తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Up Rape Case : 3ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. పోలీసులపై నిందితుడు కాల్పులు!

UP rape case : 3ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. పోలీసులపై నిందితుడు కాల్పులు!

Sharath Chitturi HT Telugu

10 February 2024, 11:22 IST

google News
  • Minor raped in Uttar Pradesh : 3ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో చోటుచేసుకుంది. నిందితుడు.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు, వారిపై కాల్పులు జరిపాడు!

3ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. పోలీసులపై నిందితుడు కాల్పులు!
3ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. పోలీసులపై నిందితుడు కాల్పులు!

3ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. పోలీసులపై నిందితుడు కాల్పులు!

3 year old raped in Uttar Pradesh : ఉత్తర్​ ప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 3ఏళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం ఆమెపై దాడి చేశాడు. పోలీసులు పట్టుకోగా.. వారిపైనా కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు.

ఇదీ జరిగింది..

ఉత్తర్​ ప్రదేశ్​లోని గ్రేటర్​ నోయిడాలో గురువారం జరిగింది ఈ ఘటన. రబుపురా పట్టణం వద్ద చిన్నారి ఏడుపును కొందరు విన్నారు. దగ్గరికి వెళ్లి చూడగా.. ఆమె శరీరం నిండా గాయాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు.. 3ఏళ్ల చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు.. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె అత్యాచారానికి గురైనట్టు ధ్రువీకరించారు.

Uttar Pradesh crime news : ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఓవైపు చిన్నారి తల్లిదండ్రులు ఎవరు? వంటి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే.. మరోవైపు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. రాహుల్​ గౌతమ్​ అనే వ్యక్తిని అరెస్ట్​ చేశారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. నిందితుడు.. తానే నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు.

మరోవైపు.. దర్యాప్తులో భాగంగా ఆధారాలను సేకరించేందుకు నిందితుడుని ఘటనాస్థలానికి తీసుకు వెళ్లారు పోలీసులు. చిన్నారి దుస్తులను పోలీసులు సేకరిస్తుండగా.. నిందితుడు వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.

Minor raped in UP : "మా సెర్చ్​ టీమ్​.. నిందితుడిని తీసుకుని ఘటనాస్థలానికి వెళ్లింది. అప్పుడే.. పోలీసు తుపాకీని లాక్కున్నాడు నిందితుడు. కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. ఆత్మరక్షణలో భాగంగా.. నిందితుడిని పోలీసులు కాలిపై కాల్చారు. అతడికి గాయమైంది. అతడిని పట్టుకున్నాము," అని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు, అతడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు.

మరోవైపు.. 3ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిందన్న వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని.. మహిళలు సహా స్థానికులు.. రబుపురా పోలీస్​ స్టేషన్​ ఎదుట నిరసనకు దిగారు.

తదుపరి వ్యాసం