తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Kurupam Election Fight: కురుపాంలో పాగా వేసేదెవరు, పాముల పుష్పశ్రీవాణి Vs జగదీశ్వరి.. ఆసక్తికరంగా మారిన పోరు

Kurupam Election Fight: కురుపాంలో పాగా వేసేదెవరు, పాముల పుష్పశ్రీవాణి VS జగదీశ్వరి.. ఆసక్తికరంగా మారిన పోరు

Sarath chandra.B HT Telugu

29 April 2024, 13:07 IST

    • Kurupam Election Fight: పార్వతీపురం జిల్లాలోని రిజర్వుడు నియోజక వర్గమైన కురుపాం వైసీపీ,టీడీపీల మధ్య పోటీ ఉత్కంఠ రేపుతోంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని వైసీపీ,  వరుస పరాజయాల నుంచి బయట పడాలని టీడీపీ ప్రయత్నిస్తున్నాయి. 
కురుపాంలో మాజీ మంత్రి వర్సెస్ జగదీశ్వరి
కురుపాంలో మాజీ మంత్రి వర్సెస్ జగదీశ్వరి

కురుపాంలో మాజీ మంత్రి వర్సెస్ జగదీశ్వరి

Kurupam Election Fight: పార్వతీపురం మన్యం జిల్లా Kurupam కురుపాం నియోజక వర్గంలో మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి Pamula pushpasrivani వైసీపీ తరపున మూడోసారి పోటీ చేస్తున్నారు. 2019లో టీడీపీ అభ్యర్థి జనార్దన్ దాట్రాజ్‌పై 26,602 ఓట్లతో పుష్పశ్రీవాణి గెలిచారు. 2014లో 19వేల ఓట్లతో విజయం సాధించారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన జనార్థన్ దాట్రాజ్‌ రెండుసార్లు ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో కురుపాం ఎస్టీ రిజర్వుడు నియోజక వర్గంలో టీడీపీ తరపున తోయక జగదీశ్వరిని బరిలోకి దింపారు. ఇరు పార్టీలు కురుపాం ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Medak, Zahirabad: మెదక్, జహీరాబాద్ లో పెరిగిన ఓటింగ్‌తో లాభ పడేది ఎవరు? 2019కంటే పెరిగిన పోలింగ్…

‌Hyderabad Polling: గ్రేటర్‌లో తగ్గిన పోలింగ్ శాతం, ఎవరికి ప్లస్? ఎవరికి మైనస్? ఏపీ ఓటర్ల ప్రభావం ఎంత?

HT interview with PM Modi : ‘మేము చేసిన అభివృద్ధిని చూసే.. ప్రజలు మాకు ఓట్లేస్తారు’- మోదీ

HT Telugu Chat With Pawan Kalyan : వైసీపీ ఫ్యాన్ స్విచ్ ఆఫ్, కూటమిదే విజయం- హెచ్.టి.తెలుగుతో పవన్ కల్యాణ్

సీఎం జగన్ హామీలు:

కురుపాంలో పూర్ణపాడు-లాబేసు మధ్య వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో వంతెన నిర్మాణానికి రూ.9.90 కోట్లు మంజూరు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.4 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికీ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. అది అసంపూర్తిగానే ఉంది. 9 పంచాయతీల్లోని 33 గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • కురుపాం మండలం గుమ్మిడిగెడ్డపై మినీ జలాశయం నిర్మాణానికి రైతుల వినతి మేరకు హామీ ఇచ్చారు. మినీ జలాశయం నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేశారు. పరిపాలన ఆమోదం కోసం పంపించి ఎదురుచూస్తున్నారు. పనుల్లో మాత్రం ఎలాంటి కదలిక లేదు.

రెండు విడతల్లో ఎమ్మెల్యేగా పుష్పశ్రీవాణి హామీలు:

  • కొమరాడ మండలంలో పూర్ణపాడు- లాబేసు వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2019లో మంత్రిగా పుష్పశ్రీవాణి సిఫార్సు మేరకు రూ.4 కోట్ల నిధులు మంజూరు చేశారు. కానీ గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పనులు జరగడం లేదు.
  • కొమరాడ మండలం కూనేరు నుంచి లాంజి వరకు రహదారి నిర్మిస్తామన్నారు. సుమారు 17 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించాల్సి ఉంది. 2022 సెప్టెంబరులో ప్రారంభించికేవలం నాలుగు కిలోమీటర్ల పనులు జరిగిన తర్వాత నిలిచిపోయాయి. ఈ పనులు కూడా ఐటీడీఏ నిధులతో చేపట్టారు. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో ఆర్టీసీ బస్సు తిరిగేది. రహదారి అధ్వానంగా ఉండటంతో సర్వీసు నిలిపివేశారు.
  • కురుపాం మండలం గొటివాడ, బొరి మధ్యలోనున్న గెడ్డ వద్ద కాజే నిర్మిస్తామన్నారు. ఇది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. వర్షాకాలంలో మూడు నెలలు ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం హామీ నెరవేర్చకపోవడంతో స్థానిక గిరిజనులే గెడ్డపై గత ఏడాది వెదురు కర్రలతో రాకపోకలకు అనువుగా వంతెన నిర్మించారు. ఈ ఏడాది తలో కొంత పోగు చేసుకొని ఇనుప రాడ్లతో రాకపోకలకు అనువుగా మార్చుకున్నారు.
  • గరుగుబిల్లి మండలం శివ్వాం, చిలకాం మధ్యలో నాగావళి నదిపై వంతెన, చిలకాం, పిట్టలమెట్ట, కారివలస, సన్యాసిరాజు పేట రహదారులను నిర్మిస్తామని చెప్పినా నిధులు మంజూరు కాలేదు. మండల కేంద్రానికి వెళ్లడానికి ఇదే దారి. ఇది లేక అదనంగా 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. వంతెన అందుబాటులోకి వస్తే 5 కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రం ఉంటుంది.

కుటుంబ అవినీతి- అక్రమాలు:

పుష్పశ్రీవాణికి సంబంధించిన వ్యవహారాలన్నీ భర్త చూసుకుంటారు. భార్య తరపున పనులు ఆయనే చక్కబెడుతుంటారు.

  • ప్రస్తుతం చినమేరంగిలో ఉన్న నివాసాన్ని ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులు పలు పథకాలకు సంబంధించిన నిధులతో నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి.
  • జియ్యమ్మవలస ఎంపీడీవో కిరణ్‌కుమార్‌ను 2022లో ఐటీడీఏ డీడీగా డిప్యుటేషన్‌పై నియమించడంపై ఆరోపణలు ఉన్నాయి.
  • ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ, హైదరాబాద్లో ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేశారు.
  • గతంలో పీవోగా వచ్చిన వినోద్‌ కుమార్ తన మాట వినడం లేదని రెండు నెలల వ్యవధిలోనే అతడ్ని బదిలీ చేయించారనే ఆరోపణలుఉన్నాయి. తనకు అనుకూలంగా ఉన్న జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్‌ను పీవోగా తీసుకొచ్చారు.
  • కురుపాం మండల కేంద్రంలోని గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, ఎస్టీఎమ్ సమీపంలో కొన్ని ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని చదును చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
  • కురుపాం మండలం గుమ్మ గ్రామానికి చెందిన ఓ కాంట్రాక్టర్ ఎమ్మెల్యే బినామీగా ప్రచారం ఉంది. ఇటీవల ఓ గిరిజన మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇప్పటి వరకు ఎటువంటి కేసులు నమోదు చేయకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
  • గిరిజన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పుష్పశ్రీవాణి చెల్లెలు భర్త రమేష్ బాబు శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని కార్యకలాపాలు చూసేవారు. ఇంజినీరింగ్ పనులు, పెద్దపెద్ద సెటిల్మెంట్లు చేసేవారు. ఇతని ఆగడాలు మితిమీరడంతో పాలకొండ ఎమ్మెల్యే కళావతితో విభేదాలు తలెత్తాయి.

నియోజకవర్గంలో సమస్యలు:

కురుపాం మండలం: ప్రారంభించి మధ్యలో వదిలేశారు. ఈ మార్గం గుండా ఒడిశాకు రోజూ వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. కానీ ప్రస్తుతం రోడ్డు అధ్వానంగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు దుమ్ము రేగుతుండటంతో స్థానిక నివాసితులు, వ్యాపారులు అవస్థలు ఎక్కువగా ఉన్నాయి. చేపట్టి. మధ్యలో ఆపేశారు.. దీంతో ప్రయాణీకులు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు.

  • కురుపాం, మొండెంఖల్లు, కిచ్చాడ పంచాయతీ కేంద్రాల్లో మురుగు కాలువల్లో అధ్వానంగా ఉన్నాయి. రోజుల తరబడి పూడికలు తీయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలువురు జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
  • కురుపాం మండల కేంద్రంతో పాటు నాగర, ఉదయపురం గ్రామాల్లో రక్షిణ మంచినీటి ట్యాంకులు లేవు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు దూర ప్రాంతాల్లో తాగునీటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వేసవిలో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటోంది.
  • కురుపాం మండలంలోని పూతికవలన, సీతంపేట, మొండెంఖల్లు, కిచ్చాడ తదితర గ్రామాల్లోని వీధుల్లో సిమెంట్ రోడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
  • కురుపాం మండల కేంద్రంలో ఉన్న బీసీ, ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో నాడు-నేడుకి మంజూరైన నేటికి పనులు ప్రారంభించలేదు. ఇక్కడ సుమారు 800 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. కానీ వసతి లేకపోవడంతో శిథిలమైన గదుల్లోనే భయంతో చదువులు సాగిస్తున్నారు. వీటితో పాటు మండలంలోని పలు పాఠశాలల్లో నాడు నేడు పనులు జరగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గుమ్మలక్ష్మీపురం మండలం:

కొండలపై గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో చాలా గ్రామాల ప్రజలు అత్యవసర సమయాల్లో వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీలే దిక్కవుతున్నాయి. ప్రధానంగా బయ్యాడ, జోగిపురం, ఇజ్జకాయ్, ఓండ్రుబంగి, కప్పకల్లు, వాడబాయి, వనకాబడి తదితర గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

  • తోటపల్లి జలాశయం నుంచి కుడికాలువ ద్వారా లైనింగు పేరుతో ఐదేళ్లుగా సాగునీరు ఖరీఫ్, రబీ కాలాలకు సాగునీరు ఇవ్వలేదు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లైనింగు పనులు పూర్తిచేయడంలేదు. సాగునీరు ఇవ్వడంలేదు. ఈష్టే శవిలోనైన లైనింగు పనులు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
  • ఐదేళ్లుగా నాగావళి కుడి ఎడమ పిల్లకాలువల నిర్వహణ పనులు జరగనందున శివారు భూములకు సాగునీరు అందక రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలువల తలుపులు, డ్రాపులు, సైఫన్లు మరమ్మతులకు గురయ్యాయి. రైతులు చెత్త గడ్డితో పూనువేసుకొని పిల్లకాలువలకు సాగునీరు పంపించుకొనే పరిస్థితి.
  • తోటపల్లి ఎడమ కాలువ ముందు బాగంలో ఎత్తిపోతల పథకం నిర్మాణంచేసి నాగూరు పరిశర ప్రాంతాలకు, జియ్యమ్మవలస మండలానికి పలు గ్రామాలకు సాగునీరు ఇవ్వడానికి ప్రతిపాదన జరిగింది. ఐదేళ్లక్రితం నిధులు మంజూరు అయ్యాయి. నిర్మాణం పనులు కొద్దిరోజుల్లో జరుగుతాయన్న సమయంలో ప్రభుత్వం మారడంతో పనులు మూలకు చేరాయి.
  • పదేళ్లుగా కురుపాం ఎమ్మెల్యేగా పనిచేసిన పాముల పుష్పశ్రీవాణి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా జగదీశ్వరి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. హ్యాట్రిక్ విజయం కోసం ఒకరు, మూడోసారైన గెలవాలనే లక్ష్యంతో టీడీపీ కసరత్తు చేస్తున్నాయి.

తదుపరి వ్యాసం