AP Congress MLA Candidates : ఏపీలో మరో 38 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు - లిస్ట్ ఇదే-congress party has announced candidates for 38 more assembly seats in andhrapradesh ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Congress Mla Candidates : ఏపీలో మరో 38 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు - లిస్ట్ ఇదే

AP Congress MLA Candidates : ఏపీలో మరో 38 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు - లిస్ట్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 22, 2024 12:23 PM IST

AP Assembly Elections 2024 : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో 38 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు ఇవాళ ప్రకటన విడుదల చేసింది.

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులు
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులు

AP Assembly Elections 2024 : ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే(AP Assembly Elections) అభ్యర్థులకు సంబంధించి మరో జాబితాను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఈ లిస్ట్ లో 38 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం నుంచి అంబటి కృష్ణారావు, బొబ్బిలి నుంచి విద్యాసాగర్ పేరు ఖరారైంది. గజపతినగరం నియోజకవర్గం నుంచి డొలా శ్రీనివాస్ కు అవకాశం దక్కింది. తాజా జాబితాలో పలువురు అభ్యర్థులను మార్చారు.

ఏపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా:

 1. శ్రీకాకుళం - అంబటి కృష్ణారావు (పాడి నాగభూషణరావు స్థానంలో)
 2. బొబ్బిలి- మరిపి విద్యాసాగర్‌
 3. గజపతినగరం- దోలా శ్రీనివాస్‌ (కురిమినాయుడు స్థానంలో)
 4. ఆచంట - నెక్కంటి వెంకట సత్యనారాయణ
 5. విజయవాడ (ఈస్ట్‌) - సుంకర పద్మశ్రీ
 6. జగ్గయ్యపేట - కర్నాటి అప్పారావు
 7. తాడికొండ (ఎస్సీ) - మణిచల సుశీల్‌ రాజా (చిలకా విజయ్‌ కుమార్‌ స్థానంలో..)
 8. రేపల్లె - మోపిదేవి శ్రీనివాసరావు
 9. మైదుకూరు- గుండ్లకుంట శ్రీరాములు
 10. ఆళ్లగడ్డ- బారగొడ్ల హుస్సేన్‌
 11. శ్రీశైలం- అసర్‌ సయ్యద్‌ ఇస్మాయిల్‌
 12. బనగానపల్లె - గూటం పుల్లయ్య
 13. డోన్‌ - గారపాటి మధులెట్టి స్వామి
 14. ఆదోని - గొల్ల రమేశ్‌
 15. ఆలూరు - నవీన్‌ కిషోర్‌ ఆరకట్ల
 16. కల్యాణ్‌దుర్గం- పి. రాంభూపాల్ రెడ్డి
 17. హిందూపురం - మహ్మద్‌ హుస్సేన్‌ ఇనయతుల్లా (వి నాగరాజు స్థానంలో)
 18. ధర్మవరం- రంగాన అశ్వర్థ నారాయణ
 19. తెనాలి - ఎస్‌కే బషీద్‌
 20. గుంటూరు వెస్ట్‌ - డాక్టర్‌. రాచకొండ జాన్‌ బాబు
 21. చీరాల - ఆమంచి కృష్ణమోహన్‌
 22. ఒంగోలు - తుర్లపాక నాగలక్ష్మీ (బుట్టి రమేశ్‌బాబు స్థానంలో)
 23. కనిగిరి - దేవరపల్లి సుబ్బారెడ్డి (కదిరి భవానీ)
 24. కావలి - పొదలకూరి కల్యాణ్‌
 25. నెల్లిమర్ల - ఎస్‌.రమేశ్‌కుమార్‌
 26. విశాఖపట్నం ఉత్తరం - లక్కరాజు రామారావు
 27. చోడవరం - జగత్‌ శ్రీనివాస్‌
 28. యలమంచిలి - టి.నర్సింగ్‌ రావు
 29. పి.గన్నవరం (ఎస్సీ) - కె.చిట్టిబాబు
 30. కోవూరు - నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి (నెబ్రంబాకం మోహన్‌ స్థానంలో)
 31. సర్వేపల్లి - పి.వి. శ్రీకాంత్‌రెడ్డి (పూల చంద్రశేఖర్‌ స్థానంలో)
 32. గూడురు (ఎస్సీ) డాక్టర్‌. యు రామకృష్ణారావు (వేమయ్య చిలుకూరి స్థానంలో)
 33. సూళ్లూరుపేట(ఎస్సీ- చందనమూడి శివ (గడి తిలక్‌బాబు స్థానంలో)
 34. వెంకటగిరి - పి.శ్రీనివాసులు
 35. కడప- తుమ్మన్‌ కల్యాల్‌ అస్జల్‌ అలీఖాన్‌
 36. పులివెందుల- మూలంరెడ్డి ధ్రువకుమార్‌ రెడ్డి
 37. జమ్మలమడుగు - బ్రహ్మానందరెడ్డి పాముల
 38. ప్రొద్దుటూరు - షేక్‌ పూల మహ్మద్‌ నజీర్‌

 

ఏపీలో పోటీ చేసే లోక్ సభ అభ్యర్థులకు సంబంధించి ఆదివారం మరో జాబితాను ప్రకటించింది కాంగ్రెస్(Congress) అధినాయకత్వం. తొలి జాబితాలో ఐదు మందిని ఖరారు చేయగా…తాజాగా విడుదల చేసి లిస్ట్ లో 9 మందిని ఫైనల్ చేసింది. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పి.పరమేశ్వరరావు పేరు ఖరారు కాగా…. విజయనగరం సీటు నుంచి బొబ్బిలి శ్రీనుకు అవకాశం ఇచ్చింది. అమలాపురం నుంచి జంగా గౌతమ్‌, మచిలీపట్నం స్థానం నుంచి గొల్లు కృష్ణ పేరు ఖరారైంది.అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి మల్లికార్జున్‌ వజ్జలకు అవకాశం దక్కింది.

ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల మూడో జాబితా

శ్రీకాకుళం - పి.పరమేశ్వరరావు

విజయనగరం - బొబ్బిలి శ్రీను

అమలాపురం - జంగా గౌతమ్‌

మచిలీపట్నం - గొల్లు కృష్ణ

విజయవాడ - వల్లూరు భార్గవ్‌

ఒంగోలు - ఈద సుధాకర్‌రెడ్డి

నంద్యాల - జె.లక్ష్మీ నరసింహ యాదవ్‌

అనంతపురం - మల్లికార్జున్‌ వజ్జల

హిందూపురం - బీఏ సమద్‌ షహీన్‌

ఏపీ కాంగ్రెస్ రెండో జాబితా లిస్ట్…

విశాఖపట్నం-పులుసు సత్యనారాయణ రెడ్డి

అనకాపల్లె-వేగి వెంకటేశ్

ఏలూరు-కావూరి లావణ్య

నరసరావుపేట-గర్నేపూడి అలెగ్జాండర్ సుధాకర్

నెల్లూరు-కొప్పుల రాజు

తిరుపతి(ఎస్సీ)-డా.చింతా మోహన్

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్…

కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల

కాకినాడ నుంచి మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు

రాజమండ్రి-గిడుగు రుద్రరాజు,

బాపట్ల- జేడీశీలం,

కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్‌

WhatsApp channel