తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Dharmana Land Titling Act: ఏపీలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు చేయమన్న ధర్మాన… విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం

Dharmana Land Titling Act: ఏపీలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు చేయమన్న ధర్మాన… విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం

Sarath chandra.B HT Telugu

29 April 2024, 13:29 IST

    • Dharmana Land Titling Act: ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలుపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ఏపీలో కొత్త చట్టాన్ని అమలు చేయమని ఇప్పటికే ప్రకటించామన్నారు. 
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ధర్మాన
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ధర్మాన

ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ధర్మాన

Dharmana Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ Land Titling Actఅంశంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నామని మంత్రి ధర్మాన Minister Dharmna ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పామన్నారు. మళ్లీ ఇప్పుడు స్పష్టం చేస్తున్నామన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Mamata Banerjee: ‘కేంద్రంలో ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తాం’: మమతా బెనర్జీ

Factcheck: ఇండియా టుడే, టైమ్స్ నౌ సహా సంస్థలు ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదు

EC Serious On CS DGP : ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్- సీఎస్, డీజీపీలకు నోటీసులు

CEO AP Meena: నాలుగు దశల్లో దేశంలోనే అత్యధికం.. ఏపీలో82శాతం పోలింగ్‌ నమోదు.. పట్టణ ప్రాంతాల్లో పెరిగిన ఓటింగ్

భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని BJP బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయమని మంత్రి వివరణ ఇచ్చారు. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకు చేస్తోందని, అదే బీజేపీతో టీడీపీ ఇప్పుడు జట్టు కట్టిన పార్టీలు తమపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీతో జత కట్టిన పార్టీలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు టీడీపీ నేతలు వక్రభాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఆలోచన చేస్తామన్నారు.

న్యాయస్థానాల్లో దాఖలైన పిటిషన్లపై తీర్పులు తర్వాత మాత్రమే ఆ ఆలోచన చేస్తామని ధర్మాన చెప్పారు. అంత వరకూ చట్టాన్ిన అమలు చేయమని గతంలోనే స్పష్టంచేశామన్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు అమలు చేశామని గుర్తు చేశారు. సమగ్ర సర్వే ద్వారా ఎంతో మేలు చేకూరుతోందని, అత్యాధునిక టెక్నాలజీని సర్వేకోసం వినియోగించామని చెప్పారు. దీనివల్ల రికార్డులు అప్ టు డేట్ గా ఉంటాయన్నారు.

పరిపాలన వికేంద్రకరణ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని, గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వస్తాయన్నారు. మొత్తం కంప్యూటరీకరణ జరుగుతుంది, ఆటోమేటిగ్గా మ్యుటేషన్ జరుగుతుందన్నారు. ఇంత చేస్తుంటే..తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. చేతకాని దద్దమ్మలు చేసే తప్పుడు ప్రచారాలన్నారు. రైతులకోసం ఏరోజూ ఆలోచించని దద్దమ్మలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ధర్మాన మండిపడ్డారు.

జగన్Ys Jagan భూములు తీసుకునేవాడా? భూములు పంచేవాడా? ఈ ఐదేళ్ల పాలనే చెబుతుందన్నారు. 26 లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వహక్కులు కల్పించింది జగన్ అని గుర్తు చేశారు. అలాంటి జగన్ మీకు భూములు తీసుకునేవాడిలా కనిపిస్తున్నాడా అని ప్రశ్నించారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇలా జరిగిందా అని ప్రశ్నించారు. దేశంలో ఇంత గొప్ప నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా? అన్న ధర్మాన, చుక్కల భూములను నిరుపేద రైతులకు పంచితే జగన్… మీకు భూములు లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా? అన్నారు.

31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమిని లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా, రాష్ట్రంలో ప్రజలంతా అమయాకులని అనుకుంటున్నారా అన్నారు. మీరేం చెప్తే అది నమ్ముతారన్న భ్రమలో ఉన్నారా అని ప్రశ్నించారు.

ప్రజల చేతిలో ఫోన్ల రూపంలో కోట్లాది ఛానల్స్ ఉన్నాయన్నారు. నిజాలను వారే అందరికీ వివరిస్తారన్నారు. ప్రజల భూములు తీసుకుని వ్యాపారాలు తీసుకునే భావజాలంTDP టీడీపీదని, భూములను నిరుపేదలకు పంచాలన్న భావజాలం జగన్‌‌దన్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఏ వేదికపైనైనా వచ్చి చర్చకు సిద్ధమన్నారు. రైతులకు అనుకూల నిర్ణయలు తప్ప, ఒక్క వ్యతిరేక నిర్ణయాన్నీ తీసుకోలేదన్నారు.

తదుపరి వ్యాసం