Hyderabad : 2024 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 1.94 లక్షల యూనిట్ల మార్కును దాటడంతో ఐక్యూబ్ ఎలక్ట్రిక్​ స్కూటర్​.. టీవీఎస్​కి స్థిరమైన ప్రాడక్ట్​గా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్లో.. కంపెనీ 17,403 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్స్​ని విక్రయించింది.

కొత్త ఐక్యూబ్​తో పాటు టీవీఎస్ తన ఎలక్ట్రిక్ త్రీ వీలర్​ని కూడా 2025 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి తీసుకురానుంది. పియాజియో, బజాజ్, ఆల్టిగ్రీన్, యూలర్ తదితర ఎలక్ట్రిక్ త్రీ వీలర్లకు ఈ మోడల్ గట్టి పోటీ ఇవ్వనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం