Rajasthan rape case : 16ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం- బంధువులే నిందితులు..
28 January 2024, 14:42 IST
Rajasthan rape case : 16ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాజస్థాన్‌లో వెలుగులోకి వచ్చింది. ఆమె గర్భం దాల్చింది. మామ, అతని కొడుకే నిందితులు.
16ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం- బంధువులే నిందితులు..
Girl raped by uncle : రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 16ఏళ్ల బాలిక.. రెండు నెలల గర్భవతి అని తెలిసింది. బాలిక మామ, అతని కుమారుడు.. గత కొంత కాలంగా ఆమెను రేప్ చేయడంతో గర్భం దాల్చింది!
ఇదీ జరిగింది..
రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది ఈ ఘటన. స్థానికంగా నివాసముంటున్న ఓ కుటుంబంలో ఓ 16ఏళ్ల బాలిక ఉంది. కాగా.. గతేడాది అక్టోబర్‌లో.. బాలిక మామ, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత, అతని కొడుకు కూడా ఆమెను రేప్ చేశాడు. అప్పటి నుంచి.. ఆమెపై అనేకమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే, చంపేస్తామని బెదిరించింది. అందుకే.. ఆ బాలిక ఎవరికి చెప్పలేదు. లోలోపల నరకం అనుభవించింది.
Girl raped by uncle in Rajasthan : ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం, బాలిక ఆరోగ్యం దెబ్బతింది. ఆమె రెండు నెలల గర్భవతి అని తేలింది. ఏం జరిగింది? అని కుటుంబసభ్యులు ప్రశ్నించగా.. తొలుత ఆమె చెప్పలేదు. కానీ చివరికి.. ఆమె తనపై జరిగిన రేప్‌ను వివరించింది. కాగా.. కుటుంబం పరువు పోతుందన్న ఆలోచనతో.. అబార్షన్ కోసం బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. ఆమెకు అబార్షన్ చేయించారు.
శుక్రవారం నాడు బాలిక.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఆ తర్వాత.. ఆమె సోదరుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. తన సోదరిపై జరిగిన రేప్ ఘటనను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పరారీలో నిందితులు..
ఘటనపై బాలిక స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు.. ఆమె మామ, అతని కొడుకుపై పోక్సో సహా ఇతర చట్టాలపై కేసు నమోదు చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. అప్పటికే పారిపోయారు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Rajasthan crime news : "బాధిత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాము. రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నాము. నిందితుల కోసం గాలింపు చర్యలు సైతం చేపట్టాము. త్వరలోనే వారిని పట్టుకుంటాము. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది," అని పోలీసులు వెల్లడించారు.