తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Rajam Election Fight: రాజాంలో గెలుపెవరిది? తలె రాజేష్ Vs కొండ్రు మురళీ.. సిట్టింగ్ స్థానంలో వైసీపీ అభ్యర్ధి మార్పు

Rajam Election Fight: రాజాంలో గెలుపెవరిది? తలె రాజేష్ VS కొండ్రు మురళీ.. సిట్టింగ్ స్థానంలో వైసీపీ అభ్యర్ధి మార్పు

Sarath chandra.B HT Telugu

29 April 2024, 9:14 IST

    • Rajam Election Fight: విజయనగరం జిల్లా రాజాంలో వైసీపీ తరపున రెండుసార్లు గెలిచిన అభ్యర్థి స్థానంలో డాక్టర్ తలె రాజేష్‌ పోటీ చేస్తుండగా, టీడీపీ తరపున మాజీ మంత్రి కొండ్రు మురళీ పోటీ చేస్తున్నారు. 
రాజాంలో గెలుపెవరిది...
రాజాంలో గెలుపెవరిది...

రాజాంలో గెలుపెవరిది...

Rajam Election Fight: విజయనగరం Vizianagaram జిల్లా Rajamరాజాంలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. వైసీపీ తరపున రెండుసార్లు గెలిచిన కంబాల జోగులు స్థానంలో డాక్టర్ తలె రాజేష్‌ Dr Tale Rajesh ఈ సారి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో kambala Jogulu కంబాల జోగులు ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా ఎన్నికల్లో ఆయన బదులు రాజేష్‌ను రిజర్వుడు నియోజకవర్గమైన రాజాంలో పోటీ చేస్తున్నారు. టీడీపీ TDP కూటమి తరపున మాజీ మంత్రి Kondru Murali కొండ్రు మురళీ మోహన్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున కంబాల రాజవర్థన్ పోటీ చేస్తున్నారు.

రాజాం నియోజక వర్గానికి గత ఎన్నికల్లో సిఎం జగన్ పలు ఎన్నికల హామీలు ఇచ్చారు. రాజాంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలు నిర్మిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇంత వరకూ స్థలం అధికారికంగా అప్పగించలేదు. రాజాం మండలం వీఆర్ ఆగ్రహారం గ్రామం కూడలి సమీపంలో ప్రభుత్వ భూమిని రెండు ఎకరాలు గుర్తించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించినా అధికారికంగా అప్పగించలేదు. భవన నిర్మాణాలకు నిధులు మంజూరు కాలేదు. భవనాలు నిర్మాణానికి నోచుకోలేదు. ప్రస్తుతం రాజాం ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాల భవనాల్లోనే డిగ్రీ తరగతులు కొనసాగుతున్నాయి. ఉదయం డిగ్రీ తరగతులు, మధ్యాహ్నం నుంచి ఇంటర్ తరగతులు ఒక్కో పూట చొప్పున నిర్వహిస్తున్నారు.

  • తోటపల్లి ఎడమ, కుడి కాలువలను ఆధునికీకరిస్తా మని చెప్పినా ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరు కాలేదు. కాలువలో పూడికలు తీయడానికి చర్యలు తీసుకోక పోవడంతో శివారు ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ఎడమ కాలువ ఆధునికీరణ పనులు ప్రగతిలో ఉన్నాయి.
  • వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల్లో మడ్డువలస కాలువను ఆధునికీకరిస్తామని సిఎం హామీ ఇచ్చారు. కాలువ నిర్మాణం దశాబ్దన్నర క్రితమే గత తెదేపా హయాంలో పూర్తయింది. కాలువకు పూర్తిగా లైనింగ్ పనుల చేపట్టి ఆధునికీకరణ చేపడితే శివారు ఆయకట్టు వరకూ సాగునీరు పరుగులు తీస్తుందని ప్రణాళిక రూపొందించారు. రెండో దశ పనుల్లో దీన్ని చేర్చారు. పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు.
  • సంతకవిటి మండలం బసలరేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మిస్తామని చెప్పినా పూర్తి కాలేదు.

సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు హామీలు…

  • రాజాం పట్టణంలో ప్రధాన రహదారులను విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు. చీపురుపల్లి, పాలకొండ రహదారులు విస్తరణకు రూ.30 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి.
  • రాజాం పురపాలక సంఘానికి నూతన భవనం నిర్మిస్తామన్నారు. నేటికీ భవన నిర్మాణానికి స్థలం గుర్తించలేదు. రెండు, మూడు స్థలాలు పరిశీలించినా తుది నిర్ణయం వెల్లడి కాలేదు. భవన నిర్మాణానికి నిధులూ మంజూరు కాలేదు.
  • రాజాం-బొబ్బిలి ప్రధాన రహదారి నుంచి దోసరి వెళ్లే రహదారిని నవీకరిస్తామన్నా పని ఒక్కటే పూర్తైంది.

నియోజకవర్గంలో సమస్యలు:

  • రాజాం మండలం: రాజాం పట్టణంలో రహదారుల విస్తరణ పనులు అర్దాంతరంగా నిలిచిపోయాయి. రూ.20 కోట్లతో చేపట్టిన పనులు బిల్లుల మంజూరు కాకపోవటంతో గుత్తేదారు నిలిచిపేసి వెళ్లిపోయారు. గాయత్రీ కాలనీ నుంచి బొబ్బిలి కూడలి వరకూ, జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి అంబేడ్కర్ కూడలి వరకూ రహదారిని 80 అడుగుల మేర విస్తరించాల్సి ఉంది. ఇరువైపులా కాలువలు నిర్మించాలి. రహదారి మధ్యలో డివైడర్ను నిర్మించాలి. ఈపనులు చేపట్టక పోవటంతో రహదారిపై రాళ్లు తేలాయి. గోతులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దుమ్ము, ధూళితో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
  • రాజాం పట్టణంలో డిగ్రీ కళాశాలకు స్థల సమస్య వెంటాడుతోంది. సొంత భవనాలు లేకపోవటంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతులు కొనసాగుతున్నాయి. ఉదయం డిగ్రీ తరగతులు, మధ్యాహ్నం ఇంటర్ తరగతులు చేడపతున్నారు. రాజాం మండలం అంతకాపల్లి గ్రామం సమీపంలో డిగ్రీ కళాశాల భవనాల కోసం రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినా ఇంత వరకూ అధికారికంగా అప్పగించలేదు.

తదుపరి వ్యాసం