తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Step Father Rapes Girl : బాలిక, బాలుడుపై సవతి తండ్రి అత్యాచారం.. సాయం చేసిన బిడ్డల తల్లి!

Step father rapes girl : బాలిక, బాలుడుపై సవతి తండ్రి అత్యాచారం.. సాయం చేసిన బిడ్డల తల్లి!

Sharath Chitturi HT Telugu

12 April 2024, 11:59 IST

google News
  • Step father rapes girl : బాలిక, బాలుడుపై సవతి తండ్రి అత్యాచారం చేసిన ఘటన ఘజియాబాద్​లో కలకలం రేపింది. ఈ నేరంలో.. బిడ్డల తల్లి సాయం చేయడం గమనార్హం!

పిల్లలపై సవతి తండ్రి అత్యాచారం..
పిల్లలపై సవతి తండ్రి అత్యాచారం..

పిల్లలపై సవతి తండ్రి అత్యాచారం..

Ghaziabad crime news : ఘజియాబాద్​లో అత్యంత దారుణ, అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. 11ఏళ్ల బాలిక, 13ఏళ్లు బాలుడుపై.. వారి సవతి తండ్రి ఏడాదిగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు.. ఆ పిల్లల తల్లి సాయం చేయడం గమనార్హం!

ఇదీ జరిగింది..

సంబంధిత పిల్లల తండ్రి.. కొవిడ్​ మహమ్మారి సమయంలో మరణించాడు. వారికి ఆరేళ్ల తమ్ముడు కూడా ఉన్నాడు. కాగా.. భర్త మరణం తర్వాత.. పిల్లలను ఘజియాబాద్​లో వదిలేసిన తల్లి.. ఫిరోజాబాద్​లోని అత్తారింట్లో నివాసముంది.

దాదాపు ఏడాది క్రితం.. ఆ మహిళ మళ్లీ ఘజియాబాద్​కు వచ్చింది. ఆమె.. ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. అతను స్థానిక వ్యక్తి అని సమాచారం. కాగా.. అతనికి అప్పటికే పెళ్లి జరిగి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మహిళతో పరిచయం అవ్వడం, ఆమెను కూడా ఆ వ్యక్తి పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత.. తాను ఉంటున్న ఇంటి దగ్గర ఒక రూమ్​ని రెంట్​ తీసుకున్న ఆ వ్యక్తి.. కొత్త భార్యను, ఆమె పిల్లలను అందులో ఉండమని చెప్పాడు.

Woman Tortures daughter and son : అప్పటి నుంచి బాలిక, బాలుడుకు నరకం మొదలైంది! ఆ వ్యక్తి.. ఆ పిల్లలను ఏడాదిగా రేప్​ చేస్తూ వచ్చాడట. ఈ విషయం తల్లికి చెప్పి బాధపడిన పిల్లలకు మరో షాక్​ తగిలింది. 'ఈ విషయం ఎవరికి చెప్పకండి, చెబితే ఊరుకోను,' అని బెదిరించేదట ఆ తల్లి. అంతేకాదు.. వారిని చాలాసార్లు కొట్టిందట.

ఇక తనపై అత్యాచారాన్ని భరించలేకపోయిన 13ఏళ్ల బాలుడు.. గత నవంబర్​లో ఇంట్లో నుంచి పారిపోయాడు. స్థానిక టీ కొట్టు దగ్గర ఆశ్రయం తీసుకోవడం మొదలుపెట్టాడు. కానీ బాలికపై అత్యాచారం కొనసాగుతూ వచ్చింది. బాలిక కూడా.. ఇక సహించలేక, ఈ ఏడాది జనవరిలో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమెను దిల్లీ పోలీసులు రక్షించారు.

"బాలిక చాలా మనోవేదనకు గురైంది. పెద్దగా సమాచారం ఇవ్వలేదు. లోనీ బార్డర్​ దగ్గర ఉంటామని మాత్రమే చెప్పింది. ఎఫ్​ఐఆర్​ నమోదు చేశాము," అని దిల్లీ పోలీసులు చెప్పారు. ఆ తర్వాత.. కేసును ఘజియాబాద్​ పోలీసులకు బదిలీ చేసినట్టు వివరించారు.

Man rapes step daughter : బాలిక విషయంపై మరింత సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇన్​ఫార్మర్లకు విషయం చెప్పి.. బాలిక ఎక్కడ ఉండేదో కనుక్కోమని చెప్పారు.

"మా టీమ్​.. చివరికి బాలిక తల్లిని ట్రేస్​ చేసింది. విచారణలో భాగంగా ఆ మహిళ చాలా విషయాలు చెప్పుకొచ్చింది. 'నా భర్త నన్ను వ్యభిచారంలోకి దింపేందుకు ప్రయత్నించాడు. అతను డబ్బులు సంపాదించేందుకు ఇలా చేశాడు,' అని చెప్పింది. ఆమె స్టైట్​మెంట్​తో ఆ వ్యక్తిని అరెస్ట్​ చేశాము. విచారణలో అతను నిజం ఎప్పుకున్నాడు. బాలిక, బాలుడును మాటిమాటికి రేప్​ చేసినట్టు అంగీకరించాడు," అని ఓ పోలీసు అధికారి చెప్పారు.

Crime news latest : విచారణలో భాగంగా.. బాలుడు ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పింది ఆ మహిళ. అతడిని నుంచి స్టేట్​మెంట్​ తీసుకుని.. నిందితులను మెజిస్ట్రేట్​ ఎదుట హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు.

"పిల్లల శరీరాలపై గాయాలు ఉన్నాయి. వారి తల్లి ఇంట్లోనే వారిపై లైంగిక దాడి జరిగింది. నిందితుడి మొదటి భార్యకు.. రెండో పెళ్లి గురించి తెలియదను అనుకుంటున్నాము," అని పోలీసులు తెలిపారు. నిందితులపై పోక్సో చట్టంలోని సెక్షన్​ 376, 377, 323 కింద కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం