Indore orphanage horror : బాలికలను నగ్నంగా చేసి.. చిత్రహింసలు పెట్టి- అనాథాశ్రమంలో దారుణం..
Indore orphanage horror : ఇండోర్‌లోని ఓ అనాథాశ్రమంలో జరిగిన దారుణ ఘటన సంచలనం సృష్టిస్తోంది. 21మంది బాలికలను సిబ్బంది చిత్రహింసలకు గురిచేసింది.
Indore orphanage horror : మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అనాథ ఆశ్రమంలో 21మంది బాలికలు చిత్రహింసలకు గురయ్యారని తెలుస్తోంది. అక్కడి సిబ్బంది.. బాలికలను నగ్నంగా చేసి, వేధింపులకు గురి చేశారని సమాచారం.
ఇదీ జరిగింది..
మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ అనాథాశ్రమంలో జరిగింది ఈ ఘటన. బాధితుల వయస్సు 4ఏళ్ల నుంచి 16ఏళ్ల మధ్యలో ఉంది. వారిని సిబ్బంది నగ్నంగా చేసి, ఇనుప వస్తువులను కాల్చి వాత పెట్టారని, ఎర్ర మిర్చీలను కాల్చి, ఆ వాసనను పీల్చేలా చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా.. బాలికలను తలకిందులుగా వేలాడదీశారని సమాచారం.
వత్సాల్యపురం జైన్ ట్రస్ట్ ఆధ్వార్యంలో పనిచేస్తున్న ఈ ఇండోర్‌లోని అనాథ ఆశ్రమంలో.. జనవరి 13 చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తాము వేధింపులకు గురైనట్టు, తమకి జరిగినది అధికారులకు వివరించారు బాలికలు.
Indore orphanage crime news : బాలికలు ఇచ్చిన సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పోక్సో చట్టం కింద.. ఇండోర్ అనాథ ఆశ్రమానికి చెందిన నలుగురు సిబ్బందిపై కేసు వేశారు.
"తమను సిబ్బంది చిత్రహింసలకు గురి చేసినట్టు బాలికలు చెప్పారు. వాత్సల్యపురం జైన్ ట్రస్ట్‌కు చెందిన నలుగురు సిబ్బందిపై కేసు నమోదు చేశాము," అని.. అదనపు డీసీపీ అమరేంద్ర సింగ్ తెలిపారు.
ఆ నలుగురు సిబ్బంది పేర్లు ఆయుషి, సుజాత, సుమన్, ఆర్తి.
కాగా.. బాధితుల్లో ముగ్గురు మధ్యప్రదేశ్‌కు చెందిన వారని, మిగిలిన వారు మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్‌కు చెందిన వారని తెలుస్తోంది.
Vatsalyapuram orphanage indore crime : "బాలికల తల్లిదండ్రులే.. వారిని ఆశ్రమంలో వదిలారు. కానీ ఆశ్రమంలో బాలికల భద్రతా విషయంలో లోపాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాము. సీడబ్ల్యూసీ రిపోర్టుతో న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము," అని ఇండోర్ కలెక్టర్ ఆశిస్ సింగ్ తెలిపారు.
వాస్తవానికి ఈ ట్రస్ట్‌కు బెంగళూరు, సూరత్, జోధ్‌పూర్, కోల్‌కతాలో అనాథ ఆశ్రమాలు ఉన్నాయి. కానీ ఇండోర్‌లోని ఆశ్రమానికి రిజిస్ట్రేషన్ లేదని తెలుస్తోంది. ఈ ఆశ్రమంలో వసతులు కూడా సరిగ్గా లేవు. ఒక రూమ్‌లోనే బాలికలు పడుకునేవారు. అదే రూమ్‌లో తినేవారు, అక్కడే చదువుకునేవారు. బట్టలు మార్చుకోవడానికి ఒక్కటే రూమ్ ఉండి! నేలపై దప్పట్లు ఉండేవి.
Madhya Pradesh crime news : "హోంవర్క్ చేయకపోతే.. మమ్మల్ని రెండు రోజుల పాటు చిన్న బాత్రూమ్లో లాక్ చేసేవారు. భోజనం, మంచి నీరు ఇచ్చేవారు కాదు. చాలాసార్లు.. పాడైపోయిన భోజనం పెట్టేవారు. మేము తినము అని అంటే.. బలవంతంగా నోట్లో కుక్కేవారు," అని బాధితుల్లో కొందరు చెప్పారు.
"బయటివారు అనాథాశ్రమంలోకి రావడంపై సరైన నిబంధనలు లేవు. చాలా మంది పురుషులు.. చాలా రోజుల పాటు ఆశ్రమంలో ఉన్నారని తెలుస్తోంది. బాలికపై లైంగిక దాడి జరగలేదు. కానీ వారు చిత్రహింసలు గురయ్యారు. కొందరు బాలికల శరీరాలపై కాలిన గాయాలు ఉన్నాయి. బాధితులకు కౌన్సిలింగ్ ఇస్తున్నాము," అని అధికారులు వివరించారు.
ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.
సంబంధిత కథనం