Kia car: కస్టమర్ల కోసం లైవ్ కన్సల్టింగ్ సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చిన కియా-own a kia car there is a new live consulting service now available in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Car: కస్టమర్ల కోసం లైవ్ కన్సల్టింగ్ సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చిన కియా

Kia car: కస్టమర్ల కోసం లైవ్ కన్సల్టింగ్ సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చిన కియా

HT Telugu Desk HT Telugu
May 10, 2024 07:14 PM IST

Kia car: మీకు కియా కార్ ఉందా? ఇకపై మీరు మీ కార్ ను సర్వీసింగ్ ఇచ్చినప్పుడు.. మీ కార్ కు సంబంధించిన సర్వీస్ అప్ డేట్స్ ను లైవ్ లో పొందవచ్చు. ఇందుకోసం కియా ఆన్ లైన్ లైవ్ కన్సల్టింగ్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కియా యాప్ లో కొత్తగా పొందుపర్చిన ఫీచర్ ద్వారా ఈ సర్వీస్ ను మీరు పొందవచ్చు.

కియా లైవ్ కన్సల్టింగ్ సర్వీస్
కియా లైవ్ కన్సల్టింగ్ సర్వీస్ (HT Auto/Kunal Vianayak Thale)

Kia car live-consulting service: దేశవ్యాప్తంగా తమ వాహనాల సేవలో పారదర్శకతను మెరుగుపరచడానికి, కియా ఇండియా శుక్రవారం తన కియా క్రిస్టల్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఈ ప్రొగ్రామ్ ప్రకారం.. వినియోగదారులు తమ వాహనాలను సర్వీసింగ్ కి పంపించినప్పుడు లైవ్ కన్సల్టింగ్, వీడియో స్ట్రీమింగ్ సౌకర్యాల ద్వారా ప్రయోజనం పొందవచ్చు. కియా ఇండియా అధికారిక యాప్ - మై కియా ద్వారా ఈ కియా క్రిస్టల్ ప్రోగ్రామ్ అందుబాటులోకి వచ్చింది. తమ కారు సర్వీస్ విషయంలో వినియోగదారులకు కార్ సర్వీస్ వర్క్, ఖర్చులు, సమస్యలు, ప్రశ్నలకు ప్రతిస్పందనలు వంటి కీలక వాహన సంబంధిత సమాచారాన్ని లైవ్ లో పొందవచ్చు.

yearly horoscope entry point

237 కియా డీలర్ షిప్ లలో

రియల్ టైమ్ కన్సల్టేషన్ సదుపాయం ఇప్పుడు 237 కియా డీలర్ షిప్ లలో అందుబాటులో ఉండగా, వాహనాలకు లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రస్తుతం 25 డీలర్ల వద్ద ఉంది. లైవ్ స్ట్రీమింగ్ సదుపాయాన్ని 2024 చివరి నాటికి 60 డీలర్ షిప్ లకు తీసుకెళ్లాలని చూస్తున్నట్లు కంపెనీ ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది.

లైవ్ సర్వీసింగ్, వీడియో స్ట్రీమింగ్

సాధారణంగా చాలా మంది వినియోగదారులు తమ వాహనాలను సర్వీసింగ్ చేయాలనుకున్నప్పుడు 'పిక్ అండ్ డ్రాప్' సౌకర్యాలను ఎంచుకుంటారు. కొందరు తమ డ్రైవర్ల ద్వారా తమ వాహనాలను సర్వీసింగ్ కు పంపిస్తారు. అయినా, వారు తమ కార్ సర్వీస్ కు సంబంధించిన పనుల పురోగతిని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని కోరుకుంటారు. వారికి ఈ ‘కియా క్రిస్టల్’ ప్రొగ్రామ్ ఎంతో ఉపయోగకరమని కియా ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ నేషనల్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ అన్నారు.

కియా వెల్కమ్ కాల్స్

అమ్మకాల తర్వాత కొత్త కస్టమర్లను ఆన్ బోర్డ్ చేయడం, ఆఫర్ల గురించి వారికి తెలియజేయడం లక్ష్యంగా వెల్కమ్ కాల్స్ కోసం కొత్త ఫీచర్ ను కూడా కియా ఇండియా కియా క్రిస్టల్ పరిధిలోకి తీసుకురానుంది. కియా 2019 లో సెల్టోస్ ఎస్యూవీతో భారతదేశంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం సోనెట్, కారెన్స్, కార్నివాల్, ఈవి 6 వంటి మోడళ్లను భారత్ లో విక్రయిస్తోంది.

Whats_app_banner