AP TS Congress Candidates : ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల- ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్ మార్ మల్లన్న-congress released final list ap ts lok sabha assembly candidate teenmar mallanna got graduate mlc seats ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Ts Congress Candidates : ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల- ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్ మార్ మల్లన్న

AP TS Congress Candidates : ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల- ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్ మార్ మల్లన్న

Bandaru Satyaprasad HT Telugu
Apr 24, 2024 09:34 PM IST

AP TS Congress Candidates : ఏపీ, తెలంగాణ అభ్యర్థుల తుది జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుండడంతో మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్.

కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా
కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా

AP TS Congress Candidates : ఏపీ, తెలంగాణ అభ్యర్థుల తుది జాబితాను(AP TS Congress Candidates List) కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణలో మూడు లోక్ సభ, ఎమ్మెల్సీ ఉపఎన్నిక, ఏపీలో మూడు లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో పలు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. తాజా జాబితాలో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను(Congress Candidates) మార్చింది. చీపురుపల్లి, విజయవాడ తూర్పు, కొండపి, తెనాలి, మార్కాపురం అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను మార్చింది. ఈ నెల 22న విడుదల చేసి జాబితాలో కూడా 10 స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చిన విషయం తెలిసిందే. పొత్తుల్లో భాగంగా గుంటూరు లోక్ సభ స్థానం, 8 అసెంబ్లీ సీట్లు సీపీఐకి, అరకు లోక్ సభ సీటు, 8 అసెంబ్లీ స్థానాలు సీపీఎంకి కేటాయించింది కాంగ్రెస్.

ఏపీ లోక్‌సభ అభ్యర్థులు(Lok Sabha Candidates)

  • నర్సాపురం - కొర్లపాటి బ్రహ్మానందరావు నాయుడు(కె.బి.ఆర్ నాయుడు)
  • రాజంపేట - షేక్‌ బషీద్‌
  • చిత్తూరు (SC)- ఎమ్.జగపతి

ఏపీ అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు(Assembly Candidates)

  • చీపురుపల్లి - జమ్ము ఆదినారాయణ(తుమ్మగంటి సూరినాయుడుకి బదులుగా)
  • శృంగవరపుకోట -గేదెల తిరుపతి
  • విజయవాడ తూర్పు - పొనుగుపాటి నాంచారయ్య(సుంకర పద్మశ్రీకి బదులుగా)
  • తెనాలి - చందు సాంబశివుడు(షేక్ బషీద్ కు బదులుగా)
  • బాపట్ల -గంటా అంజిబాబు
  • సత్తెనపల్లి - చుక్కా చంద్ర పాల్‌
  • కొండపి (SC) - పసుమర్తి సుధాకర్‌(శ్రీపతి సతీష్ స్థానంలో)
  • మార్కాపురం- సయ్యద్‌ సావేద్‌ అన్వర్‌(షేక్ సైదా స్థానంలో)
  • కర్నూలు - షేక్‌ జిలాని బాషా
  • ఎమ్మిగనూరు - మారుముళ్ల ఖాసీం వలీ
  • మంత్రాలయం - పీఎస్‌ మురళీ కృష్ణరాజు

తెలంగాణలో మిగిలిన మూడు లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. రేపటితో నామినేషన్ల గడువు ముగియడంతో అభ్యర్థులను ఫైనల్ చేసింది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం లోక్ సభ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. వరంగల్, ఖమ్మం,నల్గొండ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు తీన్ మార్ మల్లన్న(Teenmar Mallanna)ను అభ్యర్థిగా ప్రకటించింది.

తెలంగాణ లోక్ సభ అభ్యర్థులు వీరే(TS congress Candidates)

  • కరీంనగర్ - వెలిచాల రాజేందర్ రావు
  • హైదరాబాద్- మహమ్మద్ సమీర్
  • ఖమ్మం- రామశ్యామ్ రఘురామ్ రెడ్డి

సంబంధిత కథనం