Pawan on Jagan: వైసీపీ కనుసన్నల్లోనే కాపు రిజర్వేషన్ ఉద్యమ విధ్వంసం జరిగిందన్న పవన్ కళ్యాణ్….-pawan kalyan said that kapu reservation movement was destroyed by ycp ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pawan On Jagan: వైసీపీ కనుసన్నల్లోనే కాపు రిజర్వేషన్ ఉద్యమ విధ్వంసం జరిగిందన్న పవన్ కళ్యాణ్….

Pawan on Jagan: వైసీపీ కనుసన్నల్లోనే కాపు రిజర్వేషన్ ఉద్యమ విధ్వంసం జరిగిందన్న పవన్ కళ్యాణ్….

Sarath chandra.B HT Telugu
Apr 29, 2024 08:21 AM IST

Pawan on Jagan: కాపు రిజర్వేషన్‌ ఉద్యమ సమయంలో కిరాయిమూకలు రైలు తగలబెడితే అమాయకులైన యువత కేసుల్లో ఇరుకున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వైసీపీ కనుసన్నల్లోనే తుని విధ్వంసం జరిగిందన్నారు.

జగ్గంపేట ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్
జగ్గంపేట ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్

Pawan on Jagan: ఏపీలో కాపులకు Kapu Reservations రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసినా వైసీపీsa నేతలు కుట్ర చేశారని Pawan Kalyan ఆరోపించారు. రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పిన జగన్ కు కాపు నాయకులు ఎందుకు అండగా నిలబడ్డారో ప్రశ్నించాలన్నారు. సినిమా నటులు నిజాయతీగా సంపాదించి రాజకీయాలు చేయకూడదా.. అని పవన్ ప్రశ్నించారు.

జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి Kirlampudiలో జరిగిన Varahi Vijaya Bheri వారాహి విజయభేరి సభలో ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏ ఉద్యమం అయినా త్రికరణశుద్దిగా జరగాలని లేకుంటే అమాయకులు బలైపోతారన్నారు.

కాపు రిజర్వేషన్ ఉద్యమంలో వైసీపీ నాయకులకు రిజర్వేషన్లు రావని ముందే తెలుసని కాపులను మోసం చేయాలని, ఎగదోయాలని పన్నాగం పన్ని కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని అసంపూర్తిగా వారికి అనుకులంగా మలుచుకున్నారని ఆరోపించారు.

2014లో జరిగిన కాపు రిజర్వేషన్ ఉద్యమం మొత్తం వైసీపీ నాయకుల కనుసన్నల్లో జరిగిందని, కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతికి చెందిన కరుణాకర్ రెడ్డి వంటి నాయకులు రిజర్వేషన్ రాదని తెలిసినా కాపులను కావాలని వారి అవసరానికి ఉద్యమం చేసేలా ఎగదోశారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

ఏ ఉద్యమం అయినా ఒక దశ దిశతో అహింసాయుతంగా ముందుకు వెళ్లాలి. సమాజంలో ఉన్నవారందరని ఉద్యమం ప్రభావితం చేయాలి, వారి మద్దతు కూడగట్టుకోవాలి. కాపు రిజర్వేషన్ ఉద్యమం సమయంలో కొబ్బరి కిరాయి మూకలను పెట్టి వైసీపీ మూకలే ట్రైన్ తగలబెట్టించారని ఆరోపించారు.

కిరాయిమూకలు చేసిన పనికి అమాయకులైన కాపు యువత కేసులు ఎదుర్కొన్నారు. వారి జీవితమంతా ఫణంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కానీ అందరూ కలిసి పోరాడి సాధించుకున్నారని, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారని చెప్పారు.

మందకృష్ణ ఉద్యమానికి ప్రధాని మద్దతు…

మంద కృష్ణ మాదిగ రెండు దశాబ్ధల పాటు సాగించిన ఉద్యమం ఫలితంగానే ఈ రోజు ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మద్దతు తెలిపారని, ఒక కుల ఉద్యమం అయినా, రాష్ట్ర ఉద్యమం అయినా త్రికరణ శుద్ధిగా పనిచేయలన్నారు. లేకపోతే సమాజంలో అమాయకులైన యువత కల్లబొల్లి మాటలకు బలైపోతారన్నారు.

జగన్‌ను కాపు నాయకులు ఎందుకు ప్రశ్నించలేదు

కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని జగన్ ఖరాకండీగా చెప్పాడు. అయినా కొంతమంది కాపు నాయకులు ఆయనకు మద్దతు తెలిపారని, కాపు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పినా జగన్ కు మీరు ఎలా మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు. రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలో ఉందని అనుకున్నా కనీసం ఈబీసీ రిజర్వేషన్ 5 శాతం తొలగించినా కాపు నాయకులు ఎందుకు మాట్లాడ లేదన్నారు. కాపులకు 5 శాతం కాదు రెండు, మూడు శాతమైనా ఇవ్వొచ్చు కదా..? అరశాతం కూడా రిజర్వేషన్ ఇవ్వని జగన్ కు ఎందుకు ఓట్లు వేయాలని నిలదీయండి. జగన్ కు ఓటు వేయాలని వచ్చే కాపు నాయకులను గట్టిగా నిలదీయాలన్నారు.

• అవినీతిని అరికడితే ఎలాంటి పథకాలు అయినా అమలు సాధ్యమే

రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైసీపీ నాయకుల అవినీతి, దోపిడీయే కనిపిస్తోంది. ఇసుక దోచేస్తున్నారు. మట్టిని మింగేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి మేలు చేయని ఇలాంటి అరటిపండు తొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేద్దామన్నారు.

కూటమి ప్రకటించిన పథకాలు అమలు సాధ్యం కాదని చెబుతున్నాడని, అవినీతిని అరికడితే పథకాలు సాధ్యమేనన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి రూ. 450 కోట్లు పక్కదారి పట్టించారని, జాతీయ ఉపాధి హామీ నిధులు దోచేశారని, చివరకు చిన్నపిల్లలకు పంపిణీ చేస్తున్న చెక్కీల్లో కూడా రూ. 65 కోట్లు దోచేశారని ఆరోపించారు.

సంబంధిత కథనం