తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : 8ఏళ్ల బాలిక రేప్​- హత్య.. నిందితుడి వయస్సు 13ఏళ్లు!

Crime news : 8ఏళ్ల బాలిక రేప్​- హత్య.. నిందితుడి వయస్సు 13ఏళ్లు!

Sharath Chitturi HT Telugu

29 April 2024, 12:41 IST

  • Boy kill girl in Ghaziabad :  ఓ 13ఏళ్ల బాలుడు.. 8ఏళ్ల బాలికను రేప్​ చేసి చంపేశాడు. మృతదేహాన్ని దాచిపెట్టేందుకు తన 11ఏళ్ల సోదరుడి సాయం తీసుకున్నాడు.

8ఏళ్ల బాలిక రేప్​- హత్య.. నిందితుడి వయస్సు 13ఏళ్లు!
8ఏళ్ల బాలిక రేప్​- హత్య.. నిందితుడి వయస్సు 13ఏళ్లు!

8ఏళ్ల బాలిక రేప్​- హత్య.. నిందితుడి వయస్సు 13ఏళ్లు!

Ghaziabad crime news : ఘజియాబాద్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 8ఏళ్ల బాలికను.. ఆమె బంధువు రేప్​ చేసి, చంపేశాడు. అతని వయస్సు 13ఏళ్లు! మృతదేహాన్ని మాయం చేసేందుకు.. ఆ బాలుడు.. తన 11ఏళ్ల సోదరుడి సాయం తీసుకున్నాడు. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది.

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

ఇదీ జరిగింది..

బాధితురాలిపై 13ఏళ్ల బాలుడు.. నెల రోజు క్రితం లైంగిక దాడి చేశాడు. ఆ విషయాన్ని ఆ బాలిక.. కొన్ని రోజుల క్రితం.. బాలుడి తండ్రికి చెప్పింది. కోపంతో.. బాలుడిని కొట్టాడు అతని తండ్రి. ఫలితంగా.. బాలికపై 13ఏళ్ల బాలుడికి కోపం పెరిగింది.

ఈ నేపథ్యంలో.. ఈ నెల 20న బాలుడు.. బాలికను ఎవరూ లేని ఒక స్టోర్​రూమ్​కి తీసుకెళ్లాడు. ఆమెను రేప్​ చేశాడు. అరిచేందుకు ఆ 8ఏళ్ల బాలిక ప్రయత్నించగా.. ఆమె తలపై ఇటుకటో కొట్టాడు. ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని మాయం చేయాలని నిర్ణయించుకున్న ఆ 13ఏళ్ల బాలుడు.. తన సోదరుడికి కాల్​ చేశాడు. అతని వయస్సు 11ఏళ్లు! ఇద్దరు కలిసి.. బాలిక మృతదేహాన్ని సమీపంలోని డ్రైనేజ్​లో పడేసి వెళ్లిపోయారు.

బాలిక కనిపించకుండా పోవడంతో.. ఆమె కుటుంబసభ్యులు వెతకడం మొదలుపెట్టారు. కానీ ఆరోజు బాలిక దొరకలేదు. మరుసటి రోజు.. 11ఏళ్ల బాలుడు.. ఓ కట్టుకథ అల్లి.. కుటుంబసభ్యులు, స్థానికులను డ్రైనేజ్​ దగ్గరికి తీసుకెళ్లాడు.

Boy rapes girl : "ఓ 65ఏళ్ల వ్యక్తి.. డ్రైనేజ్​లో బాడి దొరుకుతుందని, చూడమని చెప్పాడు. ఆయన ఎవరో నాకు తెలియదు," అని ఆ బాలుడు.. అందరికి చెప్పాడు. డ్రైనేజ్​లో బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా.. అసలు బాలిక మృతదేహాన్ని మొదట ఎవరు చూశారు? అని స్థానికులను ప్రశ్నించారు. వారు.. ఆ 11ఏళ్ల బాలుడిని చూపించారు. అతను మళ్లీ.. అదే కట్టుకథ పోలీసులకు చెప్పాడు. కానీ పోలీసులకు నమ్మకం కుదరలేదు. చివరికి.. ఆ 11ఏళ్ల బాలుడిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అతను జరిగినదంతా చెప్పేశాడు.

Boy rapes 8 year old girl : మరోవైపు.. 13ఏళ్ల ప్రధాన నిందితుడు.. ఘజియాబాద్​ నుంచి 17కి.మీల దూరంలోనే తన తాత ఇంటికి వెళ్లిపోయాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. చివరికి.. అతడిని పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయలో.. 13ఏళ్ల బాలుడు బాగా ఏడిచాడు. జరిగినది వివరించాడు.

నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు.. బాలికపై లైంగిక దాడి జరిగిందని పోస్టుమార్టం నివేదికలో తేలింది.

తదుపరి వ్యాసం